under ground level water
-
కరువు ఛాయలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జలం పాతాళానికి పడిపోతోంది. జిల్లా అంతటా భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దశాబ్ద కాలంగా పరిశీలిస్తే.. ఈ ఏడాది నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. ఇది కరువుకు సంకేతమని చెప్పవచ్చు. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 4 మీటర్ల లోతుకు నీటిమట్టం తగ్గిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండటంతోపాటు పెద్దఎత్తున భూగర్భ జలాలను వినియోగిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని భూగర్భ జల శాఖ అధికారులు వివరిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఫరూఖ్‌నగర్ మండలంలో అదనంగా 13.08 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. గతేడాది ఏప్రిల్ ఈ మండలంలో 28.70 మీటర్ల లోతులో నీటి జాడ ఉండగా.. ప్రస్తుతం ఇది 41.78 మీటర్ల కిందకు చేరింది. ఆ తర్వాత స్థానంలో చేవెళ్ల మండలం ఉంది. ఇక్కడ ఏడాది కాలంలో అదనంగా 8.45 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. ఆందోళనకరంగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి జిల్లా సాధారణ వర్షపాతం 666 మిల్లీ మీటర్లు కాగా.. ఇప్పటివరకు 475 మి.మీ వర్షపాతమే కురిసింది. అంటే 28.7 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నమాట. భూగర్భ జలాలు పెరగడానికి ప్రధాన వనరు వర్షమే. అయితే గతేడాది కనీసం సాధారణ స్థాయిలో కూడా వర్షాలు కురవలేదు. రోజువారీ అవసరాలు, పంటల కోసం విస్తృతంగా బోర్లపైనే జిల్లా వాసులు ఆధారపడ్డారు. ఎటువంటి రిజర్వాయర్లు, ఆనకట్టలు లేకపోవడంతో పంటల సాగుకు బోరు బావులే ఆయువుగా మారాయి. ఇలా అన్ని వైపుల నుంచి భూగర్భ జలాలపై భారం పడుతుండడం.. ఆ స్థాయిలో భూమిలోకి నీరు ఇంకే పరిస్థితులు లేకపోవడంతో భూగర్భ నీటిమట్టం పాతాళానికి చేరుకుంటోంది. జిల్లాలో 27 మండలాలు ఉండగా.. చౌదరిగూడం మండలంలో మాత్రమే సాధారణ స్థాయిలో వానలు కురిశాయి. మిగిలిన 26 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో కరువు ఛాయలు అలుముకున్నాయి. డేంజర్ జోన్లోకి.. భూగర్భ జలాలు విచ్చలవిడిగా వాడే గ్రామాలు నాలుగైదేళ్ల కిందట వందలాదిగా ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరగనుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జల శాఖ ప్రతి మూడేళ్లకోసారి వంద శాతం కన్నా మించి భూగర్భ జలాలను వినియోగించే (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ విలేజెస్) గ్రామాల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తుంది. దీని ఆధారంగా ఆయా గ్రామాల్లో భూగర్భ జలం పెంపుదలకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం వివిధ శాఖలకు దిశానిర్దేశం చేస్తుంది. చివరిసారిగా తయారు చేసిన 2012–13 సంవత్సరం జాబితా ప్రకారం.. జిల్లాలో 171 గ్రామాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లో అవసరానికి మించి నీటి వినియోగం జరిగింది. 2016–17 సంవత్సరం వివరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీన్ని ప్రకారం భూగర్భ జలాన్ని వినియోగించే గ్రామాల సంఖ్య గతం కంటే పెరిగే ప్రమాదం ఉందని భూగర్భజల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సంఖ్య 200కు చేరవచ్చని చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మంచాల, కొత్తూరు, అబ్దుల్లాపూర్‌మెట్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, చేవెళ్ల, నందిగామ, హయత్‌నగర్, కడ్తాల్, యాచారం, కందుకూరు మండలాల్లో భూగర్భ జలాల వినియోగం అత్యంత ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీని వల్ల భవిష్యత్తులో అనేక అనర్థాలు తలెత్తే ప్రమాదం ఉంది. అధికారుల పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని 40 బోరుబావుల్లో నీటిమట్టాన్ని జిల్లా భూగర్భశాఖ అధికారులు ఏడాది పాటు పరిశీలించగా విస్తుపోయే ఫలితాలు వచ్చాయి. ఈ బావుల్లో గతేడాది ఏప్రిల్ నెలలో సగటున 14.86 మీటర్ల లోతులో నీళ్లు ఉండగా.. ఈ ఏడాది జనవరి వచ్చేసరికి నీటిమట్టం 18.73 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే ఏడాదికాలంలోనే 3.87 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పరిశీలించిన 40 బావుల్లో.. నాలుగింటిలో మాత్రమే నీటిమట్టం పెరిగింది. బాలాపూర్ మండలం నాదర్గుల్లో గరిష్టంగా 3.28 మీటర్లపైకి నీటిమట్టం చేరుకుంది. మిగిలిన 36 బావుల్లో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. గరిష్టంగా మొయినాబాద్‌లో 14.59 లోతుకు దిగజారింది. 8 మండలాల్లో 20మీటర్ల లోతుకుపైగా, మరో 8 మండలాల్లో 15 నుంచి 20 మీటర్ల లోతులో, 8 మండలాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. చేతులెత్తేసిన ఆయా విభాగాలు పలు శాఖల మధ్య కొరవడిన సమన్వయం వల్ల భూగర్భ జల మట్టం పెరగడం లేదు. అత్యధికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్న గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన ప్రభుత్వ విభాగాలు చేతులెత్తేశాయి. ఆయా ఊళ్లలో బోరు బావుల తవ్వకాలను కట్టడిచేయడం, తక్కువ నీరుతో పండే పంటలను ప్రోత్సహించడం, వాల్టా చట్టం పక్కాగా అమలయ్యేలా చూడడం లాంటి చర్యలు తీసుకోవాలి. భూగర్భ జల శాఖ సూచనలతో అటు వ్యవ సాయ శాఖ, ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ పనిచేస్తే కరవును అరికట్టే వీలుంది. సేద్యపు కుంటలు తవ్వుకోవడంలో చాలా మంది రైతులు అలసత్వం వహిస్తున్నారు. నీటి సంరక్షణ చేపట్టే రైతులకే వ్యవసాయ శాఖ వివిధ రాయితీలు ఇవ్వడంలో ప్రాధాన్యం ఇస్తే పరిస్థితి కొంత వరకు మెరుగుపడే అవకాశం ఉంది. ప్రజల్లో భూగర్భ జల సంరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
సోయానే దిక్కు..?
రానున్న ఖరీఫ్ సీజనులో రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వరికి బదులు ఆరుతడి పంట సోయా వైపు రైతులు మొగ్గు చూపుతారని భావిస్తూ సబ్సిడీ సోయా విత్తనాలను ఎక్కువ మొత్తంలో తెప్పించాలని నిర్ణయించింది. 1.12 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సరిపడా 30 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని ప్రతిపాదన పంపింది. 60,863 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం కానున్నట్లు వ్యవసాయశాఖ తన ప్రణాళికలో పేర్కొంది. ప్రస్తుతం 23,881 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా ఆయకట్టుకు ఆధారమైన నిజాంసాగర్‌లో నీళ్లు లేవు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ దశకు చేరుకుంటోంది.. భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి బోర్లు వట్టి పోతున్నాయి.. ఈ నేపథ్యంలో రానున్న ఖరీఫ్ సీజనులో రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖనే అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆ శాఖ ముందు జాగ్రత్త పడుతోంది. ఇందుకు అనుగుణంగా తన ఖరీఫ్ ప్రణాళికను మార్చుకుంది. ఈసారి రైతులు వరికి బదులు ఆరుతడి పంట సోయా వైపు మొగ్గు చూపే అవకాశాలుండటంతో సబ్సిడీ సోయా విత్తనాలను ఎక్కువ మొత్తంలో తెప్పించాలని నిర్ణయించింది. గత ఏడాది (2018) ఖరీఫ్ సీజనులో సోయా 83,265 ఎకరాల్లో సాగైంది. ఈసారి 1.12 లక్షల ఎకరాలకు చేరే అవకాశాలున్నాయి. దీంతో ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సోయా విత్తనాలను తెప్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. 1.12 లక్షల ఎకరాలకు సరిపడా 30 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖకు ప్రతిపాదన పంపింది. అలాగే మరో 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 500 క్వింటాళ్ల మొక్కజొన్న, ఐదు వేల క్వింటాళ్ల జీలుగ, 130 క్వింటాళ్ల సన్‌హెంప్ విత్తనాలు అవసరమని ఆ శాఖ కమిషనరేట్‌కు ప్రతిపాదించింది. స్వల్పంగా తగ్గనున్న వరి విస్తీర్ణం.. రానున్న ఖరీఫ్ సీజనులో వరి విస్తీర్ణం స్వల్పంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఖరీఫ్ సీజనులో జిల్లాలో 2.53 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైంది. ఈసారి మాత్రం 2.25 లక్షల ఎకరాలకు తగ్గనున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది. అలాగే మొక్కజొన్న 52 వేల ఎకరాల నుంచి 49 వేల ఎకరాలు సాగయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. మొత్తం మీద ఈ ఖరీఫ్‌లో 4.41 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని ప్రణాళికను సిద్ధం చేసింది. గత సీజనులో అన్ని రకాల పంటలు కలిపి 4.42 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. యూరియా వినియోగం.. ఈ ఖరీఫ్ సీజనులో 60,863 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం కానున్నట్లు వ్యవసాయశాఖ తన ప్రణాళికలో పేర్కొంది. ప్రస్తుతం 23,881 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, అవసరానికి అనుగుణంగా యూరియాను తెప్పించాలని భావిస్తోంది. అలాగే 10,794 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం కాగా, ప్రస్తుతం 4,527 మెట్రిక్‌టన్నులు అందుబాటులో ఉంది. అలాగే 7,712 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులకు గాను 1,392 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు గుర్తించారు. ఇక కాంప్లెక్స్ ఎరువులు 26,529 మెట్రిక్ టన్నులకు గాను, అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే రివైజ్డ్ యాక్షన్ ప్లాన్.. ప్రస్తుత పరిస్థితులు., రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ఖరీఫ్ ప్రణాళికను రూపొందిస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు మారితే అందుకు అనుగుణంగా సవరించిన ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. -
గలగలా గోదారి...దాహం తీరే దారేది?
పల్లెల గొంతులు ఎండుతున్నయి రూ. 172 కోట్లు కరిగిపోయినా కొలిక్కిరాని పనులు ఇంకా రూ. వంద కోట్లు వస్తేనే ప్రయోజనం అరకొరగా నిధులు విదిలిస్తున్న సర్కారు గడువుల మీద గడువులు పెడుతున్న అధికారులు నత్తనడకన సాగుతున్న గోదావరి జలాల తాగునీటి పథకం గ్రామాలలో అప్పుడే మొదలైన వేసవి కష్టాలు ‘ఎంతెంత దూరం...కొంత కొంత దూరం’ అన్నట్టుగా ఉంది కామారెడ్డి తాగునీటి పథకం పనుల తీరు. ఈ పథకం పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సా..గు..తు..న్నా..యి. తెలంగాణలోనే భారీ వ్యయంతో చేపట్టిన గోదావరి జలాల తాగునీటి పథకం పనులపై అధికార పార్టీ నేతలు గొప్పలకు పోతున్నా అవి కొలిక్కిరావడం లేదు. ప్రజల తాగునీటి కష్టాలు తీరడం లేదు. కామారెడ్డి, న్యూస్‌లైన్: భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లిన పరిస్థితులలో, కామారెడ్డి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చే ఈ పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ. 140 కోట్లు మంజూరు చేశారు. ప్రజారోగ్య శాఖ రూ. 32 కోట్లు కేటాయించింది. 2008 మార్చి ఒకటిన కామారెడ్డిలో పనులకు మహానేత శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరేళ్లవుతున్నా పనులు ఇంకా ఓ కొలిక్కి లేదు. నెలా,రెండు నెలలలో పనులు పూర్తవుతాయని, కామారెడ్డి పట్టణానికి మొదటగా నీళ్లందిస్తామని అధికారులు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. కొద్ది దూరమే ఇప్పటిదాక మల్లన్నగుట్ట వరకు మాత్రమే ట్రయల్న్ ్రపూర్తయింది. మల్లన్నగుట్ట నుంచి కామారెడ్డి పట్టణానికి పైపులైను పనులు పూర్తి కాలేదు. మరోవైపు ఉన్న నిధులన్నీ అయిపోయాయి. జలాల్పూర్ వద్ద ఉన్న శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌ను అర్గుల్‌కు, అక్కడి నుంచి ఇందల్వాయి మీదుగా మల్లన్నగుట్ట వరకు పంపింగ్ చేయా ల్సి ఉంటుంది. కామారెడ్డి పట్టణంతోపాటు 219 గ్రామాలకు నీటిని అందించాలి. కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, తాడ్వా యి, సదాశివనగర్, ధర్పల్లి, డిచ్పల్లి మండలాలలోని గ్రామాలకు నీటిని అందించేందుకు ఈ పథకానికి రూపకల్పన చేశారు. తొలిదశ పూర్తి తొలిదశలో రూ.140 కోట్లతో మల్లన్నగుట్ట వరకు చేపట్టిన పనులు ఇటీవలే పూర్తయ్యాయి. గ్రామాలకు నీటిని అందించాలంటే మరో రూ. 60 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. అది ఇప్పుడు రూ. 120 కోట్లకు చేరుకుంది. ఇటీవల రూ. 20 కోట్లు మంజూరు కావడంతో టెండర్లు నిర్వహించారు. మరో రూ. వంద కోట్లు వస్తేగాని అన్ని గ్రామాలకు నీటిని అందించలేని పరిస్థితి. మూడు నెలల క్రితం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి మల్లన్నగుట్ట వద్ద ఈ పథకం పనులను పరిశీలించిన సందర్భంలో రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినా, ఇంకా ఉత్తర్వులు రాలేదు. మల్లన్నగుట్ట నుంచి కామారెడ్డి పట్టణానికి నీటిని అందించేందుకు ప్రజా ఆరోగ్య శాఖ ద్వారా రూ. 12 కోట్లు మంజూరు చేశారు. పట్టణంలో ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల విస్తరణకు రూ. 20 కోట్లు మంజూరు చే శారు. పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. మల్లన్నగుట్ట నుంచి పట్టణంలోని డిగ్రీ కాలేజీ వరకు పైపులైన్ల పనులు పూర్తి కాకపోవడంతో పట్టణానికి నీరందించ లేకపోతున్నారు. ఇటీవల కలెక్టర్ ప్రద్యుమ్న ఈ పథకం పనులను ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షించారు. మార్చి మొదటి వారంలోగా కామారెడ్డి పట్టణానికి నీటిని అందించే విధంగా పనులను వేగిరం చేయాలని ఆదేశించారని సమాచారం. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కింద పైపులైన్లు వేయడంలో తలెత్తిన ఇబ్బం దులతోనే ఆలస్యమయ్యాయని పబ్లిక్‌హెల్త్ అధికారులు అంటున్నారు. పట్టణానికి పొంచి ఉన్న ముప్పు ఏటా మార్చి మొదటి వారం వచ్చేసరికి కామారెడ్డిలో బోర్లు వట్టిపోవడం ద్వారా నీటి కష్టాలు తలెత్తుతుం టాయి. ఈసారి భారీ వర్షాలు కురిసినప్పటికీ పట్ట ణంలో మాత్రం నీటికి ఇబ్బందులు త ప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోగా పైపులైన్ పనులు పూర్తి చేసి మల్లన్నగుట్ట వద్ద నుంచి పట్టణంలోని నీటి ట్యాంకులకు ఎక్కిస్తే గాని వచ్చే నెలలో నీటిని సరఫరా చేయలేని పరిస్థితి. పైపులైన్ల విస్తరణ పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థ ట్రయల్న్ ్రనిర్వహిస్తోంది. మల్లన్నగుట్ట వద్ద నుంచి ట్యాంకులకు నీటిని ఎక్కించిన తరువాతనే పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుంది.