చిత్తశుద్ధితో ఉద్యోగాల భర్తీ
● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
కరీంనగర్ కార్పొరేషన్: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, భవిష్యత్తులో లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. శనివారం నగరంలోని జ్యోతినగర్ లో ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లతో, అలకాపురి కాలనీలో పట్టభద్రులతో ఆయన సమావేశం అయ్యారు. 10 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఉద్యోగ ప్రక్రియను తాము అధికారంలోకి రాగానే చేపడుతున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రామగిరి(మంథని): కాంగ్రెస్‌తోనే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని, సమస్యలు పరిష్కారమవుతాయని పట్టభద్రుల ఎమ్మెల్సీగా పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డిని గెలిపించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. శనివారం సెంటినరికాలనీ శ్రీపాదభవన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ రూ పొందించి ఉద్యోగాల భర్తీ చేపట్టిందన్నారు. అనంతరం పన్నూర్ సత్య గార్డెన్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు రోడ్డ బాపన్న, ఐఎన్‌టీయూసీ సెంట్రల్ ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, ఆర్జీ–3 ఏరియా ఉపాధ్యక్షుడు కోట రవీందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment