అండమాన్, నికోబార్ ద్వీపవాసులు ‘పునరుద్ధరణ’ను ఆశ్రయించకుండా, చరిత్రను తిరగ రాసుకోవాలని ఉరకలెత్తకుండా తమ గాయపడిన గతాన్నే వాస్తవ వర్తమానంగానూ స్వీకరించారు. స్వాతంత్య్రానంతరం సెల్యులార్ జైలుకు చెందిన రెండు రెక్కలు కూల్చివేతకు గురైనప్పుడు, స్వాతంత్య్ర సమర యోధులు తమ పోరాట ఫలితాలకు ప్రతీకాత్మకమైన ఆ ప్రదేశానికి మరమ్మతులు చేసే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకించారు.
ఎందుకంటే చరిత్రలో రెక్కల కూల్చివేతా ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుందని వారు విశ్వసించారు. ఆ విశ్వాసమే... దేశంలో అందరినీ కలుపుకొని ఉన్న సమాజాల్లో తమది కూడా ఒకటిగా ఉండేలా చేసింది. కానీ, మితిమీరిన జాతీయవాదంతో ఇప్పుడు అభివృద్ధి కన్నా పేర్ల మార్పుపై దృష్టి పెట్టడం విషాదం.
దేశభక్తి గురించి లేదా ‘భిన్నత్వంలోఏకత్వం’ అనే రాజ్యాంగ భావన గురించి దేశం మొత్తంలో ఎలాంటి పాఠాలూ, ప్రబోధాలూ అవసరం లేని ప్రదేశం ఏదైనా ఉందీ అంటే అవి... అండమాన్, నికోబార్ దీవులే. ఆ దీవుల జనాభాలో ఎక్కువ భాగం (సుమారు ఐదు లక్షల మంది) బ్రిటిష్ వారు ఖైదు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వం కలిగి ఉన్నవారే. ఆ తర్వాతి స్థానంలో ఈ ప్రాంతంలో స్థిరపడిన వారు, నెగ్రిటో జరావాస్, ఒంగెస్, గ్రేట్ అండమానీస్, సెంటినెలీస్ (బయటి ప్రపంచంతో సంబంధం లేని చివరి రక్షిత తెగ) లేదాషాంపెన్, నికోబారీస్ వంటి మంగోలాయిడ్ తెగలకు చెందిన స్థానిక తెగల సభ్యులు ఉన్నారు.
‘భారతదేశ భావన’కు ఆధారభూతమైన ఈ సుదూర కేంద్రం నేడు భారతదేశంలోని అనేక వైవిధ్యాల అధివాస్తవిక సమ్మేళనం. స్వాతంత్య్ర పోరాటం, ‘కాలా పానీ’ అపఖ్యాతి (కఠిన శిక్షల విధింపు, సెల్యులార్ జైలు మొదలైనవి) బెంగాల్, పంజాబ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ నుండి ఖైదీలను ఎక్కువగా ఇక్కడికి రప్పించాయి. వారిలో చాలామంది జాతీయ నిర్మాణంలో గుర్తింపునకు, ప్రశంసలకు నోచు కోకుండా మిగిలిపోయారు. వారి గర్వించదగిన వారసుల కోసం మతాలు, ప్రాంతాలు, జాతులకు అతీతంగా విచిత్రమైన ‘హిందూ స్థానీ’ మాండలికాన్ని ఉపయోగించడం ద్వారా మత సామరస్య భావం నెలకొల్పే ప్రయత్నాలు జరిగాయి.
బెంగాలీలు, తమిళులు, పూర్వాంచలీలు, పంజాబీలు... భారత ప్రధాన భూభాగాన్ని కబళి స్తున్న విషపూరితమైన విభజన, రాజకీయ ‘విభజన’ విధానాలచెంప చెళ్లుమనిపిస్తూ ఇక్కడ తమ బతుకు తాము జీవిస్తున్నారు. దూరంగా (చెన్నై లేదా కోల్‌కతా నుండి 1,200 కి.మీ), ప్రధాన భూభాగంలో సాగుతున్న ‘దారుణమైన’ రాజకీయాలు అంటకుండా ఉండటం అనేది ఈ దీవులు ఆదర్శవంతమైన ‘మినీ–ఇండియా’ను తలపించేందుకు దోహదపడింది.
నిజానికి ‘మేము–వారు’ అనే ఆధిపత్య ధోరణి మతాలు లేదా జాతుల మధ్య కాదు... సామూహిక ‘ద్వీపవాసులు వర్సెస్ ప్రధాన భూభాగవాసుల మధ్య కనిపిస్తుంటుంది. ఇక్కడ ప్రధాన భూభాగ స్థులను దోపిడీదారులుగా చూస్తారు. ప్రధాన భూభాగంలోని సాధా రణ అవగాహన కంటే ద్వీపాలలో చరిత్రపై అభిప్రాయాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఉదాహరణకు జపనీయులతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాగించిన మూడేళ్ల పొత్తు గురించి ఇక్కడ మిశ్రమ భావాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ మూడు సంవత్సరాలు బ్రిటిష్ వారిని మించిన క్రూరత్వంతో ఇక్కడ ముడిపడి ఉన్నాయి.
ఈ శాంతియుత ద్వీపవాసులు పునరుద్ధరణ వాదాన్ని ఆశ్రయించలేదు. లేదా చరిత్రను తిరగరాయలేదు. సంక్లిష్టమైన, గాయపడిన చరిత్రనే తమ వాస్తవ గుర్తింపుగా స్వీకరించారు. స్వాతంత్య్రానంతరం సెల్యులార్ జైలుకు చెందిన రెండు రెక్కలు కూల్చివేతకు గురైనప్పుడు, చాలా మంది స్వాతంత్య్ర సమర యోధులు తమ బాధను సూచించే ప్రదేశానికి మరమ్మతులు చేసే ప్రయత్నాలను వ్యతిరేకించారు. ఎందు కంటే ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని కూడా సూచిస్తుందని వారు విశ్వసించారు. ఆ విశ్వాసమే దేశంలో అందరినీ కలుపుకొని ఉన్న సమాజాలలో వారు ఒకటిగా ఉండేలా చూసింది.
2006లో ఆ ప్రాంతానికి ఒక అడ్మినిస్ట్రేటర్‌గా, గవర్నర్‌గా నియ మితుడనయ్యాను. 2004 డిసెంబర్ నాటి ఘోరమైన సునామీ కార ణంగా నష్టపోయిన ద్వీపాలలో ఉపశమనం, పునరావాసం నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం నాకు అప్పగించింది. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన సామాజిక ఆర్థిక విధ్వంసాల నుండి మనం కోలుకున్న ప్పుడు, సమాజం కలిసి ఉండే విధానం వల్ల నేనెంతో ఉపకారంపొందాను. ఒక మాజీ పోరాట యోధుడిగా, నేను సామాజిక అనుకూ లత, శాశ్వతమైన దేశభక్తి, ఇంకా లేహ్ ప్రాంతంలోని సుదూర సరి హద్దు ప్రాంతాలు, కశ్మీర్ ఎతై ్తన ప్రాంతాలు లేదా లోతట్టు ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేకమైన ఒక పెద్ద జాతీయ ప్రయోజనాన్ని చూశాను. తక్కిన ‘భారతదేశం’లో ఇది కనిపించలేదు.
చాలా సాధించినా, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ ద్వీపాల వ్యూహాత్మక స్థానం (మలక్కా జలసంధి వద్ద చైనీస్ ‘చౌక్ పాయింట్’ మినహా) – అలాగే హానికి లేదా దాడికి గురయ్యే గిరిజనులకురక్షణగా ఉన్న భౌగోళిక స్థితి, వీటితో పాటుగా... సహజమైన గ్రీన్ కవర్ అభివృద్ధి కోసం గోవా, కేరళ మార్గాల్లో సాంప్రదాయికతకు తలుపులు ‘తెరవడం’పై కొన్ని పరిమితులు అవసరం. ప్రైవేట్ అభివృద్ధి లేనప్పుడు ప్రభుత్వ మద్దతు చాలా అవసరం. మౌలిక సదుపా యాలు, పౌర సౌకర్యాలు, ఉపాధి అవకాశాల కొరత కూడా ఒక సవాలు. అయినప్పటికీ ఈ భారతదేశ ‘షైనింగ్ ఔట్ పోస్ట్’ దాని ప్రత్యేక మార్గాలకు, చరిత్రకు కట్టుబడి ఉంది.
ప్రధాన భూభాగపు గాలులు, స్వచ్ఛమైన సహజ ద్వీపాలకు చేరు కోవడానికి ఎంతో కాలం పట్టదు. జాతీయవాదాన్ని ప్రోత్సహించ డానికి ప్రముఖ స్థలాల పేర్లను మార్చడం అటువంటి దిగ్విషయా లలో ఒకటి. హ్యావ్‌లాక్, నీల్, రాస్ దీవులకు వరుసగా స్వరాజ్ ద్వీప్, షహీద్ ద్వీప్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు పెట్టారు. ద్వీపాలు టూరిజంపై ఎక్కువగా ఆధారపడటం, పర్యాటక ‘బ్రాండ్’ లను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పేర్లను మార్చటం తగదని మార్కెటింగ్ జ్ఞానం సలహా ఇస్తుంది.
అన్నింటికంటే, వాడుకకు చెందిన స్థిరత్వం, నామకరణపు క్లుప్తత, దీర్ఘకాల గుర్తింపును నిర్మించడం అనేది సాధారణ భావన. అయినప్పటికీ, స్థానికులు కోరుకున్నందున పేర్లు మార్చడం జరగలేదు, కానీ మితి మీరిన జాతీయవాదం ఫార్ములా కారణంగా వీటి పేర్లు మార్చారు. ఈ పేరు మార్పు వెనుక చోదకశక్తిగా ఉన్నవారు నేతాజీ మనవడుచంద్ర కుమార్ బోస్. అయితే దిగ్గజ స్వాతంత్య్ర యోధుడి భావ జాలాన్ని ప్రచారం చేయడానికి బీజేపీ నుండి తనకు మద్దతు లభించ లేదంటూ తర్వాత ఆయన పాలకవ్యవస్థ నుండి వైదొలిగారు.
తరువాత, జనావాసాలు లేని 21 ద్వీపాలకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు మార్చారు. భారతదేశపు అర్హులైన వారసులకు నివాళి గనక, ఆచరణాత్మక చిక్కులు కూడా లేవు గనక ఈ పేర్ల మార్పును అంగీకరించడం జరిగింది. ప్రభుత్వ పెట్టుబడులు, ఇంకా చాలా అంశాలు అస్పష్టంగానే ఉన్నాయి. ఈ క్రమంలో అండమాన్, నికోబార్ దీవులకు సరికొత్త జాతీయవాద ఔన్నత్య ‘వైభవం’ సంప్రా ప్తించింది. రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు ఇటీవల ‘శ్రీ విజయపురం’ అని పేరు పెట్టారు. ఇది ‘వలసవాద ముద్రల నుండి దేశాన్ని విముక్తి చేయ డానికి’ జరిగిందంటున్నారు.
ఆర్చిబాల్డ్ బ్లెయిర్ (ఈయన పేరునే పోర్ట్ బ్లెయిర్‌కు పెట్టారు) బొంబాయి మెరై¯Œ లో సాపేక్షంగా అసంగ తమైన నావికా సర్వేయర్ అని పట్టించుకోలేదు, ఎందుకంటే సోషల్ మీడియా అతని గురించి తీవ్రమైన దూషణలతో నిండిపోయింది. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చడం గురించి కొంతమంది ద్వీప వాసులకు చేసిన కాల్స్ ఉదాసీనత, ఉద్రేకాలతో మిశ్రమ స్పందనను రేకెత్తించాయి. ద్వీపవాసులకు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టకుండా, ఇలాంటి కసరత్తులు ఇంతకు ముందు చాలాసార్లు జరిగాయి.
ఇది తప్పు కాదు కానీ ప్రత్యేకించి దేశంలోని మిగిలిన ప్రజలకు గౌరవప్రదమైన దేశభక్తి (అత్యంత తీవ్రమైన జాతీయవాదం కాదు), కలుపుగోలుతనం, లౌకికవాదం గురించి ఒకటి లేదా రెండు విష యాలు చెప్పVýæలవారికి ఇది ఉన్మాద రాజకీయాల పునరావృతమే. పేర్లు మార్పు సరే... అర్థవంతమైన అభివృద్ధి మాటేమిటి? అది జరిగే సూచనలు కనిపించటం లేదు.
- వ్యాసకర్త రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్
- భోపిందర్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment