అనారోగ్యంతో రిమాండ్ ఖైదీ మృతి
అనారోగ్యంతో రిమాండ్ ఖైదీ మృతి
Published Wed, Dec 28 2016 11:14 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
కాకినాడ క్రైం:నల్లమందు అక్రమ రవాణా కేసులో పోలీసులకు పట్టుబడి, రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాంyŠ లో ఉన్న ఖైదీ అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. విశాఖజిల్లా చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ కిన్నెర్లకాలనీకి చెందిన వనగల శ్రీను (27) ఆరు నెలల క్రితం నల్లమందు అక్రమ రవాణా కేసులో రాజమండ్రిలో బొమ్మూరు పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేయగా, కోర్టు రిమాండ్ విధించింది. ఆరునెలలుగా అతను రాజమండ్రి సెంట్రల్ జెల్లో ఉంటున్నాడు. తనకు అనారోగ్యంగా ఉందని శ్రీను చెప్పగా జైలు సిబ్బంది ఎస్కార్ట్‌తో తొలుత రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మృతి చెందాడు. ఇదే విషయాన్ని శ్రీను భార్య వెంకటలక్షి్మకి బుధవారం ఉదయం తెలిపారు. ఆ వెంటనే సుమారు 16 మంది బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు చేరుకున్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన జైల్ అధికారులతో వారు వాగ్వాదానికి దిగి మీ నిర్ల్లక్ష్యం వల్లే కారణంగానే శ్రీను చనిపోయాడని, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాకినాడ ఒన్‌టౌన్ ఎస్సై ఈ.అప్పన్న ఆర్డీవో అంబేద్కర్ సమక్షంలో గురువారం శవ పంచనామా జరుగుతుందని, అక్కడ చెప్పాలని వారికి సూచించారు.
పది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా వైద్యం చేయించలేదు
‘ఈనెల 26వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైల్లో నా భర్తను కలుసుకున్నాను. పదిరోజులుగా తీవ్రమైన కడుపునొప్పి, కాళ్లు, చేతులు వాచిపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్నానని, వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని జైల్ అధికారులను కోరినా పట్టించుకోవడంలేదని శ్రీను తనతో చెప్పాడు. ఈ విషయమై జైల్ అధికారులకు ఫిర్యాదు చేశాను.’ అని శ్రీను భార్య వెంకటలక్షి్మ వాపోయింది. మృతదేహాన్ని అప్పగిస్తారనుకుంటే ఆర్డీవో అందుబాటులో లేరు, గురువారం దాకా వేచిచూడండంటూ పోలీసులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్త మృతిపై సమగ్ర విచారణ నిర్వహించి, జైల్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Advertisement
Advertisement