పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా..
హసన్‌పర్తి: సోదరి పెళ్లి పత్రికలు పంచేందుకు స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. యాదాద్రి– ఆరెపల్లి జాతీయ రహదారిపై రెడ్డిపురం క్రాస్ వద్ద శనివారం ఈ దుర్ఘటన జరిగింది. ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరికి చెందిన గడ్డం చైతన్య(28), వరంగల్ నగరం కరీమాబాద్‌కు చెందిన ఎర్ర అఖిల్(28) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం కరీమాబాద్‌లో అఖిల్ సోదరి దివ్య వివాహం జరగనుంది. బంధువులు, స్నేహితులకు పెళ్లి పత్రికలు పంచడానికి అఖిల్, చైతన్య బైక్‌పై యాదాద్రి–ఆరెపల్లి జాతీయ రహదారి మీదుగా హనుమకొండ వైపు బయల్దేరారు. రెడ్డిపురం వద్ద వీరి బైక్‌ను వెనుకవైపు నుంచి కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ బలమైన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
పెళ్లింట విషాదం
ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం. ఘటనకు కారకుడైన గోలమర్రి అజిత్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.
బైక్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు యువకుల దుర్మరణం
నేడు జరగాల్సిన సోదరి వివాహం వాయిదా
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా..
Comments
Please login to add a commentAdd a comment