దేవునిపల్లి, న్యూస్‌లైన్ :
కామారెడ్డి పట్టణంలోని సైలాన్ బాబా కాలనీలో నివసించే షరీఫా బేగం, హైమద్‌పాషా దంపతులకు ముగ్గురు పిల్లలు. మొద టి ఇద్దరు కవలలు. వారికి 13 ఏళ్లు. చిన్నకుమారుడు ఆయాన్‌కు ప్రస్తుతం ఐదేళ్లు. హైమ ద్ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. పుట్టిన ఆరు నెలలకే ఆయాన్ నోరు, ముక్కులోంచి రక్తం కక్కుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి తలసేమియా వ్యాధి ఉన్నట్లు గుర్తిం చారు. నెలకోసారి రక్తం ఎక్కించాలని సూచిం చారు. లేకపోతే రక్తహీనతతో మరణించే ప్రమాదం ఉందన్నారు. దీంతో నెలకోసారి హైదరాబాద్‌లోని చత్తాబజార్ ఏరియాలో ఉన్న తలసేమియా సంస్థ అస్పత్రికి తీసుకెళ్లి ‘ఓ’ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించుకుంటూ వస్తున్నారు.
ఆయాన్‌కు నాలుగేళ్ల వయసునుంచి 15 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి వస్తోంది. వైద్యం, రక్తానికి, మం దులకు, ప్రయాణ చార్జీలకు నెలకు ఐదు వేల రూపాయల వరకు ఖర్చవుతున్నాయని ఆయాన్ తండ్రి హైమద్ తెలిపారు. ఢిల్లీలో ఆపరేషన్ చేస్తారని, * 10 లక్షలు ఖర్చవుతాయని, అయి తే వ్యాధి ఖచ్చితంగా నయమవుతుందని చెప్పలేమని వైద్యులు తెలిపారన్నారు. అంతడబ్బు తానెక్కడినుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు జీవి తాంతం ఇలా బాధపడాల్సిందేనా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. ఆయాన్‌కు సహాయం చేయాలనుకునేవారు 95738 90558 నెంబర్‌లో హైమద్‌ను సంప్రదించగలరు.
పేదకు పెద్ద జబ్బు
Published Sun, Sep 8 2013 5:50 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement