సాక్షి, కామారెడ్డి : గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకుని కామారెడ్డి అశోక్‌నగర్ కాలనీలో మకాం పెట్టిన ఓ భర్తను పట్టుకొని మొదటి భార్య దేహశుద్ది చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా ముఠా కొండూరు మండలం చేర్యాల గ్రామానికి చెందిన పరశురాం బోర్‌వేల్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య ధనలక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారంతా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
వ్యాపారం నిమిత్తం అన్ని ప్రాంతాలకు తిరిగే పరశురాం మూడు నెలలుగా ఇంటికి తిరిగి వెళ్లలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా కామారెడ్డికి చెందిన ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని అశోక్‌నగర్‌లో ఉంటున్నాడని తెలిసింది. దీంతో సోమవారం బంధువులతో కలిసి వచ్చి, పరశురాంను పట్టుకుని చితకబాది తమ వెంట తీసుకెళ్లారు. తనకు మాయమాటలు చెప్పి అన్యాయం చేశాడని రెండో భార్య కవిత ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment