
విషమ పరీక్ష
ఎన్‌ఐటీ, ఐఐటీ ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్-2015 రాత పరీక్ష సందర్భంగా శనివారం జంట నగరాల పరిధిలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్ష నిర్వహణకుగాను నగరంలో 60 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర
నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాపిక్‌ను మళ్లించడంతో విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేక ఇబ్బందులు పడ్డారు.
కేంద్రాల కేటాయింపుపై అధికారులు సరైన సమాచారం అందించకపోవడంతో కొందరు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. దీంతో వారు కేంద్రాల వద్దే కన్నీటి పర్యంతమయ్యారు. - సాక్షి, సిటీ బ్యూరో