సాక్షి, కామారెడ్డి : రాహుల్ గాంధీ తలచుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం షబ్బీర్ అలీనే అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కునూర్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్లొన్న రేవంత్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఎన్నికల్లో ఓడిపోతున్నా షబ్బీర్ అలీ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్థన్ అసలు కామారెడ్డిలో ఒక్కసారైన కనిపించారా అని ప్రశ్నించారు.
కామారెడ్డి ప్రజలకు షభ్బీర్ అలీ ముత్యం లాంటి వ్యక్తి అని ఆయనే రేపు కాబోయే ఉప ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తలుచుకుంటే ఆయనే సీఎం కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ప్రశ్నించిన వారిపై కేసీఆర్ అక్రమంగా కేసుల పెడుతున్నారని.. వాటికివ్వరు బయపడేది లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పెదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు లాంటి ఒక్క పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.
కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టడానికి తాను రోడ్ షోలు చేస్తున్నట్లు రేవంత్ అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు డబ్బులిస్తే తీసుకోండని.. అవి మీ డబ్బులే కాబట్టి తీసుకుని ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టండని పిలుపునిచ్చారు. అక్రమ ఫైల్స్ దొరికాయని నాపై దాడులు చేశారు.. చివరికి కొండను తవ్వి ఎలుకని పట్టినట్లు నా దగ్గర ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment