యూఎస్‌లోని సాయి దత్తపీఠం ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ | Sai Datta Peetham Sri Shiva Vishnu Temple NJ Clothing drive | Sakshi
Sakshi News home page

Us: సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ

Published Tue, Jun 25 2024 1:47 PM | Last Updated on Tue, Jun 25 2024 2:12 PM

Sai Datta Peetham Sri Shiva Vishnu Temple NJ Clothing drive

అమెరికాలోని సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం దుస్తుల పంపీణీ కార్యక్రమాన్ని చేపట్టింది. సమాజ సేవ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం యునీకో(UNICO) సౌత్‌ ప్లెయిన్‌ఫ్లీల్డ్‌ చొరవతో విజయవంతమయ్యింది. దీనికి సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం  డైరెక్టర్‌ సుభద్ర పాటిబండ్ల, డెబ్బీ బాయిల్, క్రిస్టీన్‌ల తదితరులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 

ఈ నిస్వార్థ ప్రయత్నాలు నిరుపేద కుటుంబాలకు మంచి ప్రయోజనం చేకూర్చడమే గాక కావాల్సిన దుస్తులు ఉపకరణాలను పొందగలుగుతారు.ఆయా సంఘం నుంచి వచ్చిన విశేష స్పందన ఫలితంగా దుస్తులతో నిండిన ట్రక్కులు తరలివచ్చాయి. ఈ పంపిణీకి సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఉపేంద్ర చివుకుల, కమిషనర్‌ ఎమిరిటస్‌, మురళి మేడిచర్ల పూర్తి సహాయసహకారాలు అందించారు. ఇలాంటి కార్యక్రమాలు ఐక్యతను, సమాజ స్ఫూర్తి ప్రాముఖ్యతలను నొక్కి చెబుతాయని ఈ కార్యక్రమ నిర్వాహకులు అన్నారు. 

(చదవండి:  యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement