బిహార్లోని నితీశ్కుమార్ సర్కార్ను ఆ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ చిక్కుల్లో పడేసింది.
న్యూఢిల్లీ: బిహార్లోని నితీశ్కుమార్ సర్కార్ను ఆ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ చిక్కుల్లో పడేసింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పరిపాలన బ్రిటీష్ పాలకుల కంటే ఘోరంగా ఉందంటూ ప్రభుత్వ వెబ్సైట్లో ప్రచురించడం నితీశ్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారును ఇబ్బందుల్లో పడేసింది. నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ కథనంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
బిహార్ చరిత్ర కథనంలో భాగంగా ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ నియంతృత్వ, అణచివేత పాలన కొనసాగించారని, సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ సాగించిన ప్రజాస్వామిక పోరాటం మళ్లీ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పాదులు వేసిందని వెబ్సైట్లో పేర్కొనడం సంకీర్ణ పక్షాల మధ్య విభేదాలకు కారణమవుతోంది. ఈ కథనంలో ఇందిరాగాంధీకి సంబంధించిన వ్యాఖ్యలను తాము ఎంతమాత్రం ఆమోదించబోమని కాంగ్రెస్ నేత చందన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ విషయం సీఎం నితీశ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బిహార్ కాంగ్రెస్ చీఫ్, విద్యాశాఖ మంత్రి అశోక్ కుమార్ కూడా ఈ అంశాన్ని సీరియస్గా సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మరోవైపు అధికార జేడీయూ మాత్రం వెబ్సైట్లోని చారిత్రక అంశాల్లో ఎలాంటి తప్పు లేదని, చారిత్రక అంశాలను మార్చాలని కాంగ్రెస్ పట్టుబట్టడం సరికాదని చెప్తోంది.