చికిత్స పొందుతూ యువకుడి మృతి
జమ్మికుంట(హుజూరాబాద్): ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. జమ్మికుంట టౌన్ సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణంలోని మామిండ్లవాడకు చెందిన వేల్పుల అజయ్‌కుమార్(20) డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగం దొరకడం లేదని మనస్తాపానికి గురై, ఈనెల 11న జమ్మికుంట పట్టణ సమీప మడిపల్లి రోడ్డులో క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. మృతుడి తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
హోంగార్డు భార్య..
గోదావరిఖని(రామగుండం): తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు భార్య రామలక్ష్మి(38) శనివారం ఉదయం మృతిచెందింది. గోదావరిఖని వన్‌టౌన్ రెండో సీఐ రవీందర్ తెలిపిన వివరాలు.. స్థానిక విఠల్‌నగర్‌కు చెందిన హోంగార్డు గట్టయ్యతో రామలక్ష్మికి 15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. గట్టయ్య కొంతకాలంగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని రామలక్ష్మిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా అతడిలో మార్పు రాలేదు. ఈక్రమంలో శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గట్టయ్య, రామలక్ష్మి గొంతు నులుమడంతో పాటు తలను గోడకేసి బాదడంతో తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుంది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు గట్టయ్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలింత..
సుల్తానాబాద్(పెద్దపల్లి): మండలంలోని పెద్దబోంకుర్ గ్రామానికి చెందిన బాలింత మిట్టపల్లి సౌమ్య (22) శనివారం మృతిచెందింది. ఎస్సై లక్ష్మణ్‌రావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఈనెల 18న డెలివరీ కోసం సౌమ్య ఆస్పత్రిలో అడ్మిట్ కాగా, హైబీపీ, హైరిస్క్ కావడంతో రెండురోజులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈనెల 21న ఉదయం 11 గంటలకు సిజేరియన్ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈక్రమంలో శనివారం వేకువజామున ఒక్కసారిగా హైబీపీ రావడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో హార్ట్ స్టెప్‌తో పాటు పల్మేరియా ప్రాబ్లం వచ్చినట్లు డీసీహెచ్ డాక్టర్ శ్రీధర్, వై ద్యులు చెబుతున్నారు. గర్భిణిగా ఉన్న సమయంలోనే హైరిస్క్ కేసుగా గుర్తించి, కుటుంబ సభ్యులకు సైతం చెప్పామని వివరించారు. వై ద్యంలో ఎలాంటి పొరపాటు లేదని వివరించా రు. కాగా సౌమ్య కుటుంబసభ్యులు మాత్రం వైద్యం వికటించి మృతిచెందిందని ఆరోపిస్తున్నారు. మృతిపై అనుమానం ఉందని సౌమ్య భర్త నవీన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ముత్తారం(మంథని): మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన రత్నరాజయ్య (45) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కొంతకాలంగా మద్యానికి బానిసైన రాజయ్య తరచూ భార్య, కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. శనివారం భార్య కూలీ పనులకు వెళ్లగా మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో మద్యం తాగి వచ్చిన రాజయ్య పురుగులమందు తాగాడు. చుట్టుపక్కల గమనించిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందిస్తుండగానే మృతిచెందాడు. మృతుడి కుమారుడు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment