టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ
ముంబై:టీమిండియా క్రికెటర్లు ధరించే కొత్త జెర్సీని గురువారం ఆవిష్కరించారు. ఈ మేరకు నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సీఈవో రాహుల్ జోహ్రి, ఒప్పో మొబైల్ ఇండియా అధ్యక్షుడు స్కైలి నూతన జెర్సీని విడుదల చేశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ ఒప్పోతో బీసీసీఐ ఐదు సంవత్సరాలు ఒప్పందం చేసుకుంది. 1,079 కోట్లతో ఒప్పో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఇటీవల జెర్సీ హక్కుల కోసం నిర్వహించిన వేలం స్టార్ ఇండియాను ఒప్పో అధిగమించింది.
త్వరలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు కొత్త జెర్సీలో కనిపించనుంది. ఒకవైపు చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాల్గొనడంపై ఇంకా స్పష్టత లేకపోయినా కొత్త జెర్సీని ఆవిష్కరించడం గమనార్హం.
BCCI CEO @RJohri & @oppomobileindia President Mr. Sky Li launch the #OPPO #TeamIndia jersey pic.twitter.com/wpK0CV5Ldu
— BCCI (@BCCI) 4 May 2017