
లండన్ : తన కంప్యూటర్లలో ఎలాంటి పోర్న్ వీడియోలు లేవన్న బ్రిటీష్ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డామియన్ గ్రీన్.. తనపై వచ్చిన ఆరోపణలను మరోసారి ఖండించారు. 2008లో కన్జర్వేటీవ్స్ ప్రతిపక్షంలో ఉండగా అధికారి డామియన్ కార్యాలయంపై కౌంటర్ టెర్రరిజం విభాగం ఆకస్మిక దాడులు చేపట్టింది. డామియన్ పర్సనల్ కంప్యూటర్లలో పోర్న్ వీడియోలు లభ్యమైనట్లు అప్పటి సీనియర్ పోలీస్ అధికారి బాబ్ క్విక్ మీడియాకు వెల్లడించారు. రాజకీయ కారణాలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని గతంలోనే బాబ్ క్విక్‌పై డామియన్ మండిపడ్డారు.
పోర్న్ వీడియోలు, ఫొటోలు కలిగి ఉన్నాడన్న దానిపై కేబినెట్ ఆఫీసు విచారణ చేపట్టిందని హోం సెక్రటరీ అంబర్ రుడ్ తెలిపారు. తనపై డామియన్ అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక దాడులకు యత్నించారని ఓ మహిళా ఉద్యోగి తాజాగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పై నమోదైన అన్ని కేసులపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేశారని, తాను ఎలాంటి తప్పులు చేయలేదని డామియన్ చెబుతున్నారు. మహిళా ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించారన్న అరోపణల నేపథ్యంలో ఎంపీలు సమావేశం కావడంతో.. బ్రిటీష్ రక్షణశాఖ కార్యదర్శి మైఖెల్ ఫాల్లన్ తన పదవికి రాజీనామా చేశారు. తాను తప్పు చేసినట్లు అంగీకరించిన మైఖెల్.. క్షమాపణలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment