ఆల్ దందా అక్రమం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పేరు ఒక్కటే ధరలోనే వ్యత్యాసం... తరచి చూస్తే సరుకు నాసిరకం. కాస్త ఆదమరిచారంటే దుకాణదారుడు నాణ్యతలేని వస్తువులను అంటగట్టి తీరుతాడు. సిగరెట్లు, టీ పొడి, సబ్బులు, నూనెడబ్బాల నకిలీల విక్రయాల తీరిది. మరోవైపు రోజుకు లక్షల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నా, ప్రభుత్వానికి చూపుతున్న లెక్కలు అంతంత మాత్రమే. బోధన్, నిజామాబాద్ ప్రాంతాల్లో నలుగురు (ఆ యిల్ దందా) వ్యాపారులు ఏటా రూ.15 కోట్ల పై బడిన వ్యాపారం చేస్తున్నా రూ.4 కోట్ల వరకే టర్నోవర్ చూపిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులు వాణిజ్య పన్నుల అధికారులకు పట్టడం లేదు.
నిజామాబాద్ డీసీ కార్యాలయం పరిధిలోని నిజామాబాద్-1,2,3 లతో పాటు కామారెడ్డి, బోధన్ సీటీవో కార్యాలయాల పరిధిలో యథేచ్ఛగా దందా సాగుతున్నా పట్టించుకునేవారు లేరు. అక్రమ వ్యాపారాలను తని ఖీలతో నియంత్రించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు అక్రమంగా సరుకులు రవాణా అవుతున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి
వ్యాపార సంస్థలలో లెక్కలేనన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో వాణిజ్య పన్నుల శాఖ ఒక్క అక్రమాన్ని వెలికి తీసినట్లుగానీ, అపరాధ రుసుము వసూలు చేసినట్టుగానీ దాఖలాలుగానీ లేవు. ఆడిట్ మాత్ర మే పూర్తి చేస్తున్నారు. తెర వెనుక అక్రమాలు మా త్రం విచ్చల విడిగా సాగుతున్నాయి. కొనుగోలు చేసిన సరుకులకు రశీదులు ఇవ్వకుండా సొమ్ము చేసుకుంటున్న సంస్థలు బహిరంగంగానే నడుస్తున్నాయి. కొన్ని వ్యాపారసంస్థలు ప్రభుత్వానికి గండి కొడుతున్నాయి. చట్టపరంగా చెల్లించాల్సిన పన్నులను దొడ్డిదారిన కొంతమంది అధికారులకు ముట్ట చెబుతున్నారు.
జేబులు నిండితే చాలు ప్రభుత్వ ఖజానాకు ఎందుకు దండగ అనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. పండుగల సీజన్ రావడం తో కొత్త కొత్త ఆఫర్లు కొంతమంది అధికారులకు ధనలక్ష్మిని గుప్పిట్లో తెచ్చిపెడుతున్నాయి. నిబంధనల ప్రకారం 12 నెలల్లో రూ.40 లక్షల వ్యాపారం సాగితే వ్యాట్ పరిధిలోకి వస్తాయి. అంతకు ముందు తగిన పన్ను చెల్లించాలి. వాటిని నిశితంగా పరిశీ లించాల్సినఅధికారులు మాత్రం ఆదమరిచి వ్యవహరిస్తున్నారు. మి గతా విషయాలలో ఆవురావురంటున్నారు. ఫలితం ప్రజల సొమ్ముకు గండి. ఇందుకు నిదర్శనమే ఈ శాఖ కార్యాలయం పరిధి లో ఈ ఏడాది ఎలాంటి దాడులు జరపకపోవడం... కేసులు నమోద చేయకపోవడం.
మార్గదర్శకాలకు మంగళం
ఏ వ్యాపారైనా వాణిజ్య పన్నులశాఖ నిబంధనలకు లోబడి వ్యాపార లావాదేవీలు నిర్వహించాల్సి ఉంది. అయితే కొందరు అవినీతి అధికారుల అండదండలతో వ్యా పారులు ‘చీకటి’ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. రూ.40 లక్షల వ్యాపార లావాదేవీలు నిర్వహించే సంస్థలు తప్పకుండా వ్యాట్ డీలర్ షిప్ పొందాలి. జిల్లాలోని నిజామా బాద్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో ఈ నిబంధనలను పాటిస్తున్న వ్యాపారులు చాలా అరుదు. దేశీయ వ్యాపార నిబంధనల ప్రకారం డీలర్లు సరుకుల దిగుమతి అర్హులు కాగా మహారాష్ట్ర నుంచి యధేచ్చగా బియ్యం, చక్కెర దిగుమతి జరుగుతోంది.
వరి ధాన్యంతో పాటు పత్తి, సోయా, మొక్కజొన్న లతో పాటు ఇతర రాష్ట్రాలకు సరుకుల క్రయ, విక్రయాల సమయంలో కేంద్ర విక్రయ పన్ను చట్టం 1956 ప్రకారం చెల్లించాలన్న నిబంధనలకు మంగళం పాడేస్తున్నారు. ప్రతి విక్రయదారుడు రూ.100లు దాటిన సరుకులపై కొనుగోలుదారునికి బిల్లు రశీదు ఇవ్వాలన్న నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఇవన్నీ వాణిజ్యపన్నుల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఖజానాకు పెద్ద మొత్తంలో గండి పడుతోంది.