realty stocks
-
ఆస్తి అమ్మకాలకు మరింత కష్టకాలం
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ స్టాక్స్‌కు మంచి ఏడాది ఏదైనా ఉందంటే అది 2007నే. అప్పటినుంచి ఇప్పటివరకు మార్కెట్లో రియాల్టీ స్టాక్స్ కోలుకోలేని దెబ్బతింటున్నాయి. ప్రతేడాది 85 శాతం కుప్పకూలుతూ వస్తున్నాయి. 2007 డిసెంబర్ నుంచి 2017 జనవరి 25 వరకు బీఎస్ఈ రియాల్టీ సూచీ దాదాపు 90 శాతం పడిపోయింది. దీనికి తోడు పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్8న కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం. వీటికి మరింత ప్రతికూలంగా మారింది. బ్లాక్‌మనీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి 2017లోనూ ఆస్తి అమ్మకాలు మరో 30 శాతం కిందకి పడిపోతాయట. ఫిచ్ రేటింగ్స్ అంచనాల ప్రకారం దేశంలో ప్రాపర్టీ అమ్మకాలు 20-30 శాతం కిందకి పడిపోతాయని తెలిసింది. పెద్ద నోట్ల రద్దు, ఇతర అంశాలు గృహ కొనుగోలుదారుల్లో సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయని రేటింగ్ సంస్థ పేర్కొంది. నోట్ల రద్దుతో గృహాల కొనుగోలుకు డిమాండ్ తగ్గడంతో బిల్డర్స్ చుక్కలు చూస్తున్నారు. డిమాండ్ బలహీన దశలో ఉండటంతో ఆస్తుల అమ్మక ధరలు తగ్గించడానికి బిల్డర్స్ వెనుకాడటం లేదు. లిక్విడిటీపై మరిన్ని ఆంక్షలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ ఈ బడ్జెట్లో లిక్విడిటీపై ఆంక్షలు పెరిగితే రియాల్టీ అమ్మకాలు 2017లోనూ కష్టకాలం ఎదుర్కోవాల్సి వస్తుందని ఫిచ్ తెలిపింది. ఈ ఏడాది గృహ ధరలు భారీగా తగ్గుతాయని ఫిచ్ అంచనావేస్తోంది. నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ అంచనా ప్రకారం రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకాలు 2016 చివరి త్రైమాసికంలో యేటికేటికి 44 శాతం పడిపోతాయని, మొత్తంగా అమ్మకాలు 9 శాతం క్షీణిస్తాయని తెలుస్తోంది. దీంతో మార్కెట్లో రియాల్టీ స్టాక్స్ మరింత పడిపోనున్నాయట. యూనిటెక్, హెచ్‌డీఐఎల్, శోభా డెవలపర్స్, ప్రెస్టేజి ఎస్టేట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ వంటివి భారీగా క్షీణించనున్నాయట. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, లోధా డెవలపర్స్ వాటి బ్రాండ్ విలువతో కొంత లాభపడొచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి. -
ఆర్ఈఐటీ నిబంధనల మార్పునకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)ల నిబంధనలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే బాటలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన సలహాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా వీటి ఆస్తుల కనీస పరిమాణాన్ని రూ. 1,000 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అధిక రిస్క్‌ల నేపథ్యంలో తొలి దశకింద పెద్ద ఇన్వెస్టర్లకు మాత్రమే వీటిలో పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించేందుకు ప్రతిపాదించింది. వెరసి కనీస పెట్టుబడి పరిమితిని రూ. 2 లక్షలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లతోపాటు, దేశీ బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్ తదితరాలు వీటిలో ఇన్వెస్ట్‌చేసేందుకు వీలు కల్పించింది. ఆర్ఈఐటీ నిబంధనలతోపాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్స్)లకు సంబంధించిన మార్గదర్శకాలకు కూడా ఈ నెల 10న(ఆదివారం) జరగనున్న సమావేశంలో బోర్డు ఆమోదముద్ర వేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇన్ఫ్రా రంగానికి అవసరమయ్యే రూ. 65 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణకు వీలు కల్పించే యోచనతో ఇన్విట్స్కు తెరలేపింది. సెబీ బోర్డు సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యే అవకాశముంది. జైట్లీ ప్రకటించిన సాధారణ బడ్జెట్లో రియల్టీ, ఇన్ఫ్రా ట్రస్ట్‌లలో పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. -
సెన్సెక్స్@25,000
తొలిసారి 25,000 పాయింట్లపైన ముగింపు * 214 పాయింట్లు జంప్... * నిఫ్టీ కూడా కొత్త క్లోజింగ్ రికార్డు... * 72 పాయింట్లు ఎగసి 7,474 వద్ద క్లోజ్... * మెటల్స్, విద్యుత్, చమురు-గ్యాస్ షేర్ల దూకుడు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్న సెన్సెక్స్... గురువారం సిల్వర్‌జూబ్లీ చేసుకుంది. చరిత్రలో తొలిసారిగా 25 వేల పాయింట్లకుపైన ముగియడం ద్వారా ఆల్‌టైమ్ రికార్డును నమోదుచేసింది. దేశీ ఆర్థిక వ్యవస్థ అంచనాలకంటే ముందే చాలావేగంగా పుంజుకోవచ్చన్న సంకేతాలు బలపడుతుండటం... యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించొచ్చన్న అంచనాలు దేశీ మార్కెట్లలో కొత్త జోష్ నింపాయి. ప్రధానంగా విద్యుత్, మెటల్స్. చమురు-గ్యాస్ రంగాల షేర్లు పరుగులు తీయడంతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ కూడా కొత్త శిఖరాలను చేరుకున్నాయి. ముంబై: సెన్సెక్స్ గురువారం ట్రేడింగ్ ఆరంభంలో సానుకూలంగానే స్వల్పలాభాలతో ప్రారంభమైంది. క్రితం ముగింపు 24,806 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 24,828 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఆతర్వాత ఒకానొక దశలో 24,645 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అయితే, ఇక అక్కడినుంచీ క్రమంగా పుంజుకుంటూ పైపైకి ఎగబాకింది. 25,044 పాయింట్ల గరిష్టాన్ని తాకి... చివరకు దాదాపు అదేస్థాయిలో 25,020 వద్ద స్థిరపడింది. అంటే 214 పాయింట్లు బలపడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలరోజున మోడీ నేతృత్వంలోని ఎన్డీఏకు బంపర్ మెజారిటీ లభించడంతో సెన్సెక్స్ తొలిసారి 25 వేల మార్కును దాటి ఇంట్రాడేలో 25,376 పాయింట్లను తాకడం తెలిసిందే. అయితే, ఆరోజు చివర్లో లాభాల స్వీకరణతో 25 పాయింట్లపైన సెన్సెక్స్ ముగియకుండా మళ్లీ కిందికి వచ్చేసింది. ఇప్పుడు రెండోసారి 25 పాయింట్లను అధిగమించి... ఆస్థాయిపైనే ముగియడంతో కొత్త ఆల్‌టైమ్ ముగింపు రికార్డుతోపాటు సిల్వర్‌జూబ్లీని పూర్తిచేసుకున్నట్లయింది. ఇదిలాఉండగా... నిఫ్టీ కూడా ఎన్నికల ఫలితాల రోజున 7,500 పాయింట్లను తొలిసారి అధిగమించి 7,563ను తాకి మళ్లీ దిగువకు వచ్చేయడం విదితమే. అయితే, ఇప్పుడు నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 7,474 పాయింట్ల కొత్త ముగింపు రికార్డును నమోదు చేసింది. ఈ నెల 3న సాధించిన క్లోజింగ్ రికార్డులను సెన్సెక్స్, నిఫ్టీ రెండు గురువారం నాడు బద్దలుకొట్టాయి. రిటైల్ ఇన్వెస్టర్ల జోరుతో... విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహానికి తోడు రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోళ్లకు ఉత్సాహంగా ముందుకొస్తుండటంతో మార్కెట్ సెంటిమెంట్ బలోపేతంమవుతోందని బ్రోకరేజి, ట్రేడింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈసీబీ సహాయ ప్యాకేజీ గనుక ప్రకటించినపక్షంలో ఆ నిధులు కూడా మన మార్కెట్లోకి కొంత రావచ్చని దీనివల్ల బుల్స్ మరింత దూకుడు పెంచే అవకాశాలున్నాయనేది పరిశీలకుల అభిప్రాయం. ఇది కూడా మార్కెట్‌కు బూస్ట్‌గా పనిచేసింది. గురువారం పొద్దుపోయాక ఈసీబీ పరపతి విధాన సమీక్ష నిర్ణయం వెలువడనుంది. మరోపక్క, కొత్త వ్యాపార ఆర్డర్లతో దేశ సేవల రంగం ఏడాది తర్వాత మళ్లీ మే నెలలో పుంజుకోవడం కూడా ఇన్వెస్టర్లకు టానిక్‌లా పనిచేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా.. ప్రీ-బడ్జెట్ సంప్రతింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం వ్యవసాయ రంగ ప్రతినిధులతో భేటీ అయ్యారు. శుక్రవారం కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశం కానున్నారు. ఇతర ముఖ్యాంశాలివీ... బీఎస్ఈలోని మొత్తం 12 రంగాల సూచీల్లో 11 రంగాలు లాభాలతో ముగియడం... కొనుగోళ్ల జోరుకు అద్దంపడుతోంది. మెటల్స్ సూచీ అత్యధికంగా 3.33 శాతం దూసుకెళ్లింది. ఆతర్వాత చమురు-గ్యాస్, విద్యుత్ 1.96 శాతం చొప్పున... ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.49%, ఐటీ సూచీ 1.29% చొప్పున బలపడ్డాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు కొత్త 52 వారాల గరిష్టాన్ని తాయాకి. 1.42%, 1.01% చొప్పున పుంజుకున్నాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్ జాబితాలో 23 షేర్లు లాభాలతో ముగిశాయి. ఇక భారీగా పుంజుకున్న షేర్లలో సెసాస్టెరిలైట్ 6.5%, హిందాల్కో 5.54%, హెచ్‌యూఎల్ 4.27%, టాటా పవర్ 3.64%, టాటా స్టీల్ 3.45%, టాటా మోటార్స్ 3.11% ఉన్నాయి. గెయిల్ 2.77%, ఓఎన్జీసీ 2.01%, విప్రో 1.88%, ఇన్ఫోసిస్ 1.48 శాతం చొప్పున బలపడ్డాయి. సెన్సెక్స్‌లో ట్రేడయిన షేర్లలో 2,153 స్టాక్స్ లాభాల్లో ముగియగా... 869 మాత్రమే నష్టాపోయాయి. ఇక బీఎస్ఈ నగదు విభాగంలో టర్నోవర్ క్రితం రోజుతో పోలిస్తే మెరుగుపడి రూ.4,906.75 కోట్లకు చేరింది. ఎన్ఎస్ఈ క్యాష్ సెగ్మెంట్లో రూ. 25,335 కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.1,71,850 కోట్ల టర్నోవర్ నమోదైంది. ప్రాథమిక గణాంకాల ప్రకారం బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో రూ.193 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరపగా... గురువారం మరో రూ.1,369 కోట్ల నికర పెట్టుబడులు కుమ్మరించినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌కు ముందే 30,000కు..! మార్కెట్ జోరు చూస్తుంటే... బడ్జెట్‌కు ముందే సెన్సెక్స్ 30,000 పాయింట్ల స్థాయికి దూసుకెళ్లే అవకాశం ఉందని మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఎండీ మోతీలాల్ ఓశ్వాల్ అభిప్రాయప్డారు. మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం చేపడుతన్న ప్రతి ఒక్క చర్యనూ ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని.. ఈజీఓఎంలను రద్దు చేయడం, 100 రోజుల ఎజెండాను నిర్ధేశించడం, నల్లధనంపై పోరుకు సిట్ ఏర్పాటు వంటి కొన్ని కీలక చర్యలతో ఇన్వెస్టర్లలో విశ్వాసం ఇనుమడించిందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి పేర్కొన్నారు. వ్యాపారానుకూల ఆర్థిక విధానాలను మోడీ సర్కారు అవలంభిస్తున్న అంచనాల నేపథ్యంలో ఆటంకాలు తొలగి మళ్లీ ఆర్థిక వృద్ధిరేటు గాడిలోపడుతుందన్న నమ్మకం పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. -
ఉల్టాపల్టా.. తిరగబడిన ‘రియల్’ దందా
కామారెడ్డి, న్యూస్‌లైన్: రియల్ దందా తిరోగమనంలో నడుస్తోంది. కొనుగోళ్లు, అమ్మకాలు మందగించడంతో రిజిస్ట్రేషన్లు సగానికి సగం తగ్గిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వాదాయం గణనీయంగా పడిపోతోంది. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణంలో గత మూడు, నాలుగేళ్లలో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూముల క్రయవిక్రయాలు జరి గాయి. గత ఏడాదీ రియల్ దందా బాగానే సాగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భూముల విలువలు పెరుగుతాయని, రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటాయని ప్రభుత్వం ముందుగానే ప్రకటించడంతో పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరిగాయి. తరువాత తగ్గుతూ వచ్చి రెం డు, మూడు నెలలుగా సగానికి సగం పడిపోయాయి. దీంతో రియల్ వ్యాపారంలో స్తబ్ధత ఏర్పడింది. కామారెడ్డిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం ఇలా కామారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ఏడాది జనవరిలో 808 రిజిస్ట్రేషన్లు జరుగగా రూ. 75.22 లక్షల ఆదాయం సమకూరింది. ఫిబ్రవరిలో 839 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 91.30 లక్షలు, మార్చిలో 1276 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1.92 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్‌లో 674 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 82.65 లక్షలు, మే నెలలో 732 రిజిస్ట్రేషన్లకుగాను రూ. 82. 43 లక్ష లు, జూన్‌లో 665 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 76.83 లక్షలు, జూలైలో 527 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 70.33 లక్షలు, ఆగస్టు లో 442 రిజిస్ట్రే షన్ల ద్వారా రూ. 57.22 లక్షలు, సెప్టెంబర్‌లో 579 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 94.64 లక్షలు, అక్టోబర్‌లో 587 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 71.51 లక్షలు, నవంబర్నెలలో ఇ ప్ప టి దాకా 421 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 53.57 లక్షల ఆదాయం సమకూరింది. దీనిని బట్టి ఇక్కడ రియల్ వ్యాపారం ఎంతగా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవచ్చు. అప్పులపాలైన వ్యాపారులు రియల్ దందాలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు పరిస్థితులు తారుమారు కావడంతో ఆందోళనకు గురవుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గతంలో డబ్బులు సంపాదించిన వారు సర్దుకుపోగా, కొత్తగా వ్యాపారంలో ప్రవేశించిన వారు అప్పులు కట్టే పరిస్థితులు లేక తల్లడిల్లిపోతున్నారు. అడ్డ గోలు వడ్డీల కారణంగా తమ ఆస్తు లు అమ్ముకున్నా అప్పులు తీరేలా కనిపించడం లేదని కొం దరు ఆందోళన చెందుతున్నారు. ఫైనాన్సుల్లో ఖాళీ ఖజానా కామారెడ్డిలో కోట్ల రూపాయలు టర్నోవర్ చేసే ఫైనాన్సుల్లో సైతం ప్రస్తుతం డబ్బులు లేదని అంటున్నారు. చాలా మంది ఫైనాన్సుల నుంచి అప్పులు తీసుకుని భూములపై పెట్టుబడు లు పెట్టడం, అవి రికవరీ కాకపోవడంతో ఫైనాన్సుల్లో డబ్బు లు రికవరీ కావడం లేదని తెలుస్తోంది. కొన్ని ఫైనాన్సుల యజమానులు సైతం భూములపై పెట్టుబడులు పెట్టి ఇప్పు డు లబోదిబోమంటున్నారు. అత్యాశకు పోయి బోల్తాపడ్డామని ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ బూమ్ తిరిగి ఎప్పుడు వస్తుందో, తమ పెట్టుబడులు ఎప్పు డు రికవరీ అవుతాయోనని చాలా మంది వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు.