husband cheating
-
ప్రేమించి పెళ్లాడి.. వదిలేశాడు
చిత్తూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కడుపు వస్తే మాయ మాటలతో కడుపు తీయించి గాలికి వదిలేశాడంటూ బాధితురాలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఎస్ఐ దస్తగిరి మాట్లాడుతూ కడప జిల్లా పులివెందులకు చెందిన శిరీష, చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఈదువారిపల్లెకు చెందిన నిరంజన్‌కుమార్ విజయవాడలో 2018 నుంచి 2022 వరకూ ఒకే కళాశాలలో బీటెక్ చదువుకున్నారు. కళాశాలలో చేరినప్పటి నుంచి వెంటపడి ప్రేమించి, మొదటి సంవత్సరం ఆఖరిలో విజయవాడలోనే కనక దుర్గమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కలిసే ఉంటున్నారు. 2021లోర్భం దాల్చన విషయాన్ని గుర్తించిన నిరంజన్‌కుమార్ తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయాన్ని, తాను గర్భంగా ఉన్న విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నన్ను ఇష్టపడ లేదు. దీంతో నిరంజన్‌కుమార్ మా తల్లిదండ్రులకు నచ్చలేదు. వేరే పెళ్లి చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో వారి తల్లిదండ్రులను నిలదీస్తే, నాలుగేళ్లు ఆగు చూద్దామని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమై కడపలో కూడా నిరంజన్‌కుమార్‌పై కేసు పెట్టడంతో, అక్కడి పోలీసులు అతనితో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నిరంజన్ వారి సమీప బంధువును ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో శిరీష వెళ్లి వారి తల్లిదండ్రులను ప్రశ్నించింది. దీంతో వారు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ పేర్కొన్నారు. -
Hyderabad: నిత్య పెళ్లికొడుకు లీలలు, 8 మందిని పెళ్లి చేసుకున్న మాయగాడు..
-
Hyderabad: నిత్య పెళ్లికొడుకు లీలలు, 8 మందిని పెళ్లి చేసుకున్న మాయగాడు..
సాక్షి, హైదరాబాద్: మహిళలకు మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్ళి చేసుకుంటున్న నిత్య పెళ్ళి కొడుకు బండారం అతని ఇద్దరు భార్యలు బయటపెట్టారు. ఇప్పటివరకు 8 వివాహాలు చేసుకున్నట్లు, ఆ 8 మంది వివిధ పోలీస్స్టేషన్లలో ఇతనిపై కేసుపెట్టినట్లు నిర్ధారించారు. భాధిత మహిళలు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అడప శివశంకర్ బాబు.. మ్యాట్రిమోనీ ద్వారా వివాహమై భర్తను వదిలేసి డైవర్స్ తీసుకున్నవారు, డైవర్స్ కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నవారిని, ఉన్నత విద్య చదివినవారు, ఆర్థికంగా ఉన్నవారిని ఎంచుకుంటాడు. తనకుకూడా వివాహమైందని వివిధ కారణాలతో విడిపోయామని నకిలీ విడాకుల పత్రం చూపించి సంబంధం కలుపుకుంటాడు. తాను పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తానని నకిలీ ఐడీకార్డులు చూపిస్తాడు, నకిలీ పేస్లిప్ తయారు చేసి 2లక్షలు జీతం అని చెపుతాడు. తన తల్లిదండ్రులు చనిపోయారని నమ్మిస్తాడు. పెళ్ళి సమయంలో ప్రస్తుతం సమావేశానికి వచ్చిన నాలుగో భార్య 26 లక్షలు, ఐదవభార్య 35 లక్షలు నగదు, బంగారం రూపంలో కట్నంగా ఇచ్చినట్లు తెలిపారు. నాకు 2లక్షల జీతం ఇంకా నీవు ఉద్యోగం చేయడం ఎందుకని వారిని ఇంట్లోనుండి బయటకు రాకుండా ఉద్యోగాలు మాన్పిస్తాడు. పెళ్ళైన రెండు నెలల్లోనే ఆఫీస్ నుండి అమెరికావెళ్లే అవకాశం వచ్చిందని పెళ్ళి రిజిస్ట్రేషన్ కూడాచేయిస్తాడు. అమెరికా వెళ్లేదుకు డబ్బులు కావాలంటూ తిరిగి డబ్బులకోసం వేధిస్తుంటాడని వారు తెలిపారు. బయటపడింది ఇలా .. నాలుగవ భార్యవద్ద అమెరికా వెళదామ ని డబ్బు తీసుకోవడం, నైట్ డ్యూటీ, డే డ్యూటీ అంటూ ఇంటికి సరిగ్గా రాకపోవడంతో అనుమానం వచ్చి గట్టిగా నిలదీయండంతో నీకు రావల్సిన డబ్బులునీకు ఇచ్చేస్తానుఅని శివశంకర్ చెప్పాడు. దీంతో బాధిత మహిళ ఆర్.సీ పురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్టేషన్‌కు రా వాలని పోలీసులు ఒత్తిడి తేవడంతో ఐద వ భార్యను తీసుకుని స్టేషన్‌కు వెళ్లగా ఇద్ద రు భాధిత మహిళలు మాట్లాడుకుని ఇత ని గుట్టుమొత్తం బయటపెట్టారు. ఐదవ భార్యకూడా గట్టిగా మందలించడంతో ఈ నెల 7వ తేదీన ఆరవ భార్యను తీసుకుని వెళ్లిపోయినట్లు భాధిత మహిళ తెలిపింది. 8వ తేదీన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేయించినట్లు ఆమె పేర్కొంది. గుంటూరులో ఇతని తల్లిదండ్రులు ఉన్నారని మొదటి భార్య కూడా అక్కడేఉందని తెలిపారు. చదవండి: ఖైదీ నెంబర్ 2001.. నాగేశ్వర్రావు రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు -
బయటపడ్డ భర్త బాగోతం.. చితకబాదిన మొదటి భార్య
సాక్షి, కామారెడ్డి : గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకుని కామారెడ్డి అశోక్‌నగర్ కాలనీలో మకాం పెట్టిన ఓ భర్తను పట్టుకొని మొదటి భార్య దేహశుద్ది చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా ముఠా కొండూరు మండలం చేర్యాల గ్రామానికి చెందిన పరశురాం బోర్‌వేల్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య ధనలక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారంతా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వ్యాపారం నిమిత్తం అన్ని ప్రాంతాలకు తిరిగే పరశురాం మూడు నెలలుగా ఇంటికి తిరిగి వెళ్లలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా కామారెడ్డికి చెందిన ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని అశోక్‌నగర్‌లో ఉంటున్నాడని తెలిసింది. దీంతో సోమవారం బంధువులతో కలిసి వచ్చి, పరశురాంను పట్టుకుని చితకబాది తమ వెంట తీసుకెళ్లారు. తనకు మాయమాటలు చెప్పి అన్యాయం చేశాడని రెండో భార్య కవిత ఆరోపించింది. చదవండి : అంగట్లో ఆడపిల్ల: ఏడు నెలల్లో ఏడు సార్లు ప్రేమపెళ్లి: బాలికను వివాహమాడిన మరో బాలిక -
పెళ్లి చేసుకుని మొహం చాటేశాడు..
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : పెళ్లి చేసుకుని మొహం చాటేస్తున్నాడంటూ ఓ భార్య భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగిన సంఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. ఇంటిముందు టెంట్ వేసి, ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించిన రాణిని భర్త బంధువులు అడ్డుకుని దుర్భాషలాడారు. పెట్రోలు పోసి తగలబెడదామని బెదిరించారు. దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి భార్యను పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఆందోళన సద్దుమణిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకుల ఎస్తేరురాణి (రాధిక)కు, ఆకుల పవన్కృష్ణకు ఈ ఏడాది జనవరి నెలలో గూడెం రైల్వేస్టేషన్ వద్ద పరిచయం అయింది. స్థానిక జువ్వలపాలెంకు చెందిన టాక్సీ డ్రైవర్ అయిన పవన్‌కృష్ణ అప్పట్లో ఎస్తేరురాణిని స్వగ్రామం మౌంజిపాడుకు కిరాయి నిమిత్తం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒకరి ఫోన్ నంబర్లను మరొకరు తీసుకుని తరచూ ఫోన్లలో మాట్లాడుకునే వారు. వీరద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ వ్యవహారానికి దారితీసింది. మే నెలలో పాలంగి గ్రామంలోని శివాలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఎస్తేరురాణిని భర్త పవన్‌కృష్ణ రాధికగా అతని తల్లిదండ్రులకు, బంధువులకు పరిచయం చేశాడు. ఈ క్రమంలో దఫదఫాలుగా రాణి నుంచి పవన్ సుమారు రూ.3.30 లక్షలను తీసుకున్నాడు. కొన్ని రోజులకు తన నుంచి తన భర్త తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన ఎస్తేరురాణి అత్తవారింటికి వెళ్లింది. వారు ఆమెను బైటకు గెంటివేశారు. ఈ నేపథ్యంలో పవన్‌కృష్ణ బంధువులు ఎస్తేరురాణిపై పలుమార్లు దాడికి దిగారు. దీంతో ఉండ్రాజవరం, పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో ఆయా ప్రాంతాల పోలీసులు కేసులు నమోదు చేశారు. తన భర్తను తనకు అప్పగించాలని శనివారం అత్తవారి ఇంటి వద్ద ఆందోళనకు దిగిన ఎస్తేరురాణిని పవన్ తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వివాద సమాచారం అందుకున్న పోలీసులు రావడంతో సద్దుమణిగింది. ఎస్తేరురాణిని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఆమె ఇచ్చిన ఫిర్యాదును అందుకున్న సీఐ ఆకుల రఘు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్తేరురాణి సమస్యను పరిష్కరిందుకు మాతా శిశు సంరక్షణ శాఖ వార్డుల సూపర్వైజర్ మంగతాయారు, మానవహక్కుల కమిషన్ కార్యదర్శి విజయకుమారి, కేవీవీ లక్ష్మి, డి.గాయత్రిదేవిలు ఆమె వెంట ఉన్నారు. -
ఇదరు పిల్లలతో కలిసి అత్తింటి ఎదుట మహిళ ధర్నా..
సనత్‌నగర్: తనను ఇంటి నుంచి పంపించి తన భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ గృహిణి తన ఇద్దరి పిల్లలతో కలిసి అత్తింటి ముందు ధర్నాకు దిగింది. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. కోఠికి చెందిన లక్షితకు సనత్‌నగర్‌కు చెందిన శివకుమార్‌కు 2011 నవంబర్ 13న వివాహం జరిగింది. వీరికి లిఖిత, లోహిత్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఓ ప్రైవేటు సంస్థలో శివకుమార్ పని చేస్తుంటాడు. వివాహం కొంతకాలానికి భర్త, అత్తింటివారు వేధిస్తుండడంతో లక్షిత పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు భర్తతో పాటు అత్తింటి వారిపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో ఇటీవల భార్యాభర్తలు రాజీ పడడంతో కోర్టు ఆదేశాల మేరకు మూడు నెలలుగా కలసి ఉంటున్నారు. అయితే మూడు రోజుల క్రితం వారి మధ్య మళ్లీ ఘర్షణ తలెత్తడంతో లక్షిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. అయితే ఇంట్లో ఉంటే మళ్లీ ఆత్మహత్యాయత్నం చేసుకుంటుందనే కారణంతో భర్త లక్షితను ఇంట్లోకి రానివ్వక పోవడంతో ఆమె అత్తింటి ముందు మంగళవారం ధర్నాకు దిగింది. భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు ఎక్కువయ్యాయని తనను ఇంట్లో నుంచి పంపించివేసి తన భర్తకు మరో పెళ్లి చేయాలని చూస్తున్నారని లక్షిత ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. లక్షితకు మద్దతుగా ఆమె తల్లిదండ్రులతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు లక్షిత, ఆమె భర్త శివకుమార్లను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వారి మధ్య సయోధ్య కుదరలేదరు. దీంతో లక్షిత ఫిర్యాదు మేరకు భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. -
'పతి' వంచితురాలు.!
పదేళ్లుగా నరకంకడప నగరం నకాష్‌లోని మారెమ్మ గుడి పక్కన నివాసమున్న బంగారు వ్యాపారి గౌస్‌పీర్ 1991లో ముద్దనూరుకు చెందిన గౌసియాను వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు కలగలేదనే కారణాన్ని చూపి తనకు పరిచయమైన మరో మహిళను గౌస్‌పీర్ వివాహం చేసుకుని వేరే కాపురం పెట్టాడు. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా అడవిలో వదిలేసినట్లు శిథిలమైన ఇంటిలో వదిలేసి... కుక్కలకు విసిరేసినట్లు ఏదో ఒకటి తెచ్చి అలా వేసి పోతుండడం చూస్తే చనిపోవాలనిపిస్తోందని గౌసియా బోరున విలపిస్తోంది. సాక్షి కడప/అర్బన్ : ఎన్నో ఆశలతో... మరెన్నో ఆకాంక్షలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆడపడుచుకు అడుగడుగునా అన్యాయమే జరిగింది. పెద్దల సమక్షంలో వివాహం చేసుకుని, జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భర్త పిల్లలు పుట్టలేదనే సాకు చూపి దూరం పెట్టాడు. మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అంతవరకు ఏదో అనుకున్నా.. తొలి భార్యకు మాత్రం నరకం చూపించాడు. పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేని ఓ పాడుబడిన ఇంటిలో ఒంటరిగా వదిలేశాడు. ఇళ్లంతా పెచ్చులూడిపోయి మట్టి వాసన ఒకవైపు.. అక్కడే కాలకృత్యాలతో వస్తున్న దుర్వాసన ఇంకోవైపు.. తాగడానికి మంచినీరు పోసుకునే క్యాన్ సైతం పాచిపట్టి.. కుప్పలు కుప్పలుగా అక్కడే పడి ఉన్న పాత దుస్తుల దుర్గంధం మధ్యకాలం వెళ్లదీస్తున్న ఆ మహిళను చూస్తే ఎవరికైనా అయ్యో.. పాపం అనిపిస్తుంది. కానీ కట్టుకున్న భర్తకు మాత్రం కనికరం కలగలేదు. ఏదో పొద్దున, సాయంత్రం ఒకటో, రెండో ఇడ్లి, కొంచెం అన్నం బయటి నుంచి తెచ్చి ఆమె ముఖాన పడేస్తే సరిపోతుందనుకున్నాడో లేక దిక్కులేకుండా వదిలేస్తే మనో వేదనతో ఆమే తనువు చాలిస్తుందనుకున్నాడో తెలియదుగానీ ఆమె పడుతున్న వేదన మాత్రం అంతా ఇంతా కాదు. పైగా భర్తపై పెంచుకున్న మమకారం కాస్త ప్రస్తుతం మనోవేదనకు దారి తీయడంతో ఆమె కుంగిపోయింది. అందరూ ఉన్నా చెత్తకుప్పను తలపించేలా ఉన్న ఇంటిలో జీవచ్ఛవంలా బతుకు వెళ్లదీస్తోంది. ఆమెను కదిలిస్తే ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెబుతున్న మాటలు విన్నవారంతా అయ్యో..ఎంత అమానుషం.. అంటూ చలించిపోయారు. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినగౌసియా సోదరులు గౌసియా నివాసం వద్దకు వచ్చిన భర్త గౌస్‌పీర్‌ను స్థానికులతోపాటు బాధితురాలి బంధువులు టుటౌన్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీతోపాటు గౌసియా బంధువులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.విషయాన్ని డీఎస్పీ మాసుంబాషా దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ రుషేంద్రబాబును సాక్షి వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, పోలీసు స్టేషన్లో న్యాయం జరగకపోతే జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని బాధితురాలి బంధువులు తెలిపారు. ఇంటిలో నరకం ప్రస్తుతం ఉంటున్న ఇంటిలో గౌసియా నరకం అనుభవిస్తోంది. పాడుబడిన ఆ ఇంటిలోనే అన్నం తినడం, మల విసర్జన, పడుకోవడం అన్నీ అక్కడి పరిసరాల్లోనే. ఇంటి గోడలకు రంధ్రాలు పడి, పెచ్చులూడిపోయి లోపల ఎర్రటి మట్టి కనిపిస్తూ ఎలుకలు సైతం అక్కడే నివాసం చేస్తున్నాయి. ఇంటిని శుభ్రపరిచేవారు లేరు. కుటుంబ సభ్యులనునిలదీసిన జయశ్రీ గౌసియా పడుతున్న వేదన తెలుసుకుని అక్కడికి వచ్చిన మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ బాధితురాలు ఉంటున్న ఇంటికి పక్కనే ఖరీదైన భవంతిలో నివాసముంటున్న గౌస్‌పీర్ తల్లిని, అతని సోదరిని నిలదీశారు. పక్కింటిలోనే∙కోడలు అనాథలా బతుకుతుంటే మీకు పట్టదా? అంటూ ప్రశ్నించారు. దీంతో వాళ్లు తమకు ఏం సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతకుమునుపు జయశ్రీ ఇంటిలోకి వెళ్లి గౌసియాను పరామర్శించి ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గౌసియాను నరకయాతనకు గురి చేస్తున్న భర్తపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. జైలులో ఉన్న కరుడుగట్టిన ఖైదీలకు కూడా సౌకర్యాలు కల్పిస్తారని, కానీ గౌసియా అత్యంత దుర్భర పరిస్థితిలో జీవనం గడుపుతుండడం చూస్తే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్త, ఆడబిడ్డ పక్కనే ఉన్నా గౌసియాను అమానుష పరిస్థితుల్లో వదిలివేయడం దారుణమని. ఆమెను చంపకుండా చచ్చిపోయేలా చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. -
భర్త ఇంటి ముందు మహిళ ధర్నా
చెన్నై, అన్నానగర్: భర్తతో కలపాలని కోరుతూ కుమారుడితో సహా మహిళ అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. కన్యాకుమారి జిల్లా మార్తాండం విరికోడు ముండవిలై ప్రాంతానికి చెందిన రాజరత్తినం. ఇతని కుమార్తె రమ (24). ఈమెకు మార్తాండం సమీపం కోట్టగం సెంబక్కావిలైకి చెందిన మహేష్ (32)తో 2016లో వివాహం జరిగింది. మహేష్ విదేశంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన ఏడాదికి దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. మహేష్ కుటుంబ ఖర్చులకు నగదు ఇవ్వకుండా వచ్చాడు. దీనిపై రమ మార్తాండం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అనంతరం ఇద్దరు కలసి జీవించారు. తరువాత మహేష్ పని కోసం విదేశానికి వెళ్లాడు. కుటుంబ ఖర్చులకు నగదు పంపకపోవడంతో రమ పుట్టింటికి చేరుకుంది. ఈ స్థితిలో కొన్ని నెలల కిందట మహేష్ స్వగ్రామానికి వచ్చాడు. అయితే భార్యను కలువలేదు. అతనికి తల్లిదండ్రులు మరో వివాహం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న రమ గురువారం భర్తను చూసేందుకు అతని ఇంటికి వెళ్లిది. భర్త, అత్తామామలు ఆమెను ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో రమ తన కుమారుడితో భర్త ఇంటి ముందు కూర్చొని ధర్నాకు దిగింది. దీనిపై రమ తల్లి మహేశ్వరి మార్తాండం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కుమార్తెని భర్తతో కలుపాలని కోరింది. ఈ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కాపురం చేయనని
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐదు నెలలు కాపురం చేశాడు. ఇప్పుడేమో ఇంట్లో పెద్దవాళ్లకు ఇష్టం లేదు కాపురం చేయనని కరాఖండిగా చెప్పేశాడో ప్రబుద్ధుడు. దీంతో బాధితురాలు శుక్రవారం పెదవాల్తేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని రావికమతం మండలం గర్నికం గ్రామానికి చెందిన ఆర్లె శివ(23), తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదిమాతాండ గ్రామానికి చెందిన బాణోయ అనసూయ(20) 2016 సంవత్సరంలో ప్రేమించుకున్నారు. ఆమె బి.ఫార్మసీ చదువుకుని హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవారు. శివ రాజమండ్రి ఆదిత్య కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసేవాడు. వీరిద్దరూ 2017 డిసెంబర్ 23న స్నేహితుల సాయంతో సూర్యాపేటలో పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఐదు నెలల పాటు కాపురం చేసిన శివ అర్ధంతరంగా ముఖం చాటేశాడు. అదేమంటే తన ఇంట్లో తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడం గమనార్హం. దీంతో బాధితురాలు రావికమతం పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోయింది. పైగా రావికమతం ఎస్ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ భవాని, సీడీపీవో మంగతాయారు.. శివకు వత్తాసు పలుకుతున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. -
ప్రేమించానని.. పెళ్లాడి..మోసగించాడు
ఖమ్మంఅర్బన్ : ప్రేమించానంటూ వెంటబడ్డాడు. మాయమాటలు చెప్పాడు. చివరికి పెళ్లాడాడు. మూడు నెలలు కాపురం చేశాడు. ఇప్పుడు వెళ్లిపొమ్మంటున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె, న్యాయం కోసం అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె తెలిపిన వివరాలు... నగరంలోని పాండురంగాపురం ప్రాంతానికి చెందిన బాలాజీ, హైదరాబాద్‌లోని నాచారం విద్యుత్ శాఖలో ప్రయివేటు ఉద్యోగిగా (మీటర్ రీడింగ్ ఆపరేటర్‌గా) పనిచేస్తున్నాడు. నాచారం కార్తికేయ నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని స్వాతి(22)తో అతడికి పరిచయమేర్పడింది. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కొన్ని రోజులపాటు స్వాతి నిరాకరించింది. ఆ తరువాత అతడి మాయమాటలు నమ్మింది. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో, గత ఏడాది అక్టోబర్ 2న జడ్చర్లలోని ఆర్య సమాజ్‌లో బాలాజీ–స్వాతి పెళ్లి చేసుకున్నారు పాండురంగాపురంలోని తన ఇంటికి తీసుకొచ్చి కాపురం పెట్టాడు. మూడు నెలల వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి భర్త, అత్త, మామ, మరిది వేధింపులు మొదలయ్యాయి. శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. పైసా కట్నం రాలేదని, పైగా కులాంతర వివాహమని ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఐదు నెలలపాటు ఇవన్నీ భరించింది. ‘‘బాలాజీకి మరో పెళ్లి చేస్తాం. నువ్వు ఒప్పుకోవాలి’’ అంటూ వేధించసాగారు. ఆమె భరించలేక గత నెల 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్వాతిని, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు ఆమె తల్లి తీసుకెళ్లింది. అక్కడ ఆమె ప్రస్తుతం కోలుకుంది. ఆదివారం పాండురంగాపురం వచ్చింది. ఆమెను అత్త, మామ కలిసి బలవంతంగా ఇంటి బయటకు గెంటేశారు. ఇంటికి, గేటుకు తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. స్వాతి, సోమవారం ఉదయం నుంచి తన భర్త ఇంటి గేటు ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని, తన భర్తతో కాపురం సజావుగా సాగేలా చూడాలని కోరుకుంటోంది. ఆమెకు మహిళాసంఘాలు బాసటగా నిలిచాయి. స్వాతి భర్త బాలాజీని, అతడి కుటుంబీకులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఐ నాగేంద్రాచారి తెలిపారు. -
పతియే ప్రత్యక్ష ద్రోహి.!
అసలే పేదరికం.. నా అన్నవారెవ్వరూ లేరు.. బంధువుల మాటలు నమ్మి ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్నేళ్లు సంసారం సజావుగా సాగినా.. ఆ తర్వాత కట్టుకున్నోడు కర్కోటకుడయ్యాడు.. ఆమెను కువైట్‌కు పంపి.. ఆమె సంపాదన మొత్తం కాజేసి చివరకు కాలదన్నాడు.. ఏ దిక్కులేని దుస్థితిలో ఆమె రాయచోటిలోని నిరాశ్రయుల ఆశ్రమంలో తలదాచుకుంటోంది. దగాపడ్డ అభాగ్యురాలి దయనీయ గాథ ఆమె మాటల్లోనే... రాయచోటి టౌన్ : ‘నా పేరు ఇర్ల నాగలక్ష్మి.. మాది నల్గొండ జిల్లా.. పేద కుటుంబం. మా బంధువుల సూచన మేరకు చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వ్యక్తిని పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. మూడేళ్లు కలిసి బాగున్నాము. మాకు పిల్లలు పుట్టలేదు. మా భర్త బాగా చదువుకున్నాడు. ఎస్ఐ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని.. లా చేస్తున్నానని చెప్పాడు. ఎన్ని కష్టాలెదురైనా ఇద్దరం కలిసే ఎదుర్కొనేవాళ్లం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకో నన్ను కువైట్‌కు పంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. వెంటనే పాస్‌పోర్టు తయారు చేసి ఏడేళ్ల క్రితం కువైట్‌కు పంపాడు. అక్కడికి వెళ్లిన తరువాత క్రమం తప్పకుండా ఫోన్లు చేసేదానిని. నెల నెలా జీతం డబ్బులు పంపాను. డబ్బులు పంపినప్పుడల్లా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నానని లక్షలు లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం వచ్చిందా అంటే ఆ ప్రయత్నంలోనే ఉన్నానని.. ఉద్యోగం రాగానే నీకు ఫోన్ చేస్తానని చెప్పడంతో ఎంత కష్టం అయినా సరే భరిస్తానని చెప్పి అక్కడే ఉండి పని చేశాను. వచ్చిన డబ్బులు వచ్చినట్లే పంపించాను. ఐదేళ్లు పూర్తయిన తరువాత వేరేవారి ద్వారా ఒక పచ్చి నిజం తెలిసింది. ఆయన మరో పెళ్లి చేసుకున్నాడని ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడ్డాడని తెలిసింది. విషయం తెలిసి అతన్ని నిలదీయగా నిజం ఒప్పుకున్నాడు. ఇలా నాకు అన్యాయం చేయడం నీకు తగునా అని ప్రశ్నిస్తే.. అదేంటి.. నీవు కూడా ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకోపో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఆ తరువాత ఫోన్ చేసినా మాట్లాడే వాడు కాదు. మళ్లీ మళ్లీ ఫోన్ చేయగా ఒకసారి హైదరాబాద్‌కు వచ్చేయమన్నాడు. అయితే అక్కడ కూడా తాను భర్త అని చెప్పవద్దని .. తెలిసిన వ్యక్తి అని చెప్పాలన్నాడు. అక్కడ ఓ ధనవంతుల ఇంటిలో పనికి కుదిరిస్తానని.... అక్కడే ఆ ఇంటిలోనే ఉండి వారికి సేవలు చేసుకోవాలని చెప్పాడు. అవసరం అయితే నీవు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తానన్నాడు. ఆయన మాటలు విన్న తరువాత కడుపు మండి కువైట్ నుంచి నేరుగా తిరుపతికి వెళ్లాను. అక్కడ మా అత్తింటి వారు నన్ను చీదరించుకున్నారు. ఇంటిలోకి రానీయలేదు... ఇక పుట్టింటికి వెళదామంటే నాకంటూ ఎవరూ లేరు. ఎటు పోవాలో తెలియక నాకు కువైట్‌లో పరిచయం ఉన్న స్నేహితురాలు రాయచోటిలో ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఆమె నిరాశ్రయుల ఆశ్రమ కేర్ టేకర్‌గా పని చేస్తోంది. జరిగిన విషయం ఆమెకు చెప్పాను. ఆమె కూడా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడింది. నాగలక్ష్మి ఎవరో తనకు తెలియదని చెప్పాడు. ఇక చేసేది లేక నెల రోజుల నుంచి ‘‘నిరాశ్రయుల’’ ఆశ్రమంలో తలదాచుకొంటున్నాను’.. అని ఆమె తన కన్నీటి గాథను వివరించింది. మానవతావాదులు.. స్వచ్ఛంద సంస్థల వారు స్పందించి ఆమెకు మద్దతుగా న్యాయ పోరాటం చేసి మోసగాడికి శిక్ష పడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ప్రే‘ముంచాడు’
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: ప్రేమించానని వెంటపడి, తనను చివరకు పెళ్లి చేసుకోవాలని కోరితే పెద్దల ముందర సమయం కోరి.. మరో అమ్మాయిని పెళ్లాడాడు ఓ ప్రబుద్ధుడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితురాలు పాలకొండ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం మేరకు.. పాలకొండ మండలం అన్నవరం గ్రామానికి చెందిన పి.పార్వతి అనే యువతిని రేగిడి మండలం చిన్న శిర్లాంకు చెందిన బోనెల సుందరరావు(అలియాస్ చిరంజీవి) అనే యువకుడు ప్రేమించానని వెంటపడ్డాడు. ఈ వ్యవహారం కొద్దిరోజులు నడిచింది. తనను పెళ్లి చేసుకోవాలని పార్వతి కోరటంతో పెద్దల ఎదుట పంచాయతీ పెట్టిన చిరంజీవి కొంత సయమం కావా లని కోరాడు. దీంతో ఒప్పుకున్న పార్వతి కుటుంబ సభ్యులు సరే అన్నారు. ఇంతలో చిరంజీవి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు తెలియటంతో మోసపోయామని గుర్తించిన పార్వతి పాలకొండ పోలీస్ స్టేషన్లో గతనెల ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసిన ఏఎస్సై సింహాచలం దర్యాప్తు చేపట్టి శనివారం నిందుతున్ని అరెస్టు చేశారని ఎస్సై కె.వాసునారాయణ తెలిపారు. నిందుతుడిని రిమాండ్‌కు పంపించారు. -
నమ్మించి.. మోసం చేశాడు
కడప రూరల్ : నమ్మించి వివాహం చేసుకున్న తరువాత తన భర్త తనను మోసగించాడని కడప నగరానికి చెందిన ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెల్ల బోసుకున్నారు. స్థానిక ఒక హాస్పిటల్లో చెన్నూరుకు చెందిన యు. రవికుమార్ కాంపౌండర్‌గా, తాను స్వీపర్‌గా పని చేస్తుండే వారిమని తెలిపారు. తమ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నామని చెప్పారు. తరువాత అతను తనను వదిలి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు తనకు 18 నెలల కుమారుడు ఉన్నాడని తెలిపారు. ఈ విషయమై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపించారు. అనంతరం ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షం శ్రీనివాసులు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డెన్న మాట్లాడుతూ గిరిజన మహిళకు అన్యాయం జరగడం దారుణమన్నారు. న్యాయం కోసం కలెక్టర్ బాబూరావునాయుడును కలిసి వినతి పత్రం సమర్పించామని వివరించారు. ఈశ్వరమ్మకు న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
భర్త ఇంటిముందు భార్య నిరసన
శ్రీకాకుళం , కాశీబుగ్గ: భార్యా భర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నా.. పోలీసులు, కుల పెద్దలు, కుటుంబసభ్యులు వీటిని పరిష్కరించకపోవడంతో భర్త ఇంటి ముందు భార్య నిరసన తెలిపారు. పలాస పట్టణంలో కొత్తకోట జ్యోత్స్న తన పిల్లలతో భర్త జగన్ ఇంటి ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఇది వరకు అత్తమామలు ఇంటి ముందు నిరసన తెలిపినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ ఎస్ఐ ప్రసాదరావు బాధితురాలి ఇంటికి చేరుకుని సమస్య పరిష్కరించారు. -
నీరసించిన ఉమా మహేశ్వరి..
పశ్చిమగోదావరి , కొవ్వూరు: ఐదేళ్ల కాపురం అనంతరం భర్త నిరాదరణకు గురైన బండి ఉమా మహేశ్వరి(గౌరి) కొవ్వూరు మండలం మద్దూరులో చేపట్టిన నిరసన దీక్ష ఆరో రోజుకు చేరింది. కడియపులంకకు చెందిన ఉమా మహేశ్వరి మద్దూరుకు చెందిన బండి పూర్ణ సుబ్బారావును 2012లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం దుబాయ్ వెళ్లిన సుబ్బారావు ఉమా మహేశ్వరికి విడాకులు నోటీసులు పంపించాడు. దీంతో బాధితురాలు మద్దూరులోని సుబ్బారావు పెంపకానికి వచ్చిన అతని పెద నాన్న పుసులూరి గంగాధరరావు ఇంటివద్దనే నిరశన దీక్ష చేపట్టింది. అయితే ఆమె పూర్తిగా నీరసించి పోవడంతో బుధవారం వైద్యులు సెలైన్లు పెట్టారు. అధికార పార్టీ నేతల తీరుపై విమర్శలు అధికార పార్టీ నేతలు సుబ్బారావు కుటుంబానికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకుని ఐదేళ్ల పాటు కాపురం చేసి ఇప్పుడు విడాకులు ఇవ్వమంటున్నాడని ఓ మహిళ ఆవేదనతో రోడ్డెక్కి భర్త ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే ఇంత వరకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కేఎస్ జవహర్ ఆమెను పరామర్శించకపోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. తనకు న్యాయం చేసి తన కాపురం నిలబెట్టాలని బాధితురాలు దీనంగా వేడుకుంటోంది. మంత్రి అండతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బాధితురాలికి పలువురి మద్దతు ఇప్పటికే కాపు సంఘం యువకులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు, డీఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు అధికార పార్టీనేతలు బాధితురాలి భర్త పూర్ణ సుబ్బారావుకు అండగా ఉండడం చేతనే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, ఆ పార్టీ నాయకులు బాధితురాలిని పరామర్శించి ఆమెకు బాసటగా నిలిచారు. మాజీ ఎమ్మెల్సీ వైఎస్సార్ సీపీ నేత కందుల దుర్గేష్ బుధవారం దీక్షా శిబిరాన్ని సందర్శించి బాధితులిరాలి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధితురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గురుజు బాలమురళీకృష్ణ, కడియపులంక మాజీ సర్పంచ్ గట్టు నరసయ్య, గంగుమళ్ల శేషగిరి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దళిత హక్కుల పోరాట సమితి నాయకురాలు ఎండీ సలీమ, బాధితురాలి బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారిద్దరూ కలిసున్నా అభ్యంతరం లేదు :విలేకరులతో మాట్లాడిన పూర్ణ సుబ్బారావు తల్లిదండ్రులు చాగల్లు: బండి ఉమా మహేశ్వరి దీక్షపై ఎట్టకేలకు చంద్రవరంలో పూర్ణ సుబ్బారావు తల్లిదండ్రులు బండి సత్యనారాయణ, లక్ష్మీ తాయారు స్పందించారు. బుధవారం వారు గ్రామంలో ఎంపీపీ రమామణి ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్రిక్తతలకు తావివ్వకుండా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఐదేళ్ల క్రితం కొవ్వూరు పోలీస్‌స్టేషన్‌లో వీరిద్దరి వివాహం మా ప్రమేయం లేకుండానే జరిగిందని చెప్పారు. సుబ్బారావు చిన్ననాటి నుంచి మద్దూరులో ఉన్న పెదనాన్న వద్ద పెరిగాడని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న వీరి కుటుంబ కలహాలు కూడా తమకు ఏమాత్రం తెలియదన్నారు. అయితే మంగళవారం అమెకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో కొంతమంది తమ ఇంటివద్దకు వచ్చి హడావుడి సృష్టించారన్నారు. కొడుకు, కోడలు కలిసి ఉన్నా మాకు అభ్యంతరం లేదని తెలిపారు. కాగా తమకు మిగిలిన కుమారుల మీద కూడా కేసులు పెట్టారని సుబ్బారావు తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎంవీ సుబ్బారావు, మాజీ వైస్ ఎంపీపీ మద్దుకూరి వీరరాఘవులు, కోడూరి ప్రసాద్, మద్దుకూరి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమించి.. పెళ్లాడి.. పరారయ్యాడు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్) : నువ్వంటే ఇష్టమని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకలేనని.. నీతోనే నా జీవితమని నమ్మబలికాడు.. ప్రేమించి, పెళ్లాడి చివరకు పరారయ్యాడు. కండ్రిక ప్రాంతంలో ఓ యువతిని మోసం చేసి పరారైన ఓ ప్రబుద్ధుడి వైఖరి ఇదీ. వివరాల్లో కెళ్తే. కండ్రిక కాలనీకి చెందిన కర్రా బాలమ్మ (20) తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు చేతోడు వాదోడుగా ఉండేందుకు బాలమ్మ కూడా కేటరింగ్ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుండేది. ఈ పనుల్లో భాగంగా గతేడాది గుంటూరు ప్రాంతానికి వెళ్లింది. అక్కడ చిలకలూరిపేటకు చెందిన కిరణ్‌కుమార్ అనే వ్యక్తి ఆమెతో పరిచయం చేసుకొని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆ వ్యక్తి మాటలను నమ్మిన ఆమె సరే అంది. దీంతో ఆరు నెలల కిందట అతగాడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని కండ్రికలో కాపురం పెట్టాడు. పెళ్లైన మొదట్లో బాగానే ఉన్న కిరణ్ ఆ తరువాత భార్య బాలమ్మను కట్నం డబ్బులు కావాలంటూ వేధిస్తూ ఉండేవాడు. కూలి పనులు చేసుకునే మా తల్లిదండ్రులు అంత డబ్బులు ఇవ్వలేరంటూ ఆమె చెప్పుకుంటూ వస్తుంది. ఈ నెల 3వ తేదీన కిరణ్ చిలకలూరిపేటలోని తన ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్లు చేస్తే నిన్ను వదిలేసా, డబ్బులిస్తేనా వస్తానంటూ చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. దీంతో అతడి ఆచూకీ కోసం వెతుకులాడిన ఆమె విసుగుపోయి బుధవారం నున్న పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
రహస్య వివాహం చేసుకుని.. గర్భిణిని చేసి..
రాజంపేట : ప్రేమించాడు. ఆ తర్వాత రహస్య వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఆపై ముఖం చాటేశాడు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె రాజంపేటలోని భర్త ఇంటి ఎదుట సోమవారం నిరాహారదీక్ష చేపట్టింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజంపేట పట్టణంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రంగాయపల్లె రెడ్డయ్య అనే యువకుడు శివపురం రంగయ్య కుమార్తె విజయలక్ష్మీ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విజయలక్ష్మీ గర్భం దాల్చింది. ఇప్పుడే పిల్లలు వద్దని, పెద్దలను ఒప్పించిన తర్వాత ఆలోచిద్దామని మాయమాటలు చెప్పి అబార్షన్ చేయించాడు. విజయలక్ష్మిని ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని అనుమానించిన ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గతంలో పట్టణ సీఐ ఇరు కుటుంబాల వారిని పిలిపించి మాట్లాడారు. తాను అందరి సమ్మతితో పెళ్లి చేసుకుంటానని, లేని పక్షంలో తనపై పోలీసులు ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని రెడ్డయ్య ఉరఫ్ రెడ్డి రాకేష్ రాతపూర్వకంగా పోలీసుల సమక్షంలో రాసి ఇచ్చాడు. అయితే ఇప్పుడు తాను విజయలక్ష్మిని వివాహం చేసుకోనని, ఆమెది తమ కులంకాదని మొండికేశాడు. దీంతో ఆమె భర్త ఇంటి ఎదుట నిరాహారదీక్షకు దిగింది. ఈమెకు పలువురు సంఘీభావం తెలుపుతున్నారు. కాగా అధికారపార్టీకి చెందిన ఇద్దరు నాయకులు భార్యను మోసం చేసిన భర్తకు అండగా నిలిచి మధ్యవర్తిత్వం చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
కోలారు: కట్నం తేలేని పక్షంలో తాను మరో యువతిని వివాహం చేసుకుంటానని హెచ్చరించడంతో ఓ ఇల్లాలు తన భర్త ఇంటి ఎదుటే ఆందోళనకు దిగింది. ఈఘటన మంగళవారం శ్రీనివాసపురం తాలూకా శెట్టిహళ్లిలో చోటు చేసుకుంది. వివరాలు.... శెట్టిహళ్లికి చెందిన మంజునాథ్, అదే ప్రాంతానికి చెందిన వేదకు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. అయితే కట్నం తేవాలంటూ పెళ్లయిన మూడు నెలలకే మంజునాథ్ తన భార్యను పుట్టినింటికి పంపించి వేశాడు. విడాకులు ఇచ్చి తాను మరో వివాహం చేసుకుంటానని హెచ్చరికలు జారీ చేశాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో వేద మంగళవారం తన భర్త ఇంటిముందు బైఠాయించింది. తనకు భర్త కావాలని, ఈమేరకు న్యాయం చేయాలని వేడుకుంది. వేదకు గ్రామంలోని రైతు సంఘం, దళిత సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పంచాయితీ చేసి న్యాయం చేస్తామని గ్రామపెద్దలు చెప్పడంతో ఆమె తాత్కాలికంగా ధర్నాను విరమించింది. -
ఖాకీసారూ.. ఇదేమి తీరు!
అనంతపురం సెంట్రల్: నగరంలోని పాతూరు రాజాజీవీధిలో నివాసముంటున్న గవిసిద్దన్న గౌడ్ కుమారుడు చంద్రమోహన్‌గౌడ్‌కు నగరానికే చెందిన రామకృష్ణ కుమార్తె అనితతో గతేడాది మార్చిలో వివాహమైంది. 30తులాల బంగారు, రూ. 5లక్షల నగదు కట్నకానుకల కింద ఇచ్చుకున్నారు. తొలినాళ్లలో సంతోషంగా సాగిన వీరి సంసారంలో చిన్నచిన్న మనస్పర్థలు వచ్చాయి. భర్త నుంచి అనితకు వేధింపులు మొదలయ్యాయి. అయినా ఆమె అలాగే భరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో చంద్రమోహన్ తన తండ్రిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆస్తిపాస్తుల పత్రాలన్నీ వెంట తీసుకెళ్లాడు. ఐదారు నెలలవుతున్నా తిరిగి చూడలేదు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆశ్రయించింది. కౌంటర్ కేసులు : గతంలో వన్‌టౌన్ సీఐగా పనిచేసిన రాఘవన్ ఈ విషయంలో ఇరువర్గాల వారికీ కౌన్సెలింగ్ చేశారు. సమస్య కొలిక్కి వచ్చేవరకు జీవనానికి ప్రస్తుతం ఉన్న ఇంటితో పాటు వెనుక ఉన్న మరోపోర్షన్ ఇంటిని అద్దెకు ఇచ్చుకొని జీవించాలని అమ్మాయికి సూచించారు. వన్‌టౌన్ సీఐగా సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. భర్త, ఆడపడుచు కలిసి అనితపై ఫిర్యాదు చేయడంతో ఆమెపై కౌంటర్ కేసులు నమోదు చేశారు. పైగా ప్రస్తుతమున్న ఇల్లు ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ వస్తున్నారు. రైటర్ ఆనంద్ ప్రతి రోజూ వచ్చి ఖాళీ చేయకపోతే మేమే బలవంతంగా సామాన్లు బయటకు పడేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. జీవనం కోసం ఉంచుకున్న మరో ఇంటిని బలవంతంగా పోలీసులే దగ్గరుండి పగలగొట్టించారని ఆరోపించింది. సీఐపై కేసు వేయడంతోనేనా? సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని బాధితురాలు కోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని జీర్ణించుకోలేకపోవడంతో కేసును ప్రిస్టేజస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోబాధితులపై కౌంటర్ కేసులు పెట్టించినట్లు సమాచారం. పోలీసులే బెదిరిస్తే తమకు ఇక న్యాయం ఎవరు చేస్తారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్నఫలంగా గెంటేస్తే తాను ఎలా బతకాలని, ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సివిల్ పంచాయితీలు చేయకూడదని ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటిని బేఖాతరు చేస్తున్నారని దీంతో నిరూపితమవుతోంది. భార్యాభర్తల విషయం, ఆస్తి తగదాల విషయం కోర్టులో పరిష్కరించుకోవాల్సిన అంశాలు. అయినప్పటికీ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తుండడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటితో ఆమెకు సంబంధం లేదు ప్రస్తుతం నివాసముంటున్న ఇల్లుతో అనితకు సంబంధం లేదు. యూఎస్ఏలో ఉంటున్న చంద్రమోహన్ అక్కకు ఆ ఇంటిని వాళ్లనాన్న రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆమె పిటిషన్ పెట్టుకుంది. ఈ విషయాన్ని అనితకు చెప్పాం. అలాగే ఆమె ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశామని, కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని తెలియజేశాం. – సాయిప్రసాద్, సీఐ, వన్‌టౌన్ పోలీసులకేం తెలుసు మా బాధ! తమ బిడ్డకు పోలీసులే న్యాయం చేయడం లేదు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. పెళ్లి జరిగి ఏడాదైంది. ఇలాంటి సమయంలో బాధితురాలికి అండగా ఉండాల్సింది పోయి మగ పిల్లాని పక్షాన నిలబడుతున్నారు. పెళ్లి చేసుకొని అమ్మాయిని వదిలిపెట్టిపోతే తల్లిదండ్రులకు ఉండే బాధ వారు గుర్తించడం లేదు. ప్రతి రోజూ పోలీసులు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. – యల్లమ్మ, అనిత తల్లి -
పెళ్లాం ఊరెళ్తే ప్రియురాలితో ....
బొమ్మనహళ్లి : భార్య పుట్టింటికి వెళ్లగా ప్రియురాలితో తన ఇంట్లోనే కాపురం పెట్టాడు ఓ ప్రభుద్ధుడు. ఊరి నుంచి వచ్చిన భార్య ఆ ఇద్దరిని గదిలో బంధించి పోలీసులకు పట్టించింది. ఈ ఘటణ శుక్రవారం మడివాళ పోలిసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన రెడ్డప్ప, నాగమణి దంపతులు జీవనోపాధి కోసం బెంగళూరుకు చేరుకొని హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని 7వ సెక్టర్లో నివాసం ఉంటున్నారు. నాగమణి కూలి పనులకు వెళుతుండగా రెడ్డప్ప ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా రెడ్డప్ప మరో వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న భార్య భర్తను మందలించింది. అయినప్పటికీ పెడచెవినపెట్టాడు. ఈక్రమంలో వారం రోజుల క్రితం నాగమణి సొంతూరుకు వెళ్లింది. ఇదే అదనుగా రెడ్డప్ప ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చాడు. స్థానికులు ఈ విషయాన్ని మొబైల్ ద్వారా నాగమణికి తెలిపారు. శుక్రవారం ఉదయాన్నే ఇంటికి చెరుకున్న నాగమణి..ఇంట్లో భర్త, అతని ప్రియురాలు ఉండటాన్ని గుర్తించి బయటి నుంచి గొళ్లెం పెట్టింది. మడివాళ పోలీసులు వచ్చే సమయానికి రెడ్డప్ప తప్పించుకోగా ఇంట్లోనే ప్రియురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.