కామారెడ్డి, న్యూస్‌లైన్: జిల్లాలోని 718 పంచాయతీలను 477 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్‌కో పంచాయతీ కార్యదర్శి పనిచేయాల్సి ఉంది. అయితే జిల్లాలో 163 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 314 పంచాయతీ కార్యదర్శుల పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 66 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేసింది. సదాశివనగర్ మండలంలో 24 పంచాయతీలుండగా ఏడుగురు, కామారెడ్డి మండలం లో 17 పంచాయతీలకుగాను నలుగురు పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో కార్యదర్శులకు వేరే క్లస్టర్ల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
రెండు, మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా చేశారు. అంటే ఒక పంచాయతీ కార్యదర్శి ఐదారు గ్రామాల బాధ్యతలు చూడాల్సి వస్తుండడంతో పాలన కుంటుపడుతోంది. పంచాయతీ కార్యదర్శులతో పనులు ఉంటే ఆయన ఏ గ్రామంలో ఉన్నాడో తెలుసుకుని, అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో కీలకమైన భూముల వ్యవహారం చూసే రెవెన్యూ కార్యదర్శుల పోస్టులదీ ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల 65 రెవెన్యూ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇంకా రెండు వందలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అరకొర పోస్టుల భర్తీ ప్రకటనలపై నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని కోరుతున్నారు.
ఖాళీలెన్నో.. ‘కొలువులు’ కొన్నే..
Published Wed, Jan 1 2014 6:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement