ins sumithra
-
ఇరాన్ నౌక హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’
ఇరాన్‌కు చెందిన ఫిషింగ్ నౌకను ఇండియన్ నేవి సిబ్బంది రక్షించించినట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 700 నాటికల్ మైల్స్ దూరంలో ఇరాన్ దేశానికి చెందిన ఫిషింగ్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అప్రమత్తమై.. ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇరాన్ ఫిషింగ్ నౌకను సోమాలియా హైజార్ల నుంచి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. Indian Navy warship INS Sumitra is rescuing fishermen hijacked by Somali pirates 700 nautical miles west of Kochi in the Arabian Sea. The Iranian fishing vessel MV Iman with around 17 crew members was hijacked by Somali pirates: Indian Defence officials pic.twitter.com/EOEs7zgQHn — ANI (@ANI) January 29, 2024 అయితే.. సోమాలియా సముద్రపు దొంగల చేత హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన ఎంవీ ఇమాన్ మత్స్యకార నౌకలో 17 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఇక.. ఇటీవల ఇటువంటి ఘటనలు ఎర్ర సముద్రంతో పాటు అరేబియా సముద్రంలో వరుసుగా జరుగుతున్న విషయం తెలిసిందే. చదవండి: వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు.. కేంద్రమంత్రి ప్రకటన -
ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ
-
ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ
విశాఖపట్నం: విశాఖపట్నంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో మూడో రోజు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ ప్రయాణిస్తున్నారు. అంతకుముందు రాష్ట్రపతి నౌకాదళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖ తీరంలో బంగాళాఖాతంలో 6 వరుసల్లో 70 యుద్ధనౌకలను మోహరించారు. రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణిస్తున్న ఐఎన్ఎస్ సుమిత్రను మరో 5 యుద్ధ నౌకలు అనుసరిస్తున్నాయి. యుద్ధ నౌకల సామర్థ్యాన్ని రాష్ట్రపతి పరిశీలించనున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు.