గంజాయి పట్టివేత
రామగుండం: వైజాగ్ నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయించేందుకు వచ్చిన వ్యక్తిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై సంధ్యారాణి తెలిపిన వివరాలు.. హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట మండలం అతిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన తీగుళ్ళ రామకృష్ణ రెండు లగేజీ బ్యాగుల్లో గంజాయితో వైజాగ్ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి రామగుండం రైల్వేస్టేషన్‌లో దిగాడు. అప్పటికే రామగుండం సీపీ శ్రీనివాస్, ఏసీపీ రమేశ్‌కు అందిన సమాచారం మేరకు పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు. ఈక్రమంలో రైల్వేస్టేషన్ సమీపంలో రామకృష్ణ లగేజీ బ్యాగులను సోదా చేయగా 15.904 కేజీల గంజాయి లభించింది. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు.
యువకుడిపై హత్యాయత్నం
గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని గాంధీనగర్‌కు చెందిన ఖలీం అనే యువకుడిపై శనివారం హత్యాయత్నం జరిగిందని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. అతనికి వరుసకు సోదరులయ్యే మహమ్మద్ గౌస్, మహమ్మద్ అంకూస్ కత్తితో దాడి చేశారన్నారు. ఖలీం గొంతు భాగంలో బలమైన గాయాలయ్యాయని, ఆస్తి తగాదాల వల్లే ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గంజాయి పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment