ఎస్సైపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
గన్నేరువరం: ఎస్సై తాండ్ర నరేశ్‌పై శనివారం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు గన్నేరువరానికి చెందిన బుర్ర అచ్యుత్‌గౌడ్ తెలిపారు. తనను తీవ్రంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసి, తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఎస్సైపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ నెల 18న కరీంనగర్ సీపీకి సైతం ఫిర్యాదు చేశానని అందులో పేర్కొన్నారు.
సీపీఆర్ చేసి.. ప్రాణాలు కాపాడి
ధర్మపురి: బైక్ నుంచి కిందపడి అపస్మారకస్థితికి చేరుకున్న యువకుడికి పోలీసులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన కాశెట్టి శృతిక్ శుక్రవారం రాత్రి పనిమీద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో కుక్కను తప్పించబోయి కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఎస్సై ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు రమేశ్, ఎస్‌కే హరీఫ్ ఘటనా స్థలానికి చేరుకొని యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
చికెన్, ఎగ్ మేళాకు స్పందన
సిరిసిల్లటౌన్: పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్, జాతీయ కోడిగుడ్ల సమన్వయ సమితి ఆధ్వర్యంలో శనివారం సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో చికెన్, కోడిగుడ్ల మేళా నిర్వహించారు. బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో చికెన్, కోడిగుడ్లు తినడంపై నెలకొన్న అనుమాలను కొట్టిపారేస్తూ వండిన చికెన్, కోడిగుడ్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని వెల్లడించారు. అలాంటిది మన దేశంలో 100 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడిలోనే వండుతారని పేర్కొన్నారు. ఉడికించిన చికెన్, ఎగ్స్ తినడం మూలంగా ప్రజలకు ఏ ప్రమాదము ఉండదన్నారు. ప్రజలు అపోహలకు గురికాకుండా అత్యంత ప్రొటీన్స్ ఉండే గుడ్డు, చికెన్‌ను నిస్సందేహంగా తినాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్సైపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
ఎస్సైపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment