ఈ రోజుల్లో పొరపాటున పిల్లలు తప్పిపోతే దొరకడం చాలా కష్టం. పోలీసులు చుట్టు తిరిగినా దొరికే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే పిల్లలను ఎత్తకుపోయే ముఠాలు, మానవ అక్రమ రవాణ తదితరాల కారణంగా ఆచూకి అంత ఈజీ కాకుండా పోయింది. ఐతే ఈ ఆధుననిక టెక్నాలజీ ఈ విషయంలో సహకరిస్తుందని చెప్పాలి. ఫేస్‌బుక్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ సెకన్లలో చేరి ఏదో రకంగా వాళ్ల ఆచూకీ లభించి కుటుంబ చెంతకు చేరిన ఎన్నో ఉదంతాలు చూశాం. అలాంటి ఆశ్చర్యకర ఉదంతమే ఇక్కడ చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...యూకేకి చెందిన అలెక్స్ బట్టీ ఆరేళ్ల వయసులో తప్పిపోయాడు. స్పెయిన్‌లో ఉండగా సెలవుల్లో తన అమ్మ, తాతయ్యలతో కలిసి ఊరికి వెళ్తుండగా తప్పిపోయాడు. అప్పటి నుంచి అతడి మిస్ కేసింగ్ కేసు పరిష్కారం కానీ కేసుగా ఉండిపోయింది. ఇంటర్నెట్‌లో అతడి ఆచూకీ కోసం ఓ ప్రకటన కూడా ఉంది. అయితే ఆ చిన్నారి అలెక్స్ ఇప్పుడూ అనూహ్యంగా 17 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ పర్వాతాల్లో ఓ వాహనదారుడికి కనిపించాడు. దీంతో అతను ఆ టీనేజర్‌ని ఇక్కడ ఎందుకు ఉన్నావని ఆరా తీయగా నాలుగు రోజుల నుంచి ఈ పర్వతాల నుంచే నడుచుకుంటూ వస్తున్నట్లు తెలిపాడు. వెంటనే అతడు ఆ బాలుడి పేరుని ఇంటర్నెట్‌లో టైప్ చేసి చెక్‌చేయగా అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిసింది.
దీంతో అతను వెంటనే ఆ టీనేజర్‌ని పోలీసులకు అప్పగించాలనుకున్నాడు. అంతేగాదు అలెక్స్ ఆ వాహనదారుడి ఫోన్ సహాయంతో ఫేస్‌బుక్‌లో యూకేలో ఉన్న తన అమ్మమ్మ తాతయ్యల కోసం ఓ సందేశం పెట్టాడు. ఆ సందేశంలో "హలో అమ్మమ్మ నేను అలెక్స్. నేను ఫ్రాన్స్ టౌలౌస్‌లో ఉన్నాను. మీకు సందేశం చేరుతుందని ఆశిస్తున్నాను. ఐ లవ్ యూ, నేను ఇంటికి రావాలనుకుంటున్నా".అని ఉద్వేగభరితంగా సందేశం పెట్టాడు. ఇది వారికి రీచ్ అవ్వడమే గాక ఒక్కసారిగా ఆ కుటుంబం సంతోషంతో మునిగిపోయింది.
మళ్లీ ఆరేళ్ల తర్వాత ఆ టీనేజర్ తొలిసారిగా తన అమ్మమ్మను కలుసుకోనున్నాడు. ప్రస్తుతం ఆ టీనేజర్ టౌలౌస్‌లోని ఒక యువకుడి సంరక్షణలో ఉన్నాడని ఏ క్షణమైన నగరానికి రావొచ్చని పోలీసులు తెలిపారు. అదృశ్యమయ్యే సమయానికి అలెక్స్ వసయు 11 ఏళ్లు కాగా ఆరేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోనున్నాడు. ఐతే ఈ ఆరేళ్లలో ఎక్కడ ఉన్నాడు, ఎలా మిసయ్యాడు అనే దానిపై లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
(చదవండి: 220 టన్నుల హోటల్‌ని జస్ట్ 700 సబ్బులతో తరలించారు!)
Comments
Please login to add a commentAdd a comment