కామారెడ్డి జిల్లా: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి సమాయత్తమవుతోంది తెలంగాణ అమరుల ఐక్యవేదిక. దీనిలో భాగంగా రెండొందల మంది అమరుల కుటుంబ సభ్యులు నామినేషన్ పత్రాల కోసం కామారెడ్డికి వచ్చినట్లు తెలంగాణ అమరుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి స్పష్టం చేశారు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన రఘుమారెడ్డి.. తెలంగాణలో 1345 మంది తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైతే కేవలం 400 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించిందన్నారు. కొంతమందికి నాల్గవ తరగతి ఉద్యోగాలు ఇవ్వగా, మరికొంతమందికి ఐదేళ్ల తర్వాత రూ. 10 లక్షల చొప్పున ఇచ్చారన్నారు.
‘రైల్ రోకో, బస్ రోకో చేసిన సమయంలో 175 మంది వికలాంగులుగా మారారు.. వీరికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. చదువుకున్న వారికి విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. చదువుకోని వారికి ఒక్క కుటుంబానికి 10 ఎకరాలు ఇవ్వాలి. తమ డిమాండ్లు ఈ నెల 9 మధ్యాహ్నం 12:30 లోపు కేసీఆర్ తమను పిలిచి మేనిఫెస్టోలో చేర్చాలి.
లేకపోతే ఆ రోజు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ వేసిన మరుక్షణమే 200 మంది అమరుల కుటుంబాలు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. కామారెడ్డితో పాటు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో కూడా నామినేషన్స్ వేస్తాం’ అని హెచ్చరించారు.
నేను కందిపప్పు అయితే నువ్వు గన్నేరు పప్పు: కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment