భారత సిబ్బందితో ఉన్న నౌకపై దాడి.. రంగంలోకి ఐఎన్‌ఎస్‌ విశాఖ | INS Vishakha Help Burning vessel 22 Indians On board Gulf of Aden | Sakshi
Sakshi News home page

భారత సిబ్బందితో ఉన్న నౌకపై దాడి.. రంగంలోకి ఐఎన్‌ఎస్‌ విశాఖ

Published Sat, Jan 27 2024 9:45 PM | Last Updated on Sat, Jan 27 2024 9:57 PM

INS Vishakha Help Burning vessel 22 Indians On board Gulf of Aden - Sakshi

ఎర్రసముద్రంలో నౌకలపై యెమెన్‌ దేశానికి చెందిన తిరుబాటుదారులు హౌతీ రెబల్స్‌ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గల్ఫ్‌ ఆఫ్ ఎడెన్‌లో సముద్రంలో ప్రయాణిస్తున్న బ్రిటన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌పై  హౌతీ రెబల్స్‌ మిస్సైల్‌ దాడికి తెగపడ్డారు. దాడికి గురైన బ్రిటిష్‌ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్‌ ఉద్యోగి  ఉన్నారు.

దీంతో సమాచారం అందుకున్న ఇండియన్‌ నేవీ సహాయక చర్యలకోసం ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం సిబ్బందిని పంపించినట్లు శనివారం వెల్లడించింది. దాడి జరిగిన వెంటనే ఎంవీ మార్లిన్ లువాండా అనే బ్రిటిష్‌ నౌక నుంచి ఓ అత్యవసర సందేశం ఇండియాన్‌ నేవీ వచ్చింది.

‘ఎంవీ మార్లిన్ లువాండా నుంచి వచ్చిన  అత్యవసర సందేశంతో అప్రమత్తమైన సమీపంలోని ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం సిబ్బంది రంగంలో దిగారు. నౌకల భద్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ ఇండియాన్‌ నేవి ‘ఎక్స్‌’ ట్విటర్‌ వేదికగా పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement