Unearthed
-
కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో ఒక నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులకు బ్రిటిష్ కాలం నాటి 240 బంగారు నాణేలు లభ్యమవగా వాటిని దొంగిలించిన ఆరోపణలపై ఒక ఇన్స్పెక్టర్తో సహా నలుగురు పోలీసులను మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో అరెస్టు చేశారు. సంఘటనా స్థలంలో కూలీలు రామ్‌కు భయ్‌డియా అతని మేనకోడలు బవారి తవ్వకాలు చేస్తుండగా వారికి ఒక కాసుల మూట కనిపంచిందని.. చడీ చప్పుడు చేయకుండా ఆ మూటతో సహా గుజరాత్ సరిహద్దులో వారు నివాసముండే సోండ్వా గ్రామానికి చేరుకున్నారని.. వారు 20 నాణేలను తీసుకుని మిగిలినవాటిని వారి ఇంట్లోనే పాతి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ నోటా ఈ నోటా వార్త చేరి మెల్లగా ఊరంతా వ్యాపించింది. ఇదే క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు జులై 19న రామ్‌కు భయ్‌డియా ఇంటికి చేరుకున్నారని గ్రామస్తులు తెలపగా నిధిని తవ్వించి మొత్తంగా వారి వద్ద నుండి మొత్తం 239 నాణేలను లాక్కుని తమకి ఒకే ఒక్క నాణెం ఇచ్చారని రామ్‌కు తెలిపాడు. ఆ మరుసటి రోజే రామ్‌కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల దృష్టికి విషయం చేరి ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జరీ చేశారు. ఈ మొత్తం తతంగంలో ఇప్పటికింకా ఆ బంగారు నాణేల ఆచూకీ తెలియకపోవడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుడితో భార్యకు వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య -
కండోమ్ ప్యాకెట్లో బ్లైండ్ మర్డర్ కేసు రహస్యం.. ట్రైనీ పోలీసులకు కేస్ స్టడీగా..
యూపీలోని అంబేద్కర్‌నగర్ పోలీసులు ఒక బ్లైండ్ మర్డర్ కేసును చేధించారు. ఇప్పుడు ఈ కేసు పోలీసు విభాగానికి చెందిన ట్రైనీ ఆఫీసర్లకు అధ్యయన అంశంగా మారింది. జూన్ 11న జిల్లాలోని బెవానా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక స్కూలులో 90శాతం మేరకు కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఆ మృతదేహం ఎవరిదనేది పోలీసులు కనుగొనలేకపోయారు. అయితే వారికి ఆ మృతదేహం వద్ద ఒక కండోమ్ ప్యాకెట్ లభ్యమయ్యింది. యూపీలోని అంబేద్కర్‌నగర్ పోలీసులు చేధించిన ఒక బ్లైండ్ మర్డర్ కేసు ఇప్పుడు పోలీసు విభాగంలోని ట్రైనీ ఆఫీసర్లకు కేస్ స్టడీకి పనికివస్తోంది. వివరాల్లోకి వెళితే జూన్ 11న జిల్లాలోని బెవానాలో పోలీసులకు 90శాతం మేరకు కాలిన మృతదేహం లభ్యమయ్యింది. పక్కనే ఒక కండోమ్ ప్యాకెట్ కూడా ఉంది. దాని ఆధారంగా పోలీసులు ఈ కేసును చేధించారు. నిందితులను జైలుకు తరలించారు. తగలబడిన మృతదేహం ఉందంటూ.. భీతరీడీహ్ గ్రామానికి చెందిన కొందరు ఒక స్కూలు బిల్డింగ్‌లో తగలబడిన స్థితిలో ఒక మృతదేహం ఉండటాన్ని గమనించి, పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం పురుషునిదిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్ టీమ్‌ను రప్పించి, పలు ఆధారాలు సేకరించారు. ఢిల్లీ, యూపీలలో లభ్యమయ్యే కండోమ్ ప్యాకెట్.. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. లోతుగా దర్యాప్తు సాగించినా పోలీసులకు ఆశించినంత ప్రయోజనం కనిపించలేదు. అయితే పోలీసులకు సంఘటనా స్థలంలో ఒక కండోమ్ ప్యాకెట్ దొరికింది. ఈ బ్రాండ్ కండోమ్ ప్యాకెట్ ఢిల్లీ ఎన్సీఆర్, యూపీలలో లభ్యమవుతుందని గుర్తించారు. ఈ ఆధారంతో ముందుకు సాగిన దర్యాప్తు.. పోలీసులు సర్వలెన్స్ సెల్ మాధ్యమంలో జిల్లాలోని ఏ మొబైల్ నంబర్ల లొకేషన్ ఘటనాస్థలానికి దగ్గరలో ఉందో తెలుసుకున్నారు. ఈ ఆధారంతో మృతుడు ఎవరో తెలుసుకోగల నాలుగు నంబర్లను ట్రేస్ చేశారు. తదుపరి దర్యాప్తులో సహరన్‌పూర్‌కు నలుగురు వ్యక్తులు సర్కస్ చూసేందుకు వెళ్లారని, వారిలో ఒకరు మిస్సయ్యారని తేలింది. నిందితులలోని ఒకని చెల్లెలితో.. ఈ ఇన్పుట్ ఆధారంగా పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, ప్రశ్నించడంతో అదృశ్యమైన యువకుని పేరు అజబ్ సింగ్ అని వెల్లడయ్యింది. అతను ఈ నిందితులలో ఒకని చెల్లెలిని ప్రేమించాడని వారు తెలిపారు. ఈ విషయమై ఎన్నిసార్లు వారించినా అజబ్ సింగ్ తన తీరు మార్చుకోలేదని వారు పేర్కొన్నారు. హత్య చేసి, మృతదేహాన్ని తగులబెట్టి.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ యువతి సోదరుడు అతని స్నేహితులు కలిసి.. అజబ్ సింగ్ చేత మద్యం తాగించి, ఒక స్కూలు భవనంలోకి తీసుకువెళ్లి, రాళ్లతో మోది హత్య చేశారు. తరువాత ఆతని దగ్గరున్న అన్ని వస్తువులను అక్కడే పారవేశారు. వాటిలో కండోమ్ ప్యాకెట్ కూడా ఉంది. తరువాత అక్కడే ఉన్న కర్రలను ఉపయోగించి, ఆ మృతదేహాన్ని తగులబెట్టారు. అంబేద్కర్‌నగర్ పోలీసులకు ప్రశంసలు.. ఈ ఉదంతం గురించి పోలీసు అధికారి అజీత్ కుమార్ సింగ్మాట్లాడుతూ ఒక కండోమ్ ప్యాకెట్ ఆధారంగా బ్లైండ్ మర్డర్ కేసును చేధించిన విషయం తమ ఉన్నతాధికారులకు తెలిసిందన్నారు. దీంతో వారు అంబేదర్కర్ నగర్ పోలీసులను అభినందించారని, దీనిని కేస్ స్టడీ కోసం ఉపయుక్తమయ్యేలా మురాదాబాద్ పోలీస్ సెంటర్‌కు పంపించాలని నిర్ణయించారన్నారు. ఇది పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఉపయుక్తం కానుంది. ఇది కూడా చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. -
రెండు వేల గొర్రె తలలను ప్రసాదంగా ఉంచారట!
కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిసలు మమ్మీలుగా ఉండటం గురించి వినలేదు కదా!. కానీ అమెరికా పురావస్తు శాస్త్రజ్ఞులు ఈజిప్టులో వాటిని కూడా మమ్మీలుగా ఉంచినట్లు గుర్తించారు. జంతువుల మమ్మీలను అమెరికా పురావస్తు బృందం దక్షిన ఈజిప్టులోని అబిడోస్ నుంచి వెలికితీసింది. అక్కడ దేవాలయాల వద్ద జంతువుల మమ్మీల సమాధులకు ప్రసిద్ధి. కీ.పూ 1304 నుంచి 1237 వరకు దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఫారో రామ్సేస్2 అనే రాజు ఈజిప్టుని పాలించాడట. దీంతో ఆయన మరణాంతరం ఆయనకో దేవాలయాన్ని కట్టారు. అయితే ఆయన మరణించిన వెయ్యేళ్లకు గుర్తుగా ఆయన ఆరాధనలో గొర్రె తలలను అర్పించేవారట. అంటే వేల గొర్రెలను శిరచ్ఛేదనం చేసి ఆయనకు నైవేద్యంగా పెట్టేవారని పురావస్తు శాఖ సుప్రీం కౌన్సిల్ మోస్తఫా వాజిరి తెలిపారు. క్రీ.పూర్వం 2374 నుంచి214 మధ్య కాలం రామ్సెస్ 2 ఆలయానికి సంబంధించిన కార్యకలాపాలు, నిర్మాణాలు గురించి తెలుస్తాయని వెల్లడించారు. అంతేగాదు ఈ ప్రదేశంలో మమ్మీగా చేయబడిన జంతు అవశేషాల తోపాటు దాదాపు 4 వేల ఏళ్లక్రితం నాటి ఐదు మీటర్ల మందం గోడలతో కూడిన ప్యాలెస్ అవశేషాలను కూడా కనుగొన్నారు. అక్కడ అనేక విగ్రహాలు, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లను గుర్తించారు. కైరో నదికి దక్షిణంగా నైలు నిదిపై దాదాపు 270 మైళ్ల దూరంలో ఈ అబిడోస్ ఉంది. ఇక్కడ సేటీ 1 వాటి శవపేటికల ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. కైరోలో ఎప్పుడూ ఇలాంటి కొత్తకొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తుండటం విశేషం. దాదాపు 105 మిలియన్ల మంది నివాసం ఉండే ఈజిప్టు ఆర్థిక సంక్షోబంలో చిక్కుకుంది. అంతేగాదు అక్కడ సుమారు 10 శాతం జీపీడీ పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. పైగా ఇది సుమారు రెండు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. అయితే కైరో కరోనా మహమ్మారికి ముందు సుమారు 13 మిలియనల మందిని లక్ష్యంగా చేసుకుంటే 2028 నాటికి సుమారు 30 మిలియన్ల మంది టార్గెట్‌గా పెట్టుకుని పర్యాటకాన్ని పునరుద్ధరించాలని భావిస్తోంది. (చదవండి: ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం) -
నా ముందు నగ్నంగా కూర్చోబెడితేనే గుప్తనిధి కనబడుతుందంటూ..!
బెంగళూరు: కంప్యూటర్లు వచ్చి ఎంతటి ఆధునిక యుగంలో జీవిస్తున్నప్పటికీ ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలను కొంతమంది విశ్వస్తున్నారంటే వాళ్లను ఏమనాలో కూడా అర్ధంకాదు. అంతేందుకు ఒక చిన్నగ్రామం సైతం అత్యంత అభివృద్ధి పదంలోకి దూసుకుపోతున్న ఇంకా ఇలాంటి అమానుష ఘటనలకు తెరలేపుతున్నవారు అక్కడక్కడ తారసపడుతునే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అచ్చం అలానే ఇక్కడొక పూజారి గుప్తనిధులంటూ ఎలాంటి పనిచేశాడో చూస్తే మనం ఏ యుగంలో ఉన్నాం అని అనిపించక మానదు. (చదవండి: ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!) అసలు విషయంలోకెళ్లితే... షాహికుమార్.. తమిళనాడుకు చెందినవాడు. కర్ణాటకలోని భూనహళ్లికి చెందిన వ్యవసాయదారుడు శ్రీనివాస్ అనే వ్యక్తికి ఒక పెళ్లిలో పూజలు చేసే షాహికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఒకరోజు ఈ షాహికుమార్.. శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. అయితే శ్రీనివాస్ ఇల్లు 75 సంవత్సరాల క్రితం నిర్మించిన పాత ఇల్లు. ఈ మేరకు షాహికుమారు చాలా పాతకాలం నాటి పూర్వకాలం ఇంటిలో గుప్తనిధులు ఉంటాయని, వాటిని బయటకు తీయకపోతే చాలా ఆపదలు ఎదుర్కొంటారని శ్రీనివాస్‌తో చెబుతాడు. ఈ మేరకు షాహికుమార్ గుప్తనిధుల తీసే నిమిత్తం శ్రీనివాస్ నుంచి అడ్వాన్స్‌గా రూ 20 వేలు కూడా తీసుకున్నాడు. అయితే కోవిడ్-19 లాక్డౌన్లతో పని వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత రెండు నెలలకు శ్రీనివాస్‌ని కలసి పని ప్రారంభిస్తానని చెప్పాడు. పైగా ఈ గప్త నిధుల నిమిత్తం చేసే పూజల కోసం శ్రీనివాస్‌కుమార్ ఇంట్లోని ఒక గదిని ఎన్నుకున్నాడు. అంతేకాదు ఈ నిధి కనపడాలంటే ఒక స్త్రీ తన ముందు నగ్నంగా కూర్చొబెడితే గుప్తనిధి కనపడుతుందని చెబుతాడు. పైగా ఆ స్త్రీ శ్రీనివాస్ కుటుంబంలోని అమ్మాయే అయ్యి ఉండాలని పట్టుబడతాడు. దీంతో శ్రీనివాస్ ఈ పని నిమిత్తం ఒక దినసరి కూలి మహిళకు రూ.5000 ఇచ్చి ఒప్పించి తీసుకువస్తాడు. అయితే పూజారి షాహికుమార్ పనులు అనుమానస్పదంగా అనిపించి స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇస్తారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పూజారి షాహికుమార్ అతని సహాయకుడు మోహన్, తాపీ మేస్త్రీలు లక్ష్మీనరసప్ప, లోకేష్, నాగరాజ్, పార్థసారథిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు అక్కడ స్థానకుల చొరవతోనే ఈ దినసరి కూలి మహిళను, ఆమె నాలుగేళ్ల కూతురును రక్షించగలిగామని చెప్పారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్) -
కడపలో బాంబుల భయం.!
సాక్షి, జమ్మలమడుగు(కడప) : జమ్మలమడుగుకు బాంబుల మడుగు ఉన్న అపవాదు తొలగిపోయి దశాబ్దాల కాలమైంది. ఈ మధ్య కాలంలో అక్కడక్కడా హత్యలు జరిగినప్పటికి బాంబులను వినియోగించిన సంఘటనలు లేవు. ఇక బాంబుల సంస్కృతి పూర్తిగా చరిత్రలో కలిసిపోయిందనుకుంటున్న తరుణంలో జమ్మలమడుగు ప్రాంతంలో మళ్లీ బాంబుల బకెట్లు బయటపడటం సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. జమ్మలమడుగు పట్టణ శివారు ప్రాంతంలో రెండు రోజుల క్రితం నాలుగు బకెట్లలో 54 నాటు బాంబులు బయటపడేసరికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 20 ఏళ్ల క్రితం.. 1999వ సంవత్సరానికి ముందు జమ్మలమడుగు ప్రాంతంలో నాటుబాంబులు దొరకడం పెద్ద వింతేమీ కాదు. అప్పట్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ ఉండటంతో ఇరువర్గాల వద్ద నాటుబాంబులు విరివిగా లభించేవి. వీటి తయారీ కూడా జమ్మలమడుగు ప్రాంతంలోనే జరిగేది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సైతం బాంబులను సరఫరా చేసేవారు. బకెట్లలో, లెదర్ బ్యాగులలో బాంబులను తీసుకెళ్లేవారు. కాని 1999లో జమ్మలమడుగు సబ్ డివిజన్‌కు అడిషనల్ ఎస్పీగా వచ్చిన శంకరబాత్రా బాగ్చీ అప్పటి జిల్లా ఎస్పీ గోవింద్‌సింగ్‌ల ప్రత్యేక కృషి వల్ల నియోజకవర్గంలో స్వచ్ఛంద బాంబుల అప్పగింత కార్యక్రమం జరిగింది. ఫ్యాక్షనిస్టుల వద్ద నుంచి వేల సంఖ్యలో బాంబులను స్వాధీనం చేసుకుని అప్పట్లో పోలీసులు రికార్డు సృష్టించారు. ఆ తర్వాత బాంబుల వాడకం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్థాయి నేతలు సైతం అభివృద్ధి, ఆదాయాలపై దృష్టి సారించడంతో గ్రామాల్లో ఫ్యాక్షనిజం దాదాపు కనుమరుగైపోయింది. గత పది సంవత్సరాలుగా జమ్మలమడుగు ప్రాంతంలో నాటుబాంబుల మాటే వినబడలేదు. ఇప్పుడు తాజాగా బయటపడుతున్న నాటుబాంబులు జమ్మలమడుగు ప్రాంతంలో కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న రామచంద్రాయపల్లె..నిన్న జమ్మలమడుగు... ఇటీవల రెండు వారాల క్రితం మైలవరం మండలం రామచంద్రాయపల్లె గ్రామంలో రెండు దశాబ్దాల క్రితం దాచిపెట్టిన బాంబుల బకెట్ బయట పడింది. పొక్లెయిన్‌తో పొలం గట్లను చదును చేస్తున్న సమయంలో కనిపించిన బాంబుల బకెట్‌ను పరిశీలిస్తున్న సమయంలో అందులోని బాంబులు పగిలి పొలం యజమాని కుమారుడు గాయపడ్డాడు. ఆ సంఘటన మరువక ముందే మంగళవారం జమ్మలమడుగు పట్టణ శివార్లలో , ముద్దనూరు రహదారిలో భూములను కొనుగోలు చేసి వాటిని ఫ్లాట్లుగా మార్చుతున్న క్రమంలో భూమి లోపల నాలుగు బాంబుల బకెట్లు బయటపడటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వతేదీ జమ్మలమడుగుకు వచ్చిన సందర్భంగా ముద్దనూరు రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే ఈ నాటు బాంబులు దొరకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి. అలాంటిది హెలిప్యాడ్‌కు సమీపంలోనే ఉన్న పొలంలోనే నాటుబాంబులు బయటపడటం నిఘా వైఫల్యానికి పరాకాష్టగా నిలిచింది. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రస్తుతం దొరికిన నాటుబాంబులకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు గాని శిక్షణ పొందిన బాంబ్‌స్క్వాడ్ సభ్యులు సీఎం పర్యటన సందర్భంలో వీటిని ఎందుకు పసిగట్టలేకపోయారనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి సభకు విచ్చేసిన ప్రజల్లో కొందరు మలమూత్ర విసర్జన నిమిత్తం ఆ పరిసరాలలో సంచరిస్తున్నప్పుడు పొరపాటున జరగరానిది ఏదైనా జరిగి ఉంటే బాధ్యులు ఎవరన్న ప్రశ్నకు నిఘా విభాగమే జవాబు చెప్పాలి. -
సావిత్రి నదిలో 22 మృతదేహలు లభ్యం
-
13 వేల కోట్ల నల్లధనం వెలికితీత
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో అక్రంగా దాచుకున్న రూ. 13 వేల కోట్ల మొత్తాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వెలికితీశారు. పన్నులు ఎగవేసి అక్రమంగా దాచుకున్నఈ నల్లడబ్బుల వివరాలను ఆదాయ పన్ను శాఖ అందించింది. ఇది కేవలం 2011, 2013లలో అందుకున్న రెండు సమాచారాలను బట్టే ఇంత భారీ మొత్తాన్ని వెలికితీయగలిగినట్టు వెల్లడించింది. జెనీవాలోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో 400 మంది భారతీయులు అక్రమంగా దాచుకున్న రూ. 8186 కోట్లను ఐటీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది మార్చి 31 వరకు ఆ మొత్తంపై రూ.5377 కోట్ల పన్ను కట్టాలని ఐటి ఎసెస్ కమిటీ అంచనాలు చెబుతున్నాయి. గతేడాది హెచ్ఎస్బీసీ నుంచి 623 మంది భారతీయుల అకౌంట్స్ వివరాలను ప్రభుత్వం అందుకుంది. అందులో 213 మంది ఖాతాలు నాన్ యాక్టివ్ గా ఉన్నట్టు గుర్తించింది. డబ్బులు లేకపోవడం లేదా. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఖాతాలు అయి ఉండొచ్చని భావించింది. 398 మంది అకౌంట్స్ ను మాత్రం గుర్తించగలిగామని, వాటిలో ఇంత భారీ మొత్తం ఉన్నట్టు ఐటీ శాఖ నివేదిక వెల్లడించింది కాగా 2013లో ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జరనలిస్ట్ (ఐసీఐజె) వెబ్సైట్లో మరో 700 మంది భారీతీయులు అక్రమంగా 5 వేల కోట్లు దాచుకున్నారన్న సమాచారం కూడా లభించింది. వీరిలో ఇప్పటివరకు 55 మందిపై ఐటీ శాఖ కేసులు నమోదు చేయగా, హెచ్ఎస్బీసీ కేసులో 75 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. -
కోల్‌కతాలో ప్రకంపనలు రేపుతున్న మనీలాండరింగ్