false reports
-
సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!
Pilots False Positive Covid Report: కొన్ని ప్రయాణాలు మనం మధురానుభూతుల్ని ఇస్తాయి. కానీ కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్ని ఆందోళనకు గురిచేయడమే కాక మళ్లీ ఇంకెప్పుడు ప్రయాణాలు చేయకూడదనే భావం కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవం బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలోని ప్రయాణీకులకు ఎదురైంది. (చదవండి: ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్‌లు) అసలు విషయంలోకెళ్లితే.....బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణీకుల బృందం ఐదు గంటలకు పైగా చిక్కుకుపోయింది. వారు పయనిస్తున్న విమాన పైలట్‌కి కరోనా పాజిటివ్ రావడంతో లండన్ నుండి బార్బడోస్‌కు బయలుదేరాల్సిన విమానాన్ని టేకాఫ్‌కు ముందు బ్రిటిష్ ఎయిర్వేస్ నిలిపివేసింది. అయితే అప్పటికప్పుడు మరో పైలెట్‌ని నియమించడం ఆలస్య అవుతుందని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటించడమే కాక ప్రయాణికులను విమానంలోంచి దింపేసింది. నిజానికి ఆ విమానం అప్పటికే రెంగు గంటలు ఆలస్యం. అయితే విమానం బయలుదేరడానికి సిద్ధం అయ్యిందో లేదా మళ్లీ ఈ కారణంగా మరింత ఆలస్యం అవ్వడంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురైయ్యారు. అంతేకాదు ఆ ప్రయాణికులదరికి బ్రిటిష్ ఎయిర్వేస్ ఆహారాన్ని అందజేసింది. అయితే ఐదు గంటల తర్వాత ప్రయాణికులందర్నీ విమానం ఎక్కేందుకు అనుమతి ఇచ్చారు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే పైలట్‌కి కోవిడ్ అని తప్పుడు రిపోర్ట్ వచ్చింది అంటూ ఎయిర్వేస్ ప్రకటించడం గమనార్హం. అంతేకాదు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమపణలు మాత్రమే కాదు మాకు చక్కగా సహకరించినందుకు కూడా ధన్యవాదాలు అని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రయాణికులకు తెలియజేసింది. పైగా బార్బడోస్‌లో దిగినప్పుడు ఆలస్యానికి క్షమాపణలు కోరుతూ ప్రయాణికులకు కరేబియన్ రమ్ బాటిళ్లను అందజేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) -
Covid-19: ఆర్టీపీసీఆర్ టెస్టులకు దొరకని కొత్త వేరియెంట్లు
సాక్షి, నేషనల్ డెస్క్: దగ్గుతో మొదలవుతుంది. ఆపై జ్వరం అందుకుంటుంది. ఊపిరి సరిగా ఆడని ఫీలింగ్. కోవిడ్ కాదు కదా? అనే భయం. వెంటనే పరీక్షకు వెళతాం. అత్యంత ప్రామాణికమైనదిగా భావించే ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుంటాం. ‘నెగెటివ్’ రాగానే ఊపిరిపీల్చుకుంటాం. ఇక్కడే మ్యుటేషన్ చెందిన వైరస్ మనల్ని మోసం చేస్తోంది. పరీక్షలకు చిక్కడం లేదు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఇదో ఆందోళనకర పరిణామం. ప్రతి ఐదుగురిలో ఒకరికి ఇలా తప్పుడు రిపోర్టు వచ్చే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు రెండు, మూడో టెస్టుల్లోనూ కరోనా సోకినట్లు బయటపడటం లేదు. ఎందుకిలా? గత ఏడాది (2020) ఆరంభం నాటి సార్స్–కోవ్–2 వైరస్‌ను గుర్తించే విధంగా ఆర్టీపీసీఆర్ టెస్టును డిజైన్ చేశారు. తర్వాత కోవిడ్ వైరస్ అనేక మ్యుటేషన్లకు (రూపాంతరితాలకు) లోనైంది. యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ తదితర వేరియెంట్లు ఎన్నో వచ్చాయి. ఈ రూపాంతరిత వైరస్ కొమ్ములు, ఇతర ప్రాంతాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో అది దొరకడం లేదు. ఎప్పటివో పాత ఫోటోలు పెట్టుకొని తప్పిపోయిన మనిషిని వెతకడం లాంటి పరిస్థితే ఇది. వేలిముద్రలు, ఐరిస్ ఆధారంగా మనుషుల్ని గుర్తించినట్లు... వైరస్‌లోని కొన్ని నిర్దేశిత ప్రాంతాలను (డయాగ్నస్టిక్ టార్గెట్స్)ను గుర్తించడం ద్వారా ఆర్టీపీసీఆర్ టెస్టు కరోనా వైరస్‌ను కనిపెడుతుంది. వైరస్ జన్యుక్రమంలో పలుమార్పులతో ఇప్పుడది సాధ్యపడటం లేదు. యూకే వేరియెంట్ వైరస్‌లోని 69–70 ప్రాంతాల్లో ఉండే న్యూక్లియోడైడ్ బేసెస్ (జన్యు పదార్థం) పూర్తిగా తొలగిపోవడం మూలంగా పరీక్షల కచ్చితత్వంలో తేడాలు వస్తున్నాయి. వైరస్ సోకినా నెగెటివ్ రావడానికి ఇదే కారణమని పెర్కిన్ ఎల్మర్ డయాగ్నస్టిక్స్ జనరల్ మేనేజర్ ఆరవింద్ కె తెలిపారు. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కూడా తప్పుడు ఫలితాలపై ఈ ఏడాది జనవరిలోనే డాక్టర్లను, పేషెంట్లను హెచ్చరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిన్లాండ్లో స్థానిక వేరియెంట్లో న్యూక్లియోప్రొటీన్‌లో తేడాల వల్ల దాన్ని ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో గుర్తించడం కష్టమైంది. ఫ్రెంచ్‌లోని బ్రిటానీ ప్రాంతంలో ఒక వేరియంట్ సోకిన ఎనిమిది మందికీ పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. రక్త నమూనాలు, ఊపిరితిత్తుల్లో నుంచి తీసిన టిష్యూల ఆధారంగా వారికి కరోనాను నిర్ధారించినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అలాగే కొందరిలో వైరస్ నాసికా రంధ్రాల్లో, గొంతులో కేంద్రీకృతం కాకపోవడం కారణంగా కూడా అక్కడి నుంచి తీసిన నమూనాలను పరీక్షించినపుడు... పాజిటివ్ రావడం లేదని డాక్టర్ ప్రతిభా కాలే తెలిపారు. భారత్‌లో సెకండ్ వేవ్‌లో ఇలా పరీక్షల్లో వైరస్ ఏమారుస్తున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. కొన్ని కిట్లపై ఇవి అన్ని కేసుల్లో వైరస్‌ను కచ్చితంగా గుర్తించకపోవచ్చనే ‘గమనిక’ను ముద్రిస్తున్నారు. ప్రమాదం ఏమిటి? ► ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందనే ధీమాతో డాక్టర్‌ను సంప్రదించకపోతే పరిస్థితి విషమిస్తుంది. సకాలంలో వైద్య సహాయం అందదు. ► ఇలాగే మూడు, నాలుగు రోజులు ఆలస్యమైతే వ్యాధి తీవ్రత ముదిరి ప్రాణాల మీదకు రావొచ్చు. ► ఐసోలేషన్‌లో ఉండడు కాబట్టి సదరు వ్యక్తి సూపర్ స్ప్రెడర్గా మారుతాడు. ► అతని మూలంగా ఇంట్లో వాళ్లకి, సన్నిహితంగా మెలిగే వాళ్లకి హైరిస్క్ ఉంటుంది. ► ట్రాక్ చేయడం ఉండదు కాబట్టి... పెళ్లిళ్లు, విందులకు వెళితే ఎంతోమందికి అంటించే ప్రమాదం ఉంటుంది. ► కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చినా లక్షణాలు కొనసాగుతుంటే... మళ్లీ మళ్లీ టెస్టులకు వెళ్లాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇతర పద్ధతుల్లో నిర్ధారించుకోవాలి. కుటుంబసభ్యులకు దూరంగా ఒక గదిలో ఐసోలేట్ కావాలి. -
కుతంత్రాలు
వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదులు ఇళ్లు, కార్యాలయాల్లో ముమ్మర తనిఖీలు ఏమీ దొరక్క వెనుదిరిగిన అధికారులు టీడీపీ నేతలపై ఫిర్యాదులను పట్టించుకోని వైనం సాక్షి, కాకినాడ :ఓటమి భయంతో తెలుగుతమ్ముళ్లు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఏదో విధంగా విజయం దక్కించుకోవాలనుకొని అడ్డదారులు తొక్కుతున్నారు. కోట్లు కుమ్మరించి గంపగుత్తగా ఓట్లు దండుకుంటున్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు. ఇంత చేసినా వారిలో ఓటమి భయం వీడడడం లేదు. ప్రజాబలంతో విజయం వైపు దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ లక్ష్యంగా కుట్రలు..కుతంత్రాలకు పాల్పడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులపై తప్పుడు కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. వారు చేసే తప్పుడు ఫిర్యాదులపై తీవ్రంగా స్పందిస్తున్న అధికారులు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం వారి అక్రమాలను చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల లక్ష్యంగా ఒక పక్క ఎన్నికల అధికారులు..మరొక పక్క ఇన్‌కంటాక్స్ అధికారులు సోమ, మంగళవారాల్లో విస్తృతంగా దాడులు చేశారు. అయితే ఆ దాడుల్లో ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. ద్వారంపూడి చేతిలో గతంలో పరాజయం పాలైన వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) మరోసారి తన ఓటమి ఖాయమనే భయంతో ద్వారంపూడిని అప్రతిష్ట పాల్జేసేందుకు కరపత్రాలతో దుష్ర్పచారం చేస్తున్నారు. ద్వారంపూడి, ఆయన అనుచరుల కార్యాలయాలు, ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో సోదాలు చేస్తే భారీగా డబ్బు కట్టలు బయటపడతాయని తప్పుడు ఫిర్యాదులు చేశారు. దాంతో సోమవారం అర్ధరాత్రి నుంచి ద్వారంపూడికి చెందిన రాయల్ పార్క్ హోటల్‌తో పాటు ఆయన అనుచరుల ఇళ్లను ఎన్నికల అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు.మరొక పక్క కాకినాడ సిటీ మాజీ డిప్యూటీ మేయర్, పార్టీ నేత పసుపులేటి వెంకటలక్ష్మి, జగన్నాథపురానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు శివకుమార్ ఇళ్లల్లో ఎన్నికల అధికారులు సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లార్లు సోదాలు చేశారు. ముమ్మిడివరం మండల పార్టీ కన్వీనర్ జగతా బాబ్జి కుమారుడు జగతా గంగాధర్ రావు(చంటి) కార్యాలయంలో ఇన్‌కంటాక్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. స్థానిక ‘దేశం’ నేతల ఫిర్యాదుతో శుక్రవారం అర్ధరాత్రి పలుమార్లు చంటి ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. అయినప్పటికీ దేశం నేతల ఒత్తిళ్లతో విజయవాడ నుంచి వచ్చిన ఇన్‌కంటాక్స్ అధికారుల బృందం సోమవారం మధ్యాహ్నం నుంచి ముమ్మిడివరంలోని చంటి కార్యాలయంలో విస్తృతతనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరిగాయి. ఇదే మండలానికి చెందిన సినీ నిర్మాత ఆదిత్య శ్రీరామ్ సోదరుడు, వైఎస్సార్సీపీ నాయకుడు గాడిలంక ఉపసర్పంచ్ మామిడశెట్టి శ్రీనివాస్ ఇంట్లో కూడా ఎన్నికల అధికారులు సోదాలు చేశారు. తాళ్లరేవుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కాదా గోవిందకుమార్ ఇంట్లో కూడా ఎన్నికల అధికారులు సోదాలు చేశారు. అయితే ఎక్కడా వారికి డబ్బు కానీ, మద్యం కానీ, ఏ ఇతర ప్రలోభాలకు సంబంధించిన ఆధారాలు కానీ దొరకలేదు. భారీ స్థాయిలో ఓట్ల కొనుగోలుకు కోట్లు కుమ్మరిస్తూ, మద్యం ఏరులై పారిస్తున్న ‘దేశం’ నేతల ఇళ్లపై మాత్రం జిల్లాలో ఎక్కడా దాడులు చేయలేదు. నాలుగు రోజులుగా కాకినాడ, ముమ్మిడివరం, రాజమండ్రి. అమలాపురం, రామచంద్రపురం తదితర నియోజక వర్గాల్లో టీడీపీ నేతలు ఓటుకు రూ.1000 వరకు పంపిణీ చేసినా అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించారు. ‘దేశం’ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా అంతిమ విజయం తమదేనని వైఎస్సార్సీపీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు.