
మెంఫిస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని శనివారం అమెరికాలోని మెంఫిస్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్‌లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేసి సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్రబోతుల శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకట్ తమ్మ, వీరమోహన్ రెడ్డి, సూర్య, రమేష్, రామ్, విజయ్, జయ్‌పాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రామకృష్ణ, తెలుగు అసోసియేషన్ కమిటీ సభ్యులు కిరణ్ పారపూడి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment