ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. తాజాగా టీమ్ జెర్సీని రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం విడుదల చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్, చాహల్ న్యూ జెర్సీతో ఉన్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేసింది. అలాగే జెర్సీకి సంబంధించిన ఓ వీడియోను కూడా రాజస్తాన్ విడుదల చేసింది. ఐపీఎల్-2022 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కాబోతోంది.
తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ ఐపీఎల్ 15 సీజేన్ మే 29 వరకు కొనసాగనుంది. రాజస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో రాజస్తాన్.. ట్రెంట్ బౌల్ట్,షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కెసి కారియప్ప, ఒబెద్ సైని, నవ్‌దీప్ సైని సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డారిల్ మిచెల్
చదవండి: IPL 2022: హార్దిక్‌కు ఫిట్‌నెస్ టెస్ట్.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా!
Pink & blue. But all-new. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) March 15, 2022
The Rajasthan Royals official #IPL2022 match kit has been (express) delivered. 🏍️🔥#HallaBol | #GivesYouWiiings | @IamSanjuSamson | @yuzi_chahal | @ParagRiyan | @redbullindia pic.twitter.com/HW75lGusVN
Comments
Please login to add a commentAdd a comment