ప్రముఖ బ్రిటిష్ కంపెనీ యూనిలీవర్ పిఎల్‌సీ తన గ్లోబల్ టీ వ్యాపారాన్ని సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ కు 4.5 బిలియన్ యూరోలకు(సుమారు రూ.37 వేల కోట్లు) విక్రయించడానికి అంగీకరించింది. రెండు సంవత్సరాలకు పైగా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. లిప్టన్, పిజి టిప్స్, పుక్కా హెర్బ్స్, టిఏజెడ్ఒతో సహా వంటి 34 టీ బ్రాండ్లు ఎకాటెర్రా కింద ఉన్నాయి. ఈ కంపెనీ 2020లో 2 బిలియన్ యూరోల ఆదాయాన్ని ఉత్పత్తి చేసింది. అయితే, యూనిలీవర్ తన భారతదేశం, ఇండోనేషియా టీ కార్యకలాపాలను అలాగే పెప్సికో(పెప్) కింద ఉంచుకుంది.
2022 ద్వితీయార్ధంలో ముగిసే ఈ ప్రక్రియలో నగదు, రుణ రహిత ప్రాతిపదికన ఎకాటెర్రాను సీవీసీ క్యాపిటల్ ఫండ్ కు విక్రయించనున్నట్లు యూనిలీవర్ గురువారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో తెలిపింది. బ్లాక్ టీ డిమాండ్ క్షీణించడం, వినియోగదారుల అభిరుచులు మారడంతో అనేక సంవత్సరాలుగా నష్టాలు వస్తున్న వ్యాపారం నుంచి యూనిలీవర్ కు ఉపశమనం లభిస్తుంది. ఈ వ్యాపారం వల్ల మొత్తం కంపెనీ మీద ప్రభావం పడుతుంది. పెరిగి పోతున్న ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి కష్టపడుతోంది, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇదే అతిపెద్ద ఆదాయ వనరు.
(చదవండి: లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు సంపాదించిన మదుపరులు!)
Comments
Please login to add a commentAdd a comment