సాక్షి, కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్‌పై రైతులంతా తిరుగుబాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మనఊరు మనపోరు’ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. 12 వేల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో ప్రతిరైతు సంతోషంగా ఉంటారని అన్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెడుతున్న కేసీఆర్.. రైతులకు ఆ మాత్రం చేయలేరా? అని సూటిగా ప్రశ్నించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.
పంజాబ్, హర్యానా రైతులకంటే నిజామాబాద్ రైతులు చైతన్యవంతులని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ముఖ్యమంత్రి కూతురు కవితను ఓడించారని గుర్తు చేశారు. గెలిపిస్తే పసుపు బోర్డ్ తెస్తామని హామీ ఇచ్చి మరచిన ఎంపీని కూడా ఓడించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment