hybrid planes
-
2030లో గాల్లో ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్
బ్రిటీష్ కు చెందిన ఫరాడైర్ అనే సంస్థ కొత్తగా హైబ్రిడ్ ట్రైప్లేన్‌ను అభివృద్ధి చేస్తున్నది. 2030 నాటికి ప్రయాణికులను తరలించే స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తున్నది. ఈ విమానం ద్వారా స్వల్ప దూరాలకు ప్రయాణికులను, సరుకులను వేగవంతంగా తరలించే అవకాశం ఉంటుంది. 18 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్ధ్యంతో విమానాన్ని రూపొందిస్తున్నారు. హైబ్రిడ్ ట్రైప్లేన్ గరిష్టంగా 5 మెట్రిక్ టన్నులను మోసుకెళ్లే సామర్ధ్యంతో కేవలం 15 నిమిషాల్లో కార్గో విమానంగా మార్చుకునేలా దీనిని సిద్ధం చేస్తున్నారు. బయో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఎయిర్‌క్రాఫ్ట్(బీఈహెచ్ఏ) అని పిలువబడే ఈ మోడల్ లో ఇంధనంగా పేరుకు తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ - బయో ఫ్యూయల్ ఇంధనాన్ని వాడుతున్నారు. పర్యావరణ అనుకూల విమానాన్ని తయారు చేయడం తమ ఉద్దేశ్యమని సంస్థ పేర్కొంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తక్కువ ఖర్చుతో వేగంగా స్వల్ప దూర బాగా ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది. బీఈహెచ్‌ఏలోని రెక్కలు మెరుగైన పనితీరును అందించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఇంకా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ బ్యాటరీలు అందుబాటులో లేవని వారు పేర్కొన్నారు. జీకేఎన్ ఏరోస్పేస్ అనే సంస్థ ఇప్పటికే 50 మంది ప్రయాణికులను తీసుకొళ్లేలా ఒక కాన్సెప్ట్ సిద్ధం చేస్తుంది. చదవండి: కొత్త కారు కొనే వారికి బంపర్ ఆఫర్! -
యూఎస్‌లో దూసుకెళ్తున్న ఢిల్లీ ఐఐటీ స్టూడెంట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఐఐటీకి చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థి ఆశిష్ కుమార్ అమెరికాలో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని కిర్క్లాండ్ అనే సంస్థను స్థాపించడమే కాకుండా దానికి సీఈవోగా పనిచేస్తున్న అతడు అమెరికాలో హైబ్రిడ్ విమానాలను తయారుచేయబోతున్నాడు. ఈ విమానాలు కూడా తిరిగి భారతదేశానికి విక్రయించాలని అనుకుంటున్నాడు. జునుమ్ ఎయిరో అనే సంస్థ ఆధారంగా ప్రాంతీయ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ విమానాలు రూపొందిస్తున్నాడు. దాదాపు 1,100 కిలోమీటర్ల వరకు హైబ్రిడ్ విమానాలను 2020లోగా, 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవాటిని 2030లోగా తయారు చేయనున్నారు. ‘బోయింగ్ అండ్ జెల్‌బ్లూ సంస్థలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. మేం తొలుత 20 సీట్లు ఉండే హైబ్రిడ్ విమానాలతో వస్తాం. ప్రొటోటైప్ విమానాలను మరో రెండేళ్లలో తీసుకొస్తామని నమ్ముతున్నాము. వాణిజ్య విమానాలను 2020నాటిలోగా తీసుకొస్తాము’ అని ఆశిష్ కుమార్ తెలిపాడు. ప్రస్తుతం అతడు మెకానికల్ అండ్ ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో కార్నెల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నాడు.