british era chandelier
-
కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో ఒక నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులకు బ్రిటిష్ కాలం నాటి 240 బంగారు నాణేలు లభ్యమవగా వాటిని దొంగిలించిన ఆరోపణలపై ఒక ఇన్స్పెక్టర్తో సహా నలుగురు పోలీసులను మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో అరెస్టు చేశారు. సంఘటనా స్థలంలో కూలీలు రామ్‌కు భయ్‌డియా అతని మేనకోడలు బవారి తవ్వకాలు చేస్తుండగా వారికి ఒక కాసుల మూట కనిపంచిందని.. చడీ చప్పుడు చేయకుండా ఆ మూటతో సహా గుజరాత్ సరిహద్దులో వారు నివాసముండే సోండ్వా గ్రామానికి చేరుకున్నారని.. వారు 20 నాణేలను తీసుకుని మిగిలినవాటిని వారి ఇంట్లోనే పాతి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ నోటా ఈ నోటా వార్త చేరి మెల్లగా ఊరంతా వ్యాపించింది. ఇదే క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు జులై 19న రామ్‌కు భయ్‌డియా ఇంటికి చేరుకున్నారని గ్రామస్తులు తెలపగా నిధిని తవ్వించి మొత్తంగా వారి వద్ద నుండి మొత్తం 239 నాణేలను లాక్కుని తమకి ఒకే ఒక్క నాణెం ఇచ్చారని రామ్‌కు తెలిపాడు. ఆ మరుసటి రోజే రామ్‌కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల దృష్టికి విషయం చేరి ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జరీ చేశారు. ఈ మొత్తం తతంగంలో ఇప్పటికింకా ఆ బంగారు నాణేల ఆచూకీ తెలియకపోవడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుడితో భార్యకు వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య -
తాజ్‌మహల్‌లో పడిపోయిన షాండ్లియర్
అందాల కట్టడం తాజ్‌మహల్‌లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి షాండ్లియర్ ఒకటి పడిపోయింది. దాని బరువు దాదాపు 60 కిలోలు. ఈ ఘటనపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. 6 అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పున్న ఈ షాండ్లియర్‌ను 1905లో లార్డ్ కర్జన్ బహూకరించారు. దాన్ని తాజ్‌మహల్ రాయల్ గేట్ వద్ద అమర్చారు. అది ఇప్పుడు పడిపోవడంపై ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు భువన్ విక్రమ్ దర్యాప్తు చేస్తున్నారు. షాండ్లియర్ ఎందుకు పడిపోయిందన్న విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, అది బాగా పాతది అయిపోవడం వల్లే పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. అయితే, అది పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని టూరిస్టు గైడ్ వేద్ గౌతమ్ చెప్పారు.