అహ్మదాబాద్: గుజరాత్‌లో ఒక నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులకు బ్రిటిష్ కాలం నాటి 240 బంగారు నాణేలు లభ్యమవగా వాటిని దొంగిలించిన ఆరోపణలపై ఒక ఇన్‌స్పెక్టర్‌తో సహా నలుగురు పోలీసులను మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో అరెస్టు చేశారు.
సంఘటనా స్థలంలో కూలీలు రామ్‌కు భయ్‌డియా అతని మేనకోడలు బవారి తవ్వకాలు చేస్తుండగా వారికి ఒక కాసుల మూట కనిపంచిందని.. చడీ చప్పుడు చేయకుండా ఆ మూటతో సహా గుజరాత్ సరిహద్దులో వారు నివాసముండే సోండ్‌వా గ్రామానికి చేరుకున్నారని.. వారు 20 నాణేలను తీసుకుని మిగిలినవాటిని వారి ఇంట్లోనే పాతి పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఆ నోటా ఈ నోటా వార్త చేరి మెల్లగా ఊరంతా వ్యాపించింది. ఇదే క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు జులై 19న రామ్‌కు భయ్‌డియా ఇంటికి చేరుకున్నారని గ్రామస్తులు తెలపగా నిధిని తవ్వించి మొత్తంగా వారి వద్ద నుండి మొత్తం 239 నాణేలను లాక్కుని తమకి ఒకే ఒక్క నాణెం ఇచ్చారని రామ్‌కు తెలిపాడు.
ఆ మరుసటి రోజే రామ్‌కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల దృష్టికి విషయం చేరి ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జరీ చేశారు. ఈ మొత్తం తతంగంలో ఇప్పటికింకా ఆ బంగారు నాణేల ఆచూకీ తెలియకపోవడం కొసమెరుపు.
ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుడితో భార్యకు వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment