సాక్షి, హైదరాబాద్: ప్రపంచ స్థాయిలో భారత్‌ను నిలబెట్టడంతో దివంగత మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ పాత్ర కీలకపాత్ర పోషించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచారని తెలిపారు. మంగళవారం భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఇందిరా గాంధీపై నెగెటివ్‌గా సినిమాలు తీసే వారికి కౌంటర్ ఇచ్చారు.
దేశ సమగ్రతపై అవగాహన లేని వారు కావాలని సినిమాలు చేస్తున్నారరని మండిపడ్డారు. గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, గతం గురించి తెలిసిన వారు ఆమెకు చేతులు ఎత్తి నమస్కరిస్తారని తెలిపారు.
దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారు..
దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని, ఉద్దేశ్యపూర్వకంగా ఆమెనె నెగెటీవ్‌గా చూపిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధానిపై తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిరా కుటుంబానిదని అన్నారు.
‘ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నాం. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీలో ఉచిత రవాణా కోసం నెలకు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఆశయ స్పూర్తితో ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నాం.
తెలంగాణ వైపు దేశం చూపు..
బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే ఈ సర్వేచేస్తున్నాం. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తోంది. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేది సర్వే ఉద్దేశ్యం. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలు ఆదుకుంటాం. అందరికీ నచ్చ చెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటాం. కొద్దిమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారు,
యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది..
బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారు. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రపన్నుతున్నారు. బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? పేదల అకౌంట్లో 15 వేలు వేస్తామని మోసం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది. జాబ్ క్యాలెండర్, యూపీఎస్ సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment