
సాక్షి, న్యూఢిల్లీ : భాతర గణతంత్ర దినోత్సవ వేడుకలకు(జనవరి 26, 2021) ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారు. నవంబర్ 27న జాన్సన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన ఫోన్ సంభాషణల్లో ఆయన్ను రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా హాజరుకావాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో ఈ సారి 50 శాతం మేర వీక్షకుల పాస్‌లను తగ్గించింది. పాఠశాల విద్యార్థులకు వేడుకల్లో పాల్గొనే అవకాశం లేదు. అలాగే ఆయా రాష్ట్రాల శకటాలను ప్రభుత్వం తగ్గించింది. కరోనా కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది.