Us Florida Woman Tries Sneaking Boa Constrictor Snake To Plane, Caught By Security - Sakshi
Sakshi News home page

పెంచుకోవడానికి ఏం దొరకలేదా? విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్..

Published Mon, Jan 9 2023 4:34 PM | Last Updated on Mon, Jan 9 2023 7:44 PM

Us Florida Woman Tries Sneaking Boa Constrictor Snake To Plane - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఓ మహిళ పామును విమానంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఎలాగోలా ఎంట్రెన్స్ గేటు వద్ద తప్పించుకుని విమానాశ్రయంలోకి వెళ్లినప్పటికీ ఎక్స్‌-రే మెచీన్ వద్ద దొరికిపోయింది. బ్యాగును స్కాన్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది లోపల పామును చూసి షాక్ అయ్యారు.

ఫ్లోరిడాలోని టాంపా ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. ఈ మహిళ తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది 'బోవా కన్స్ట్రిక్టర్' పామును. ఇది పిల్ల పాము. 4 అడుగులుంది. దీనికి ఎమోషనల్‌గా దగ్గరయ్యానని, అందుకే పెంచుకునేందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు మహిళ చెప్పింది. ఈ పాముకు 'బార్తోలోమ్యూ' అని ముద్దుపేరు కూడా పెట్టుకుంది.

బోవా కన్‌స్ట్రిక్టర్ పాములు చూడటానికి కొండచిలువలా కన్పిస్తాయి. ఇవి 13 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ పాము విషపూరితం కానందు వల్ల అమెరికాలో చాలా మంది వీటిని సరదాగా ఇళ్లలోనే పెంపుడు జంతువుల్లా చూసుకుంటారు.
చదవండి: విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement