Guinness World Record for the most consecutive days to complete a marathon: కేట్ జేడెన్ అనే బ్రిటిష మహిళ వరుసగా అత్యధిక రోజులు మారథాన్ పూర్తి చేసి గిన్నిస్ రికార్డు సొంతం చేసింది. ఈ మేరకు ఆమె 106 రోజుల్లో 106 మారథాన్‌లను చేసింది. అత్యథిక రోజులు మారథాన్ చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కింది. ఆమె గతేడాది డిసెంబర్ 31, 2021 నుంచి ఏప్రిల్ 15, 2021 వరకు చాలామైళ్లు మారథాన్ పూర్తి చేసింది.
అలిస్సా క్లార్క్ పేరిట ఉన్న 35 రోజుల మునపటి రికార్డును బ్రేక్ చేసింది. ఆమె ఈ మారథాన్‌ని నిధులు సేకరణ కోసం చేస్తోంది. మానసిక ఆరోగ్య సేవలకు, శరణార్థుల మానవతా సాయానికి విరాళాలు ఇచ్చేందుకు ఆమె ఈ నిధులు సేకురిస్తోంది. ఈ క్రమంలో జేడెన్ తన ఇన్‌స్టాగ్రాంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సంబంధించిన పోస్ట్‌లను నెటిజన్లుతో పంచుకున్నారు.
దీంతో నెటిజనలతో మీరు అద్భుతమైన విజయం సాధించారంటూ అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఆమె మొదట్లో వంద రోజుల్లో 100 మారథాన్‌లు పూర్తి చేయాలని భావించింది. ఆమె మారథాన్ చేసిన ప్రదేశాలు అలెప్పో, సిరియా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య దాదాపు 2620 మైళ్ల దూరం ఉంటుంది. వాస్తవానికి ఈ మార్గం ఆశ్రయం శరణార్థులు తరచూ ప్రయాణించే మార్గం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment