న్యూజెర్సీ: అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏక్ మే అనేక్ రూపకానికి అద్భుత స్పందన లభించింది. న్యూజెర్సీ ప్లయిన్ పీల్డ్ లో సాయి సమర్పణ్ బృందం, న్యూయార్క్ వారు నిర్వహించిన ఈ ప్రదర్శనకు భక్తజనం భారీగా తరలివచ్చారు. తెలుగువారితో పాటు భారతీయులు చాలామంది ఈ ప్రదర్శనను తిలకించేందుకు పోటీ పడ్డారు.
భిన్నత్వంలో ఏకత్వం... ఇదే సాయి తత్వం. దీనిని మనసులకు కట్టిపడేసే విధంగా సాయి సమర్పణ్ బృందం ప్రదర్శించిన తీరుకు ప్రశంసల వర్షం కురిసింది. సాయి తత్వాన్ని భావోద్వేగాల మధ్య చక్కటి నేపథ్య సంగీతంతో సాయి సమర్పణ్ బృందం ప్రదర్శించింది. హేమాడ్ పంత్ దాభోల్కర్ రాసిన ఈ నృత్యరూపకం సాయి భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది.
సాయి దత్త పీఠం నిర్వహకులు రఘు శర్మ శంకరమంచి ప్రణాళికతో వ్యవహరించడంతో ఆధ్యాత్మిక ప్రదర్శన అయినప్పటికి చాలా మంది ఈ ప్రదర్శనకు విచ్చేశారు. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఏక్ మే అనేక్ రూపకాన్ని ప్రదర్శించినందుకు సాయి సమర్పణ్ బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సాయితత్వాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా రఘుశర్మ శంకరమంచి అన్నారు. ఈ ప్రదర్శనను విజయవంతం చేయడంలో ప్రత్యేక కృషి చేసిన సాయి దత్త పీఠం సేవా బృందాలను రఘు శర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో సాయిదత్త పీఠం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన బోర్డు సభ్యులకు, దత్త పీఠం డైరెక్టర్లైన అశోక్ బడ్డి, చికాగో నుంచి వచ్చిన రాజ్ పొట్లూరి, స్థానికంగా ఉన్న తెలుగు ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన పెద్దలకు, ఉపేంద్ర చివుకులకు, దాతలు, ఎస్‌డీపీ ఫ్యామిలీ, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. చక్కటి విందు భోజనం అందించిన పెర్సిస్ బిర్యానీ నిర్వాహకులలో ఒకరైన రాజ్, వినయ్ సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రఘుశర్మ, సాయి సమర్పణ్ కళాకారులకు దాతలు శాలువా కప్పి జ్ఞాపికలతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment