పెళ్లాం ఊరెళ్తే ప్రియురాలితో .... | man cheated wife with affair with lover | Sakshi
Sakshi News home page

పెళ్లాం ఊరెళ్తే ప్రియురాలితో ....

Published Sat, Jun 25 2016 9:08 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

పెళ్లాం ఊరెళ్తే  ప్రియురాలితో .... - Sakshi

పెళ్లాం ఊరెళ్తే ప్రియురాలితో ....

బొమ్మనహళ్లి :  భార్య పుట్టింటికి వెళ్లగా ప్రియురాలితో తన ఇంట్లోనే  కాపురం పెట్టాడు ఓ ప్రభుద్ధుడు. ఊరి నుంచి వచ్చిన భార్య   ఆ ఇద్దరిని గదిలో బంధించి పోలీసులకు పట్టించింది. ఈ ఘటణ శుక్రవారం మడివాళ పోలిసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన రెడ్డప్ప, నాగమణి దంపతులు జీవనోపాధి కోసం బెంగళూరుకు చేరుకొని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని 7వ సెక్టర్‌లో నివాసం ఉంటున్నారు. నాగమణి కూలి పనులకు వెళుతుండగా రెడ్డప్ప ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా రెడ్డప్ప మరో వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు.

 విషయం తెలుసుకున్న భార్య భర్తను మందలించింది. అయినప్పటికీ పెడచెవినపెట్టాడు. ఈక్రమంలో వారం రోజుల క్రితం నాగమణి సొంతూరుకు వెళ్లింది. ఇదే అదనుగా రెడ్డప్ప ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చాడు.  స్థానికులు ఈ విషయాన్ని మొబైల్ ద్వారా నాగమణికి తెలిపారు. శుక్రవారం ఉదయాన్నే ఇంటికి చెరుకున్న నాగమణి..ఇంట్లో భర్త, అతని ప్రియురాలు ఉండటాన్ని గుర్తించి బయటి నుంచి గొళ్లెం పెట్టింది. మడివాళ పోలీసులు వచ్చే సమయానికి రెడ్డప్ప  తప్పించుకోగా ఇంట్లోనే ప్రియురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement