పల్లెల గొంతులు ఎండుతున్నయి
రూ. 172 కోట్లు కరిగిపోయినా
కొలిక్కిరాని పనులు
ఇంకా రూ. వంద కోట్లు వస్తేనే ప్రయోజనం
అరకొరగా నిధులు విదిలిస్తున్న సర్కారు
గడువుల మీద గడువులు పెడుతున్న అధికారులు
నత్తనడకన సాగుతున్న గోదావరి జలాల తాగునీటి పథకం
గ్రామాలలో అప్పుడే మొదలైన వేసవి కష్టాలు
‘ఎంతెంత దూరం...కొంత కొంత దూరం’ అన్నట్టుగా ఉంది కామారెడ్డి తాగునీటి పథకం పనుల తీరు. ఈ పథకం పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సా..గు..తు..న్నా..యి. తెలంగాణలోనే భారీ వ్యయంతో చేపట్టిన గోదావరి జలాల తాగునీటి పథకం పనులపై అధికార పార్టీ నేతలు గొప్పలకు పోతున్నా అవి కొలిక్కిరావడం లేదు. ప్రజల తాగునీటి కష్టాలు తీరడం లేదు.
కామారెడ్డి, న్యూస్‌లైన్:
భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లిన పరిస్థితులలో, కామారెడ్డి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చే ఈ పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ. 140 కోట్లు మంజూరు చేశారు. ప్రజారోగ్య శాఖ రూ. 32 కోట్లు కేటాయించింది. 2008 మార్చి ఒకటిన కామారెడ్డిలో పనులకు మహానేత శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరేళ్లవుతున్నా పనులు ఇంకా ఓ కొలిక్కి లేదు. నెలా,రెండు నెలలలో పనులు పూర్తవుతాయని, కామారెడ్డి పట్టణానికి మొదటగా నీళ్లందిస్తామని అధికారులు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు.
కొద్ది దూరమే
ఇప్పటిదాక మల్లన్నగుట్ట వరకు మాత్రమే ట్రయల్న్ ్రపూర్తయింది. మల్లన్నగుట్ట నుంచి కామారెడ్డి పట్టణానికి పైపులైను పనులు పూర్తి కాలేదు. మరోవైపు ఉన్న నిధులన్నీ అయిపోయాయి. జలాల్‌పూర్ వద్ద ఉన్న శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌ను అర్గుల్‌కు, అక్కడి నుంచి ఇందల్‌వాయి మీదుగా మల్లన్నగుట్ట వరకు పంపింగ్ చేయా ల్సి ఉంటుంది. కామారెడ్డి పట్టణంతోపాటు 219 గ్రామాలకు నీటిని అందించాలి. కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, తాడ్వా యి, సదాశివనగర్, ధర్పల్లి, డిచ్‌పల్లి మండలాలలోని గ్రామాలకు నీటిని అందించేందుకు ఈ పథకానికి రూపకల్పన చేశారు.
తొలిదశ పూర్తి
తొలిదశలో రూ.140 కోట్లతో మల్లన్నగుట్ట వరకు చేపట్టిన పనులు ఇటీవలే పూర్తయ్యాయి. గ్రామాలకు నీటిని అందించాలంటే మరో రూ. 60 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. అది ఇప్పుడు రూ. 120 కోట్లకు చేరుకుంది. ఇటీవల రూ. 20 కోట్లు మంజూరు కావడంతో టెండర్లు నిర్వహించారు. మరో రూ. వంద కోట్లు వస్తేగాని అన్ని గ్రామాలకు నీటిని అందించలేని పరిస్థితి. మూడు నెలల క్రితం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి మల్లన్నగుట్ట వద్ద ఈ పథకం పనులను పరిశీలించిన సందర్భంలో రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినా, ఇంకా ఉత్తర్వులు రాలేదు. మల్లన్నగుట్ట నుంచి కామారెడ్డి పట్టణానికి నీటిని అందించేందుకు ప్రజా ఆరోగ్య శాఖ ద్వారా రూ. 12 కోట్లు మంజూరు చేశారు. పట్టణంలో ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల విస్తరణకు రూ. 20 కోట్లు మంజూరు చే శారు. పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. మల్లన్నగుట్ట నుంచి పట్టణంలోని డిగ్రీ కాలేజీ వరకు పైపులైన్ల పనులు పూర్తి కాకపోవడంతో పట్టణానికి నీరందించ లేకపోతున్నారు. ఇటీవల కలెక్టర్ ప్రద్యుమ్న ఈ పథకం పనులను ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షించారు. మార్చి మొదటి వారంలోగా కామారెడ్డి పట్టణానికి నీటిని అందించే విధంగా పనులను వేగిరం చేయాలని ఆదేశించారని సమాచారం. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కింద పైపులైన్లు వేయడంలో తలెత్తిన ఇబ్బం దులతోనే ఆలస్యమయ్యాయని పబ్లిక్‌హెల్త్ అధికారులు అంటున్నారు.
పట్టణానికి పొంచి ఉన్న ముప్పు
ఏటా మార్చి మొదటి వారం వచ్చేసరికి కామారెడ్డిలో బోర్లు వట్టిపోవడం ద్వారా నీటి కష్టాలు తలెత్తుతుం టాయి. ఈసారి భారీ వర్షాలు కురిసినప్పటికీ పట్ట ణంలో మాత్రం నీటికి ఇబ్బందులు త ప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోగా పైపులైన్ పనులు పూర్తి చేసి మల్లన్నగుట్ట వద్ద నుంచి పట్టణంలోని నీటి ట్యాంకులకు ఎక్కిస్తే గాని వచ్చే నెలలో నీటిని సరఫరా చేయలేని పరిస్థితి. పైపులైన్ల విస్తరణ పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థ ట్రయల్న్ ్రనిర్వహిస్తోంది. మల్లన్నగుట్ట వద్ద నుంచి ట్యాంకులకు నీటిని ఎక్కించిన తరువాతనే పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుంది.
గలగలా గోదారి...దాహం తీరే దారేది?
Published Tue, Feb 4 2014 3:32 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement