
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలతో సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల గుండా దారి మళ్లిస్తున్నామన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
-అఫ్జల్‌గంజ్, ఎస్‌జే బ్రిడ్జి, శంకర్‌షేర్ హోటల్, ముక్తీయార్‌గంజ్ నుంచి పుత్లీబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను గౌలిగూడ చమాన్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం మీదుగా సీబీఎస్ వైపు దారి మళ్లిస్తారు.
-ఆంధ్రాబ్యాంక్, రంగ్‌మహల్ నుంచి గౌలిగూడ చమాన్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ రూట్‌లోని వాహనాలను పుత్లీబౌలి క్రాస్ రోడ్స్ మీదుగా రంగ్‌మహల్ వైపు దారి మళ్లిస్తారు.
-గౌలిగూడ రాంమందిర్ వద్ద ఊరేగింపు ప్రారంభమైన తర్వాత చాదర్‌ఘాట్ నుంచి పుత్లీబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను రంగ్‌మహల్ వై జంక్షన్ నుంచి సీబీఎస్ వైపు దారి మళ్లిస్తారు.
-పుత్లీబౌలి నుంచి ఆంధ్రాబ్యాంక్ మీదుగా ఊరేగింపు వెళుతున్న సమయంలో జీపీఓ నుంచి కోఠి వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎంజే మార్కెట్ వైపు దారి మళ్లిస్తారు.
-ఊరేగింపు కోఠి ఆంధ్రాబ్యాంక్ జంక్షన్‌కు చేరుకున్న సమయంలో చాదర్‌ఘాట్ నుంచి ఆంధ్రాబ్యాంకు వైపు వచ్చే ట్రాఫిక్‌ను, డీఎం అండ్ హెచ్‌ఎస్ జంక్షన్ వద్ద సుల్తాన్‌బజార్ క్రాస్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
-ఊరేగింపు కాచిగూడ చౌరస్తాకు వచ్చిన సమయంలో వేర్వేరు మార్గాల నుంచి కాచిగూడ చౌరస్తాకు వస్తున్న ట్రాఫిక్‌ను టూరిస్ట్ హోటల్ జంక్షన్ వద్ద నుంచి బడీచౌడీ వైపు మళ్లిస్తారు.
-ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు వచ్చే ట్రాఫిక్‌ను మెట్రో కేఫ్ నుంచి రాంనగర్ టీ జంక్షన్ వైపు దారి మళ్లిస్తున్నారు.
-హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను నారాయణగూడ ైఫ్లె ఓవర్ మీదుగా అనుమతిస్తున్నారు. నారాయణగూడ ైఫైఓవర్ కింద నుంచి హిమాయత్‌నగర్ జంక్షన్ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు.
-కింగ్‌కోఠి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వైఎంసీఏ సర్కిల్ వైపు వాహనాలు అనుమతించడంలేదు. ఇడెన్ గార్డెన్ వైపు దారి మళ్లిస్తారు.
-బర్కత్‌పురా చమాన్ నుంచి వైఎంసీఏ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఓల్డ్ పోస్టాఫీస్ చౌరస్తా వద్ద క్రౌన్ కేఫ్, కాచిగూడ వైపు దారి మళ్లిస్తున్నారు.
-ఊరేగింపు సమయంలో కవాడిగూడ రోడ్ ప్రాగా టూల్స్ మార్గంలో ట్రాఫిక్‌ను అనుమతించరు.
-కర్బలా మైదాన్ నుంచి కవాడిగూడ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను చిల్ట్రన్ పార్కు వద్ద దారి మళ్లిస్తారు.
-లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ ఆలయం నుంచి వచ్చే ట్రాఫిక్‌ను డీబీఆర్ మిల్ వద్ద అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు దారి మళ్లిస్తారు.
-ముషీరాబాద్ చౌరస్తా నుంచి ట్రాఫిక్‌ను కవాడిగూడ వైపు అనుమతించరు. గాంధీనగర్ నుంచి ప్రాగా టూల్ వైపు దారి మళ్లిస్తారు.
-ప్రధాన ఊరేగింపు ఆర్పీ రోడ్డులోకి ప్రవేశించినప్పుడు, కర్బాలా మైదాన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఎంజీ రోడ్డు రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
-అడివయ్య ఎక్స్ రోడ్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.
-ట్యాంక్‌బండ్ నుంచి బైబిల్ హౌస్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను కర్బాలా మైదాన్ నుంచి రాణిగంజ్, మినిస్టర్ రోడ్డ్ వైపు మళ్లిస్తారు.
-టివోలి చౌరస్తా నుంచి బాలంరాయ్ వైపు ట్రాఫిక్‌ను ఎన్‌సీసీ ఎక్స్ రోడ్డు వద్ద దారి మళ్లిస్తారు.
-సీటీఓ నుంచి బాలంరాయ్ వైపు వచ్చే వాహనాలు, లీ రాయల్ ప్యాలెస్ వద్ద బ్రూక్‌బాండ్ ఎక్స్ రోడ్డు, ఇంపీరియల్ గార్డెన్ మీదుగా మళ్లిస్తారు.
-ఎన్‌సీసీ చౌరస్తా నుంచి డైమండ్ పాయింట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నార్నే ఎక్స్ రోడ్డు నుంచి కార్ఖనా బస్తీ వైపు దారి మళ్లిస్తారు.
-బాపూజీనగర్ నుంచి తాడ్‌బన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సెంట్రల్ పాయింట్, డైమాండ్ పాయింట్, కార్ఖనా మీదుగా దారి మళ్లిస్తారు.
-బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బోయిన్‌పల్లి చౌరస్తా, సేఫ్ ఎక్స్‌ప్రెస్, బాపూజీనగర్, బోయిన్‌పల్లి మార్కెట్ మీదుగా దారిమళ్లిస్తారు.