పేర్లు, పిలుపులలో అసమానులు | Names and calls are uneven | Sakshi
Sakshi News home page

పేర్లు, పిలుపులలో అసమానులు

Published Sun, Dec 24 2017 1:02 AM | Last Updated on Sun, Dec 24 2017 1:02 AM

Names and calls are uneven - Sakshi

ఆదిత్య హృదయం
ఇది క్రిస్మస్‌ పండుగ. ఇప్పుడు నేను ఇంగ్లండ్‌లో ఉంటూ బ్రిటిష్‌ సంప్రదాయం ప్రకారం ఖుషీగా ఉన్నాను. అది సంభాషణ కావచ్చు, తిండి తినడానికి ఉపయోగించే కత్తులూ, కఠార్లూ కావచ్చు, క్యూని పాటించడం లేదా ప్రశ్నిం చడంకావచ్చు... పబ్బులూ, పదాలతో ఆడుకోవడాలూ వంటి అన్నింటిలో బ్రిటిష్‌ పౌరులు తమ సంప్రదాయాలను తప్పకుండా పాటిస్తూంటారు. పురాతన గతంలోకి తొంగిచూస్తూ, వాటికి మార్మికత్వం ఆపాదిస్తూ, మరింత సంక్లిష్టంగా మారుస్తూనే ఆ సంప్రదాయాలను ఇప్పటికీ శ్రద్ధగా, కచ్చితంగా తాము పాటిస్తున్నామని చెబుతుంటారు. దీనికి సంబంధించి బ్రిటిష్‌ నామకరణ పద్ధతి ఒక అద్భుత చిత్రణను అందిస్తుంది.

చిన్న ఉదాహరణతో చర్చను మొదలెడతాను. ఒకప్పుడు యోధుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి సర్‌ క్రిస్టియన్‌ హోదాలోకి మారతాడు కానీ అతడి భార్య మాత్రం మహిళకు చెందిన ఇంటిపేరునే కలిగి ఉంటుంది. కాబట్టే బ్రిటన్‌ పేర్లలో సర్‌ జార్జ్‌ ఉంటారు కానీ సర్‌ బ్రౌన్‌ ఉండరు. కానీ దీనికి కాస్త గందరగోళాన్ని చేర్చుతూ ఒక మహిళ లేడీ బ్రౌన్‌గానూ ఉండవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో లేడీ సారాగా కూడా ఉండవచ్చు. ఏది సరైంది అనేది ఆమె పుట్టి పెరిగిన ప్రత్యేక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. లేడీ బ్రౌన్‌ స్పష్టంగా ఒక వీరయోధుడి భార్యగా ఉంటుంది. లేడీ సారా ఒక డ్యూక్, మార్క్యూస్‌ లేదా ఎర్ల్‌ కుమార్తె అవుతుంది. ఆమె గుర్తింపు భర్త పేరిట కాకుండా తండ్రి పేరుమీద వస్తుంది.

కులీనుడిగా మారినప్పుడు మీరు ప్రభువు హోదాలోకి మారవచ్చు. ఇంకా కొంతమంది లార్డ్‌ క్రిస్టియన్‌ని ఇంటిపేరుగా పిలిచే సంపన్న ప్రభువర్గీయులు ఉన్నారు. కాకపోగా ఇది డ్యూక్‌ లేదా మార్క్యూస్‌ చిన్న కుమారుడిని పిలిచే సరైన పద్ధతి. పెద్ద కుమారుడు తండ్రి రెండో పేరుకు వారసుడై మర్యాదకోసం మార్క్యూస్‌గా మారతాడు. నిజానికి ఒక వ్యక్తి పేరు అతడి లేక ఆమె సొంతానిదా లేక పెళ్లి, వారసత్వం ఫలితంగా వచ్చిందా అని నిర్ధారించడంలో ఈ వ్యత్యాసాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అందుకే పేర్ల విషయంలో అత్యంత కచ్చితత్వం అవసరమవుతుంది.

ఉదాహరణకు మేఘన్‌ మర్కెల్‌ అనే మహిళను వివాహం అయిన తర్వాత ఎలా పిలవాలి అనే విషయం నన్ను ఆలోచనలో పడేసింది. ఆమె ఎన్నటికీ రాకుమారి మేఘన్‌ కాలేదు. ఎందుకంటే ప్రిన్సెస్‌ క్రిస్టియన్‌ అనే పేరు రాజకుమారికి ఉద్దేశించినది. ఆమె ఒక రాజకుమారిగానే పుట్టి ఉంటుంది. మేఘన్‌ మాత్రం వివాహం ద్వారానే రాకుమారి అవుతుంది. అందుచేత ఆమె సరైన పేరు ప్రిన్సెస్‌ హెన్రీ ఆఫ్‌ వేల్స్‌ అవుతుంది. ఆ లెక్కన యువరాణి డయానా ఎన్నటికీ ఆమె నిజ నామం కాదు. ఎందుకంటే ఆమె రాచపుట్టుక పుట్టలేదు. ఆమె భర్త వేల్స్‌ యువరాజు కాబట్టి ఆమె వేల్స్‌ యువరాణి అవుతుంది. బ్రిటన్‌ రాజకుమారుడు విలియమ్స్‌ సతీమణి కేట్‌ విషయంలోనూ ఇదే నిజం. ఆమె వాస్తవానికి కేట్‌ యువరాణి కాదు. ఆమె అసలు హోదా ప్రిన్సెస్‌ విలియం ఆఫ్‌ వేల్స్‌ అన్నమాట.

ఇçప్పుడు ఈ సరైన లేక అసలు పేర్లు కాస్త మోటుగా ఉన్నాయి కాబట్టి, విలియమ్‌ పెళ్లి సందర్భంగా బ్రిటన్‌ రాణి అతడికి డ్యూక్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జి (కేంబ్రిడ్జ్‌ ప్రభువు) అనే హోదాను ప్రసాదించారు. అందుచేత, ఈ దంపతులను ఇప్పుడు హెచ్‌ఆర్‌హెచ్‌ (హిస్‌ రాయల్‌ హైనెస్, హర్‌ రాయల్‌ హైనెస్‌) ప్రిన్స్‌ విలియం అనీ, డచెస్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ (కేంబ్రిడ్జ్‌ ప్రభుపత్ని) అని వ్యవహరిస్తారు. నిస్సందేహంగా ఇదే ప్రభువు హోదాని హెన్రీకి కూడా కట్టబెడతారు. కాబట్టి ఈ లెక్కన మేఘన్‌ యువరాణి హెన్రీ అనే పిలుపునకు నోచుకోదు కానీ ఎవరో ఒకరి ప్రభుపత్ని (డచ్చెస్‌)గా మారుతుంది. ఇదంతా మిమ్మల్ని అయోమయంలో, గందరగోళంలోనూ ముంచెత్తినట్లయితే, మీకు మంచి సాహచర్యం ఇస్తున్నట్లే మరి. యోధులు, వారి మహిళలను ఎలా ప్రస్తావిస్తారు అన్నది మినహాయిస్తే బ్రిటన్‌ పౌరులు సముద్రం వద్ద మాత్రం ఇప్పుడు అంతా సమానులుగానే ఉంటారు. కానీ కోర్టు, పార్లమెంటు, పురాతన పత్రికలు వంటి బ్రిటన్‌ వ్యవస్థలు మాత్రం ఈ పవిత్ర సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తుంటాయి.

ఒక చివరి ఆసక్తికరమైన విషయం ఉంది. బ్రిటన్‌ పార్లమెంటులో ఎంపీలు ప్రతి ఒక్కరినీ గౌరవనీయులుగా సంబోధిస్తుంటారు. మరీ ప్రత్యేకించి ప్రతిపక్ష సభ్యుల విషయంలో ఈ సంబోధనలను తప్పనిసరిగా చేస్తుంటారు. ఇది భాషను మృదువుగా వాడటం కాకుండా వారి నిజమైన ఉద్దేశాన్ని తెలిపే స్వరాన్ని మాత్రమే సూచిస్తుంది. అందుకే ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ కాలేజీల వద్ద ఆగ్రహంతో కూడిన కాపలాదార్లు అక్కడి పచ్చికపై నడిచే డిగ్రీ స్టూడెంట్లపై ఆగ్రహంతో ఇలా అరుస్తుంటారు. ‘ఆ దిక్కుమాలిన పచ్చికనుంచి బయటకు రండి సర్‌!’. అలాగే సంప్రదాయానుసారం కాలేజీ సిబ్బంది కూడా డిగ్రీ స్టూడెంట్లను సర్‌ అనే గౌరవంగా పిలుస్తుంటారు. వారి ఉద్దేశం అది కాకపోయినా ఈ గౌరవపదం మాత్రం వాడుకలో కొనసాగుతోంది.
క్రిస్మస్‌ శుభాకాంక్షలు

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు, కరణ్‌ థాపర్‌
ఈ–మెయిల్‌ : karanthapar@itvindia.net

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement