
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: ప్రేమించానని వెంటపడి, తనను చివరకు పెళ్లి చేసుకోవాలని కోరితే పెద్దల ముందర సమయం కోరి.. మరో అమ్మాయిని పెళ్లాడాడు ఓ ప్రబుద్ధుడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితురాలు పాలకొండ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం మేరకు..
పాలకొండ మండలం అన్నవరం గ్రామానికి చెందిన పి.పార్వతి అనే యువతిని రేగిడి మండలం చిన్న శిర్లాంకు చెందిన బోనెల సుందరరావు(అలియాస్ చిరంజీవి) అనే యువకుడు ప్రేమించానని వెంటపడ్డాడు. ఈ వ్యవహారం కొద్దిరోజులు నడిచింది. తనను పెళ్లి చేసుకోవాలని పార్వతి కోరటంతో పెద్దల ఎదుట పంచాయతీ పెట్టిన చిరంజీవి కొంత సయమం కావా లని కోరాడు.
దీంతో ఒప్పుకున్న పార్వతి కుటుంబ సభ్యులు సరే అన్నారు. ఇంతలో చిరంజీవి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు తెలియటంతో మోసపోయామని గుర్తించిన పార్వతి పాలకొండ పోలీస్ స్టేషన్‌లో గతనెల ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసిన ఏఎస్సై సింహాచలం దర్యాప్తు చేపట్టి శనివారం నిందుతున్ని అరెస్టు చేశారని ఎస్సై కె.వాసునారాయణ తెలిపారు. నిందుతుడిని రిమాండ్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment