► హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారహిల్స్ డివిజన్ శ్రీరాంనగర్, ఉదయ్ నగర్, యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్‌లో హనుమాన్ శోభాయాత్రలను సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు చేశారు
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జంట నగరాల్లో విజయ యాత్రలు ప్రారంభం అయ్యాయి. గౌలిగూడ రామ మందిరం వద్ద ప్రారంభమైన యాత్ర.. సికింద్రాబాద్ తాడ్‌బన్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా విజయ యాత్ర కొనసాగే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు.
►సికింద్రాబాద్‌లో భారీ వర్షం ప్రారంభమైంది హనుమాన్ జయంతి యాత్ర పాల్గొన్న భక్తులు వర్షంలో సైతం ముందుకు సాగుతున్నారు. సికింద్రాబాద్‌తో పాటు కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో భారీ రాళ్ల వర్షం కురిసింది దారి పొడవున మంచు రాళ్లతో కూడిన వర్షం పడడంతో.. ఫోటోలు తీసుకుంటూ కంటోన్మెంట్ ప్రజలు ఎంజాయ్ చేశారు.
హిమాయత్‌నగర్/సుల్తాన్‌బజార్: హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం తలపెట్టిన వీర హనుమాన్ విజయ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు గౌలిగూడ రామమందిర్‌లో యజ్ఞంతో ప్రారంభమయ్యే ఈ యాత్రకు మొదటి పూజకు హరియాణా గవర్నర్ బండ్డారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు పటిష్ట బందోబస్తుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో వేలాదిమంది హనుమాన్ భక్తులతో సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించనున్నారు. వీర హనుమాన్ విజయయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు.
రూట్‌మ్యాప్‌ను వివరిస్తున్న సుధీర్‌బాబు
గౌలిగూడ టు తాడ్‌బండ్
‘శ్రీ హనుమాన్ జయంతి విజయ యాత్ర’కు గౌలిగూడ టూ తాడ్‌బండ్ వరకు ప్రత్యేకమైన బందోబస్తుతో ఎవరికీ ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ అడిషినల్ సీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందితో పాటు శాంతిభద్రతల సిబ్బంది సైతం ట్రాఫిక్ డ్యూటీలో ఉంటున్నట్లు తెలిపారు. యాత్ర సాగే రూట్‌లో ట్రాఫిక్ డైవర్షన్లు చేస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలను సైతం సూచిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల సమయంలో సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ వెళ్లేవారి కోసం రూట్‌ని కూడా సూచిస్తున్నట్లు తెలిపారు.
ప్రయాణికులకు, వాహనదారులకు ఏమైనా అర్థం కాకపోయినా, సమస్యలున్నా నేరుగా 040–27852482, 9010203626 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు. ట్రాఫిక్ ఏర్పాట్లపై అడిషినల్ సీపీ సుధీర్‌బాబు బుధవారం మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. గౌలిగూడ యత్ర ప్రారంభం నుంచి తాడ్‌బండ్ వరకు 12 కి.మీ.మేర యాత్ర కొనసాగనుంది. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కోఠి, సుల్తాన్‌బజార్, కాచిగూడ ఎక్స్‌రోడ్డు, నారాయణగూడ, కవాడిగూడ, బన్సీలాల్‌పేట్, మహంకాళి టెంపుల్, ప్యారడైజ్ ఎక్స్‌రోడ్డు మీదుగా తాడ్‌బన్ హనుమాన్ టెంపుల్ వరకు సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment