ఇరాన్‌ నౌక హైజాక్‌.. రంగంలోకి ‘ఐఎన్‌ఎస్‌ సుమిత్రా’ | Indian Navy's INS Sumitra Rescues Iranian Vessel Hijacked By Pirates | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ నౌక హైజాక్‌.. రంగంలోకి ‘ఐఎన్‌ఎస్‌ సుమిత్రా’

Published Mon, Jan 29 2024 3:47 PM | Last Updated on Mon, Jan 29 2024 4:02 PM

Indian Navy ins sumitra Rescues Iranian vessel Hijacked By Pirates - Sakshi

ఇరాన్‌కు చెందిన ఫిషింగ్‌ నౌకను ఇండియన్‌ నేవి సిబ్బంది రక్షించించినట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 700 నాటికల్‌ మైల్స్‌ దూరంలో ఇరాన్‌ దేశానికి చెందిన ఫిషింగ్‌ నౌకను సోమాలియా సముద్రపు​ దొంగలు హైజాక్‌ చేశారు.

సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అప్రమత్తమై.. ‘ఐఎన్ఎస్‌ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇరాన్‌ ఫిషింగ్‌ నౌకను సోమాలియా హైజార్ల నుంచి ‘ఐఎన్‌ఎస్‌ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు  ఇండియన్‌ నేవీ పేర్కొంది. 

అయితే.. సోమాలియా సముద్రపు దొంగల చేత హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన ఎంవీ ఇమాన్‌ మత్స్యకార నౌకలో 17 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఇక.. ఇటీవల ఇటువంటి ఘటనలు ఎర్ర సముద్రంతో పాటు అరేబియా సముద్రంలో వరుసుగా జరుగుతున్న విషయం తెలిసిందే.

చదవండి: వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు.. కేంద్రమంత్రి ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement