కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధి కాషాయమయమైంది. లక్షలాదిగా తరలివచ్చిన మాలధారులు, సాధారణ భక్తులతో పుణ్యక్షేత్రం రద్దీగా మారింది. ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. బుధవారం ఉదయం ఐదు గంటల నుంచే మనరాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడం ప్రారంభమైంది.
వీరంతా బుధవారం అర్ధరాత్రి 12గంటల తర్వాత క్యూలైన్ల ద్వారా శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కల్యాణ కట్టకు చేరుకుని మాల విరమణ, దీక్ష విరమణ చేశారు. గురువారం హనుమాన్ చిన్నజయంతి నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీసుల డేగకళ్లతో పహారా కాస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment