కామారెడ్డి, న్యూస్‌లైన్: రియల్ దందా తిరోగమనంలో నడుస్తోంది. కొనుగోళ్లు, అమ్మకాలు మందగించడంతో రిజిస్ట్రేషన్లు సగానికి సగం తగ్గిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వాదాయం గణనీయంగా పడిపోతోంది. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణంలో గత మూడు, నాలుగేళ్లలో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూముల క్రయవిక్రయాలు జరి గాయి. గత ఏడాదీ రియల్ దందా బాగానే సాగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భూముల విలువలు పెరుగుతాయని, రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటాయని ప్రభుత్వం ముందుగానే ప్రకటించడంతో పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరిగాయి. తరువాత తగ్గుతూ వచ్చి రెం డు, మూడు నెలలుగా సగానికి సగం పడిపోయాయి. దీంతో రియల్ వ్యాపారంలో స్తబ్ధత ఏర్పడింది.
కామారెడ్డిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం ఇలా
కామారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ఏడాది జనవరిలో 808 రిజిస్ట్రేషన్లు జరుగగా రూ. 75.22 లక్షల ఆదాయం సమకూరింది. ఫిబ్రవరిలో 839 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 91.30 లక్షలు, మార్చిలో 1276 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1.92 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్‌లో 674 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 82.65 లక్షలు, మే నెలలో 732 రిజిస్ట్రేషన్లకుగాను రూ. 82. 43 లక్ష లు, జూన్‌లో 665 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 76.83 లక్షలు, జూలైలో 527 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 70.33 లక్షలు, ఆగస్టు లో 442 రిజిస్ట్రే షన్ల ద్వారా రూ. 57.22 లక్షలు, సెప్టెంబర్‌లో 579 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 94.64 లక్షలు, అక్టోబర్‌లో 587 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 71.51 లక్షలు, నవంబర్‌నెలలో ఇ ప్ప టి దాకా 421 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 53.57 లక్షల ఆదాయం సమకూరింది. దీనిని బట్టి ఇక్కడ రియల్ వ్యాపారం ఎంతగా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవచ్చు.
అప్పులపాలైన వ్యాపారులు
రియల్ దందాలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు పరిస్థితులు తారుమారు కావడంతో ఆందోళనకు గురవుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గతంలో డబ్బులు సంపాదించిన వారు సర్దుకుపోగా, కొత్తగా వ్యాపారంలో ప్రవేశించిన వారు అప్పులు కట్టే పరిస్థితులు లేక తల్లడిల్లిపోతున్నారు. అడ్డ గోలు వడ్డీల కారణంగా తమ ఆస్తు లు అమ్ముకున్నా అప్పులు తీరేలా కనిపించడం లేదని కొం దరు ఆందోళన చెందుతున్నారు.
ఫైనాన్సుల్లో ఖాళీ ఖజానా
కామారెడ్డిలో కోట్ల రూపాయలు టర్నోవర్ చేసే ఫైనాన్సుల్లో సైతం ప్రస్తుతం డబ్బులు లేదని అంటున్నారు. చాలా మంది ఫైనాన్సుల నుంచి అప్పులు తీసుకుని భూములపై పెట్టుబడు లు పెట్టడం, అవి రికవరీ కాకపోవడంతో ఫైనాన్సుల్లో డబ్బు లు రికవరీ కావడం లేదని తెలుస్తోంది. కొన్ని ఫైనాన్సుల యజమానులు సైతం భూములపై పెట్టుబడులు పెట్టి ఇప్పు డు లబోదిబోమంటున్నారు. అత్యాశకు పోయి బోల్తాపడ్డామని ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ బూమ్ తిరిగి ఎప్పుడు వస్తుందో, తమ పెట్టుబడులు ఎప్పు డు రికవరీ అవుతాయోనని చాలా మంది వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు.
ఉల్టాపల్టా.. తిరగబడిన ‘రియల్’ దందా
Published Tue, Nov 26 2013 5:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement