
సౌత్ ప్లైన్‌ఫీల్డ్ : ‘ఈస్టర్ పండగ రోజున గత ఆదివారం (ఏప్రిల్ 21) శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఐసిస్ ఉగ్రవాదులు కొలంబోలో 8 చోట్ల బాంబులు పేల్చడంతో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 500 మందికిపైగా గాయపడ్డారు. మూడు చర్చిలు, నాలుగు హోటళ్లలో ఉగ్రవాదులు బాంబుల దాడికి తెగబడ్డారు. దీంతో ఎల్టీటీఈ తుడిచిపెట్టుకుపోయిన పదేళ్ల తర్వాత లంక మళ్లీ నెత్తురోడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో మన పొరుగు దేశంలో అసువులు బాసిన వారికి ప్రగాఢ సంతాపం తెలియ చేయాల్సిన సమయమిది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబాని ప్రార్ధిద్దాము. ప్రేమ, సర్వ మత సమానత్వంకై బాబా బాటలో నడవాలి’ అని రఘు శర్మ పిలుపు నిచ్చారు.
న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, దత్త పీఠం పాలక వర్గ సభ్యులు మధు అన్న, దాము గేదెల, సీమ జగిత్యాని, సాయి దత్త పీఠం గురుకుల నిర్వాహకురాలు రాణి ఊటుకూరు అమరులకు ఘన నివాళులర్పించారు.శ్రీలంకకు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు విజ్జి కొట్హచ్ఛి మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని అందరూ, అన్ని మతాలవారూ ఖండించాలని కోరారు. సుమారు 200 మంది భక్తులు కొవ్వొత్తి దీప ప్రదర్శనతో నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు.
Comments
Please login to add a commentAdd a comment