పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సైనికులకు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ(ఓఎఫ్‌బీజేపీ) కార్యకర్తలు శ్రద్దాంజలిని ఘటించింది. ఓఎఫ్‌బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి ఉగ్రదాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ క్రిష్ణా రెడ్డి అనుగుల మాట్లాడుతూ.. వీర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆశించారు.