
Pilots False Positive Covid Report: కొన్ని ప్రయాణాలు మనం మధురానుభూతుల్ని ఇస్తాయి. కానీ కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్ని ఆందోళనకు గురిచేయడమే కాక మళ్లీ ఇంకెప్పుడు ప్రయాణాలు చేయకూడదనే భావం కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవం బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలోని ప్రయాణీకులకు ఎదురైంది.
(చదవండి: ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్‌లు)
అసలు విషయంలోకెళ్లితే.....బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణీకుల బృందం ఐదు గంటలకు పైగా చిక్కుకుపోయింది. వారు పయనిస్తున్న విమాన పైలట్‌కి కరోనా పాజిటివ్ రావడంతో లండన్ నుండి బార్బడోస్‌కు బయలుదేరాల్సిన విమానాన్ని టేకాఫ్‌కు ముందు బ్రిటిష్ ఎయిర్‌వేస్ నిలిపివేసింది. అయితే అప్పటికప్పుడు మరో పైలెట్‌ని నియమించడం ఆలస్య అవుతుందని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రకటించడమే కాక ప్రయాణికులను విమానంలోంచి దింపేసింది.
నిజానికి ఆ విమానం అప్పటికే రెంగు గంటలు ఆలస్యం. అయితే విమానం బయలుదేరడానికి సిద్ధం అయ్యిందో లేదా మళ్లీ ఈ కారణంగా మరింత ఆలస్యం అవ్వడంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురైయ్యారు. అంతేకాదు ఆ ప్రయాణికులదరికి బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఆహారాన్ని అందజేసింది. అయితే ఐదు గంటల తర్వాత ప్రయాణికులందర్నీ విమానం ఎక్కేందుకు అనుమతి ఇచ్చారు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే పైలట్‌కి కోవిడ్ అని తప్పుడు రిపోర్ట్ వచ్చింది అంటూ ఎయిర్‌వేస్ ప్రకటించడం గమనార్హం.
అంతేకాదు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమపణలు మాత్రమే కాదు మాకు చక్కగా సహకరించినందుకు కూడా ధన్యవాదాలు అని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రయాణికులకు తెలియజేసింది. పైగా బార్బడోస్‌లో దిగినప్పుడు ఆలస్యానికి క్షమాపణలు కోరుతూ ప్రయాణికులకు కరేబియన్ రమ్ బాటిళ్లను అందజేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
(చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!)